Marrige women
-
ఐదేళ్ల దోస్తానా! వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు
ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్లు కేథరీన్ బ్రంట్, నటాలీ స్కివర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఐదేళ్లగా రిలేషన్ షిప్లో ఉన్న వీరిద్దరూ ఆదివారం (మే 29) పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. "వీకెండ్లో వివాహం చేసుకున్న కేథరీన్ బ్రంట్, నాట్ స్కివర్‌లకు మా హృదయపూర్వక అభినందనలు" అంటూ ఇంగ్లండ్ క్రికెట్ ట్విట్ చేసింది. ఇక వీరిద్దరి వివాహ వేడుకకు పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు, మాజీలు హాజరయ్యారు. ఇక 2017 మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో వీరిద్దరూ భాగమై ఉన్నారు. కాగా.. ప్రపంచ క్రికెట్లో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం ఇదే తొలి సారి కాదు. గతంలో న్యూజిలాండ్ కు చెందిన అమీ సటర్త్‌వైట్, లియా తహుహు పెళ్లి చేసుకున్నారు. వీరితో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్లు మా రిజాన్ కాప్, డేన్ వాన్ నీకెర్క్ కూడా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆశిష్ నెహ్రా.. తొలి ‘భారత’ హెడ్ కోచ్‌గా! Our warmest congratulations to Katherine Brunt & Nat Sciver who got married over the weekend ❤️ pic.twitter.com/8xgu7WxtFW — England Cricket (@englandcricket) May 30, 2022 -
ఔను, ఆ యువతులిద్దరూ ఒక్కటయ్యారు.!
చంఢీగఢ్: సాధారణంగా పెళ్లి ఎవరు చేసుకుంటారు? ఇంకెవరు.. ఆడ, మగ చేసుకుంటారు. కానీ అంతటా ఇలా జరగదు. కొన్ని చోట్ల ఆడవారు ఆడవారిని, మగవారు మగవారిని పెళ్లి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి ఓ వింత వివాహం హర్యానాలో జరిగింది. వివరాలు.. గురుగ్రామ్‌కు చెందిన 20 ఏళ్ల బాలిక, జాజర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల బాలిక మంచి స్నేహితులు. వీరిద్దరు కూడా జాజర్ జిల్లాలోని ఒకే పాఠశాలలో చదువుకునేవారు. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండేవాళ్లు కాదు. అలా 7 సంవత్సరాల స్నేహాం కాస్తా ప్రేమగా మారింది. ఎలాగైనా ఒక్కటవ్వాలనుకున్నారు. దీంతో వీరి ప్రేమను వారి తల్లిదండ్రులకు చెప్పారు. ఇదెక్కడి ఘోరమని వారి నిర్ణయాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సమాజంలో ఆమోద యోగ్యం కాదు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని చెప్పారు. కానీ అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న యువతలికీ వారి మాటలను వినిపించుకోలేదు. ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఒకరోజు ఇద్దరూ తమ ఇంట్లో నుంచి పారిపోయి సోన్‌హాలోని ఒక ఆలయానికి చేరుకున్నారు. అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాం చేసుకున్నారు. ఈ విషయం తెలియని జాజర్ యువతి తండ్రి తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా యువతులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అమ్మాయిలిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక న్యాయస్థానం ముందు హజరుపర్చారు. ఈ క్రమంలో వీరి మధ్య వాదనలు ఆసక్తిగా జరిగాయి. ఆ యువతులిద్దరు తాము మేజర్లమని.. తమ ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని కోర్టుకు తెలిపారు. అయితే, ఆ యువతుల తల్లిదండ్రులు మాత్రం వారికి నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారట కానీ వారు అస్సలు వినిపించుకోవడం లేదట. ఏదేమైనా ఇద్దరూ కలిసి జీవించడానికి మొగ్గుచూపుతున్నారని హెలినామ్డి పోలీసు అధికారి మహేష్ కుమార్ తెలిపారు. చదవండి: Odisha DGP: హిజ్రాలకు కూడా పోలీసు ఉద్యోగాలలో అవకాశం.. -
కల్యాణలక్ష్మి కోసం కక్కుర్తి.. అడ్డంగా దొరికిపోయారు!
సాక్షి, బయ్యారం(మహబూబబాద్): నిరుపేద యువతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకాన్ని కొందరు అభాసుపాలు చేస్తున్నారు. పథకం ప్రారంభం కాక ముందు జరిగిన వివాహాలు ఇటీవలే జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించారు. అయితే, విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు దీన్ని అడ్డుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన ముగ్గురు మహిళలకు ఐదేళ్ల క్రితం, మరో మహిళకు రెండేళ్ల క్రితం వివాహాలు జరిగాయి. వీరిలో ఇద్దరికి ఐదు, నాలుగేళ్ల పిల్లలు కూడా ఉన్నారు. అయితే, తాజాగా వారి పేరున కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరవడంతో అనుమానం వచ్చిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నలుగురికి సంబంధించిన చెక్కులను నిలిపివేశామని తహసీల్దార్ నాగభవాని మంగళవారం తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమార్కులను శిక్షించాలని స్థానికులు కోరారు.