పన్నెండేళ్లలో 98 మంది పిల్లలు! | 98 children in twelve years! | Sakshi
Sakshi News home page

పన్నెండేళ్లలో 98 మంది పిల్లలు!

Published Wed, Apr 2 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

పన్నెండేళ్లలో  98 మంది పిల్లలు!

పన్నెండేళ్లలో 98 మంది పిల్లలు!

కనీసం తాగుడు అలవాటు కూడా లేని హౌబెన్ స్పెర్మ్ కౌంట్ వంద మిలియన్లట. లెస్బియన్ కపుల్స్, చాలాకాలంగా పిల్లలు కలగని వారు... ఇలా సరైన కారణం ఉన్న వారికే ఆయన వీర్యదానం చేస్తారు.
 
 జీవితంలో ఎపుడైనా ఎక్కువ మంది పిల్లలున్న వ్యక్తి మీకు తారసపడ్డారా? ఎంత మంది ఉంటారు పిల్లలు వారికి ముగ్గురు, ఐదుగురు, ఏడుగురు, పదిమంది... మహా అయితే పదిహేను మంది! కానీ ఇపుడు మీకు చెప్పబోయే వివరాలు 98 మంది పిల్లలున్న తండ్రివి. అది కూడా ఈ 98 మందికి కేవలం 12 సంవత్సరాల్లో జన్మనిచ్చారు. మహాభారతంలో మాత్రమే ధృతరాష్ట్రుడికి వంద మంది ఉన్నట్టు విన్నాం. కానీ ఈ కాలంలో కూడా అంతమంది పిల్లలున్న వారున్నారా... మరీ మీ పిచ్చి కాకపోతేను అని అనుకుంటారేమో! డీఎన్‌ఏ రిపోర్టులు కూడా ఉన్నాయి. జాగ్రత్త!
 
ఆయన పేరు ఎడ్ హౌబెన్. నెదర్లాండ్స్ దేశంలోని మాస్ట్రిక్ట్ పట్టణంలో ఉంటారు. టూర్ గైడ్‌గా పనిచేస్తారు. ఆయనకు ఇపుడు 46 సంవత్సరాలు. 2002 వరకు ఆయనకు ఏ స్త్రీతోను సంబంధాలు లేవు. పెళ్లి కాలేదు. అపుడు చాలామంది పిల్లల కోసం ఎంతో తాపత్రయ పడతారని కానీ వారికి పిల్లలు కలగరని తెలుసుకుని స్పెర్మ్ డోనర్ (వీర్య దాత) అయ్యాడు. ఓ లోకల్ బ్యాంకుకు వీర్యాన్ని దానం చేస్తే వారు భద్రపరిచి అమ్ముకునేవాళ్లు.

 కొంతకాలానికి జర్మనీలోని ఒక వెబ్‌సైట్ (టఞ్ఛటఝ్చటఞ్ఛఛ్ఛీట.ఛ్ఛీ) గురించి తెలుసుకుని అందులో వీర్యదాతగా పేరు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత అతడిని నేరుగా పిల్లలు కావాలనుకునే మహిళలు కలిసే వారు. ఈ మాట వింటేనే చాలామందికి వెంటనే అనేక అనుమానాలు కలుగుతాయి. అతను బాధ్యతలు తీసుకోనవసరం లేని శృంగారాన్ని అనుభవిస్తున్నాడని, కోరికలు తీర్చుకోవడానికే ఇలా చేస్తున్నాడని, ఇది లీగల్ అయి ఉండదని... ఇలాంటి అనుమానాలొస్తాయి కదా. వాటన్నింటికీ సమాధానాలున్నాయి.

 హౌబెన్ చేసే ఈ పని పూర్తిగా న్యాయబద్ధమైనది. ఆయన వద్దకు వచ్చేవారు పిల్లలు కలగకపోవడానికి దారితీసిన కారణాల హెల్త్ రిపోర్టులు తేవాలి. అలాగే వారి ఆరోగ్య సంబంధ రిపోర్టులు తీసుకురావాలి. అవన్నీ పరిశీలించిన తర్వాతే అతను వారితో శృంగారానికి అంగీకరిస్తారు. పలు దేశాల నుంచి ఆయన వద్దకు వస్తుంటారు. ఆయన పిల్లలు పలుదేశాల్లో ఉన్నారు. ఎడాపెడా వీర్యదానం చేస్తే రేప్పొద్దున్న ఆ చట్టాలు మెడకు చుట్టుకుంటాయి.

అందుకే వారితో పిల్లల కోసం కలిసి గడపడానికి అవసరమైన వ్యవహారాలన్నీ చట్టబద్ధంగా పూర్తిచేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయన ఈపాటికి ఏనాడో అనారోగ్యం పాలయ్యేవాడు. కనీసం తాగుడు అలవాటు కూడా లేని హౌబెన్ స్పెర్మ్ కౌంట్ వంద మిలియన్లట. లెస్బియన్ కపుల్స్, చాలాకాలంగా పిల్లలు కలగని వారు... ఇలా సరైన కారణం ఉన్న వారికే ఆయన వీర్యదానం చేస్తారు. ఇపుడు 98వ బేబీ మాడిటతో పాటు అందరి ఫొటోలు, వారి వివరాలు, ఆ దంపతులు వివరాలు ఆయన వద్ద ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్తులో ఎదురయ్యే ఏ న్యాయసమస్యనైనా  ఎదుర్కోవాలి కదా!

 ఎడ్ హౌబెన్‌ను కొందరు ‘భార్యతో గడిపితే భర్త అంగీకరిస్తాడా?’ అని అడిగారట. కొందరు సంతానం కోసం లక్షలు పోసినా లాభం లేక దేశాలన్నీ తిరిగి ‘జీవితం శూన్యం’ అనుకుని నా వద్దకు వచ్చినపుడు వారికి కనిపించేది శృంగారం కాదు... బిడ్డ రూపంలో భవిష్యత్తు అని ఆయన తిరుగులేని సమాధానం ఇచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement