ప్రతీకాత్మకచిత్రం
చంఢీగఢ్: సాధారణంగా పెళ్లి ఎవరు చేసుకుంటారు? ఇంకెవరు.. ఆడ, మగ చేసుకుంటారు. కానీ అంతటా ఇలా జరగదు. కొన్ని చోట్ల ఆడవారు ఆడవారిని, మగవారు మగవారిని పెళ్లి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి ఓ వింత వివాహం హర్యానాలో జరిగింది. వివరాలు.. గురుగ్రామ్‌కు చెందిన 20 ఏళ్ల బాలిక, జాజర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల బాలిక మంచి స్నేహితులు. వీరిద్దరు కూడా జాజర్ జిల్లాలోని ఒకే పాఠశాలలో చదువుకునేవారు. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండేవాళ్లు కాదు. అలా 7 సంవత్సరాల స్నేహాం కాస్తా ప్రేమగా మారింది. ఎలాగైనా ఒక్కటవ్వాలనుకున్నారు. దీంతో వీరి ప్రేమను వారి తల్లిదండ్రులకు చెప్పారు.
ఇదెక్కడి ఘోరమని వారి నిర్ణయాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సమాజంలో ఆమోద యోగ్యం కాదు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని చెప్పారు. కానీ అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న యువతలికీ వారి మాటలను వినిపించుకోలేదు. ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఒకరోజు ఇద్దరూ తమ ఇంట్లో నుంచి పారిపోయి సోన్‌హాలోని ఒక ఆలయానికి చేరుకున్నారు. అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాం చేసుకున్నారు. ఈ విషయం తెలియని జాజర్ యువతి తండ్రి తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా యువతులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు.
అమ్మాయిలిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక న్యాయస్థానం ముందు హజరుపర్చారు. ఈ క్రమంలో వీరి మధ్య వాదనలు ఆసక్తిగా జరిగాయి. ఆ యువతులిద్దరు తాము మేజర్లమని.. తమ ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని కోర్టుకు తెలిపారు. అయితే, ఆ యువతుల తల్లిదండ్రులు మాత్రం వారికి నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారట కానీ వారు అస్సలు వినిపించుకోవడం లేదట. ఏదేమైనా ఇద్దరూ కలిసి జీవించడానికి మొగ్గుచూపుతున్నారని హెలినామ్డి పోలీసు అధికారి మహేష్ కుమార్ తెలిపారు.
చదవండి: Odisha DGP: హిజ్రాలకు కూడా పోలీసు ఉద్యోగాలలో అవకాశం..
Comments
Please login to add a commentAdd a comment