Lesbian couples
-
ఐదేళ్ల దోస్తానా! వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు
ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్లు కేథరీన్ బ్రంట్, నటాలీ స్కివర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఐదేళ్లగా రిలేషన్ షిప్లో ఉన్న వీరిద్దరూ ఆదివారం (మే 29) పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. "వీకెండ్లో వివాహం చేసుకున్న కేథరీన్ బ్రంట్, నాట్ స్కివర్‌లకు మా హృదయపూర్వక అభినందనలు" అంటూ ఇంగ్లండ్ క్రికెట్ ట్విట్ చేసింది. ఇక వీరిద్దరి వివాహ వేడుకకు పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు, మాజీలు హాజరయ్యారు. ఇక 2017 మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో వీరిద్దరూ భాగమై ఉన్నారు. కాగా.. ప్రపంచ క్రికెట్లో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం ఇదే తొలి సారి కాదు. గతంలో న్యూజిలాండ్ కు చెందిన అమీ సటర్త్‌వైట్, లియా తహుహు పెళ్లి చేసుకున్నారు. వీరితో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్లు మా రిజాన్ కాప్, డేన్ వాన్ నీకెర్క్ కూడా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆశిష్ నెహ్రా.. తొలి ‘భారత’ హెడ్ కోచ్‌గా! Our warmest congratulations to Katherine Brunt & Nat Sciver who got married over the weekend ❤️ pic.twitter.com/8xgu7WxtFW — England Cricket (@englandcricket) May 30, 2022 -
తండ్రైన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగన్ స్కాట్
సిడ్నీ: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగాన్ స్కాట్ తండ్రి అయ్యింది. తన భాగస్వామి జెస్ హోలియోక్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా మెగాన్ స్కాట్ పంచుకుంది. మా క్యూట్ బేబీ ఎమర్జెనీ సి సెక్షన్ ద్వారా ఈ భూమి మీదకు వచ్చిందిని ఆమె ట్విట్ చేసింది. ఆగస్టు 17న జన్మించిన చిన్నారికి ‘రిలీ లూయిస్ స్కాట్’ అని పేరు కూడా పేట్టేశారు. 24 వారాల మా నిరీక్షణకు ఫలితం దక్కిందిని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఇలాంటి ఇద్దరు అందమైన అమ్మాయిలు నా జీవితంలో ఉండడం నా అదృష్టం’ అంటూ మెగన్ స్కాట్ పేర్కొంది. కాగా 2018 ఆస్ట్రేలియాలో స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను చట్టబద్ధం చేశారు. దీంతో 2019లో తన చిరకాల భాగస్వామి అయిన జెస్ హోలీయోక్ను మేగాన్ స్కాట్ వివాహం చేసుకుంది. ఈ ఏడాదిలో మేలో జెస్ హోలియోక్ గర్బం దాల్చినట్లు స్కాట్ ప్రటించింది. ఆమె తన భార్య జెస్తో కలిసిఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. చదవండి: Jasprit Bumrah Wife Sanjana Ganesan: అదిరిపోయే ఫోటో షేర్ చేసిన బుమ్రా ~ Rylee Louise Schutt 💕 ~ 17/08/21 at 10:09pm ~ 28 Weeks 6 Days ~ 858gm pic.twitter.com/TfieNUNtDv — Megan Schutt (@megan_schutt) August 21, 2021 -
బ్యాట్ ఝుళిపించి.. గెలిపించిన లెస్బియన్ జంట!
ప్రొవిడెన్స్ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్‌లో కని విని ఎరగని రికార్డు నమోదైంది. దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య గత సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఓ లెస్బియన్ జంట అద్భుత ప్రదర్శనతో తమ జట్టును గెలిపించింది. ఇలా ఓ లెస్బియన్ జంట బ్యాట్‌తో రాణించడం క్రికెట్ ప్రపంచంలోనే తొలిసారి. దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్, ఆల్‌రౌండర్ మరిజాన్ కాప్‌లు ఈ ఏడాది జూలైలో వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. సఫారీ దేశంలో ఇద్దరు మహిళల వివాహంపై ఎటువంటి ప్రతిబంధకాలు లేకపోవడం వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. దీంతో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. తాజాగా టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఈ లెస్బియన్ జంట మూడో వికెట్‌కు 67 పరుగులు జత చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా.. ఈ మ్యాచ్‌లోనే ఈ ఇద్దరు టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళలు 8 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన సఫారి మహిళల్లో డేన్ వాన్ నికెర్క్ (33 నాటౌట్), మరిజాన్ కాప్(38)ల లెస్బియన్ జంట రాణించడంతో ఆ జట్టు 18.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం ఇది రెండోసారి. గత ఏడాది న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్‌వైట్‌ను సహచరి లియా తహుహు పెళ్లాడింది. -
పన్నెండేళ్లలో 98 మంది పిల్లలు!
కనీసం తాగుడు అలవాటు కూడా లేని హౌబెన్ స్పెర్మ్ కౌంట్ వంద మిలియన్లట. లెస్బియన్ కపుల్స్, చాలాకాలంగా పిల్లలు కలగని వారు... ఇలా సరైన కారణం ఉన్న వారికే ఆయన వీర్యదానం చేస్తారు. జీవితంలో ఎపుడైనా ఎక్కువ మంది పిల్లలున్న వ్యక్తి మీకు తారసపడ్డారా? ఎంత మంది ఉంటారు పిల్లలు వారికి ముగ్గురు, ఐదుగురు, ఏడుగురు, పదిమంది... మహా అయితే పదిహేను మంది! కానీ ఇపుడు మీకు చెప్పబోయే వివరాలు 98 మంది పిల్లలున్న తండ్రివి. అది కూడా ఈ 98 మందికి కేవలం 12 సంవత్సరాల్లో జన్మనిచ్చారు. మహాభారతంలో మాత్రమే ధృతరాష్ట్రుడికి వంద మంది ఉన్నట్టు విన్నాం. కానీ ఈ కాలంలో కూడా అంతమంది పిల్లలున్న వారున్నారా... మరీ మీ పిచ్చి కాకపోతేను అని అనుకుంటారేమో! డీఎన్ఏ రిపోర్టులు కూడా ఉన్నాయి. జాగ్రత్త! ఆయన పేరు ఎడ్ హౌబెన్. నెదర్లాండ్స్ దేశంలోని మాస్ట్రిక్ట్ పట్టణంలో ఉంటారు. టూర్ గైడ్‌గా పనిచేస్తారు. ఆయనకు ఇపుడు 46 సంవత్సరాలు. 2002 వరకు ఆయనకు ఏ స్త్రీతోను సంబంధాలు లేవు. పెళ్లి కాలేదు. అపుడు చాలామంది పిల్లల కోసం ఎంతో తాపత్రయ పడతారని కానీ వారికి పిల్లలు కలగరని తెలుసుకుని స్పెర్మ్ డోనర్ (వీర్య దాత) అయ్యాడు. ఓ లోకల్ బ్యాంకుకు వీర్యాన్ని దానం చేస్తే వారు భద్రపరిచి అమ్ముకునేవాళ్లు. కొంతకాలానికి జర్మనీలోని ఒక వెబ్సైట్ (టఞ్ఛటఝ్చటఞ్ఛఛ్ఛీట.ఛ్ఛీ) గురించి తెలుసుకుని అందులో వీర్యదాతగా పేరు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత అతడిని నేరుగా పిల్లలు కావాలనుకునే మహిళలు కలిసే వారు. ఈ మాట వింటేనే చాలామందికి వెంటనే అనేక అనుమానాలు కలుగుతాయి. అతను బాధ్యతలు తీసుకోనవసరం లేని శృంగారాన్ని అనుభవిస్తున్నాడని, కోరికలు తీర్చుకోవడానికే ఇలా చేస్తున్నాడని, ఇది లీగల్ అయి ఉండదని... ఇలాంటి అనుమానాలొస్తాయి కదా. వాటన్నింటికీ సమాధానాలున్నాయి. హౌబెన్ చేసే ఈ పని పూర్తిగా న్యాయబద్ధమైనది. ఆయన వద్దకు వచ్చేవారు పిల్లలు కలగకపోవడానికి దారితీసిన కారణాల హెల్త్ రిపోర్టులు తేవాలి. అలాగే వారి ఆరోగ్య సంబంధ రిపోర్టులు తీసుకురావాలి. అవన్నీ పరిశీలించిన తర్వాతే అతను వారితో శృంగారానికి అంగీకరిస్తారు. పలు దేశాల నుంచి ఆయన వద్దకు వస్తుంటారు. ఆయన పిల్లలు పలుదేశాల్లో ఉన్నారు. ఎడాపెడా వీర్యదానం చేస్తే రేప్పొద్దున్న ఆ చట్టాలు మెడకు చుట్టుకుంటాయి. అందుకే వారితో పిల్లల కోసం కలిసి గడపడానికి అవసరమైన వ్యవహారాలన్నీ చట్టబద్ధంగా పూర్తిచేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయన ఈపాటికి ఏనాడో అనారోగ్యం పాలయ్యేవాడు. కనీసం తాగుడు అలవాటు కూడా లేని హౌబెన్ స్పెర్మ్ కౌంట్ వంద మిలియన్లట. లెస్బియన్ కపుల్స్, చాలాకాలంగా పిల్లలు కలగని వారు... ఇలా సరైన కారణం ఉన్న వారికే ఆయన వీర్యదానం చేస్తారు. ఇపుడు 98వ బేబీ మాడిటతో పాటు అందరి ఫొటోలు, వారి వివరాలు, ఆ దంపతులు వివరాలు ఆయన వద్ద ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్తులో ఎదురయ్యే ఏ న్యాయసమస్యనైనా ఎదుర్కోవాలి కదా! ఎడ్ హౌబెన్ను కొందరు ‘భార్యతో గడిపితే భర్త అంగీకరిస్తాడా?’ అని అడిగారట. కొందరు సంతానం కోసం లక్షలు పోసినా లాభం లేక దేశాలన్నీ తిరిగి ‘జీవితం శూన్యం’ అనుకుని నా వద్దకు వచ్చినపుడు వారికి కనిపించేది శృంగారం కాదు... బిడ్డ రూపంలో భవిష్యత్తు అని ఆయన తిరుగులేని సమాధానం ఇచ్చారు.