Australian Pacer Megan Schutt and Jess Holyoake Blessed With a Baby Girl - Sakshi
Sakshi News home page

Megan Schutt: తండ్రైన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగన్ స్కాట్

Published Sat, Aug 21 2021 3:22 PM | Last Updated on Sat, Aug 21 2021 4:37 PM

Megan Schutt And  Jess Holyoake Blessed With A Baby Girl - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగాన్‌ స్కాట్‌ తండ్రి అయ్యింది. తన భాగస్వామి జెస్ హోలియోక్‌ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా మెగాన్‌ స్కాట్‌ పంచుకుంది. మా క్యూట్‌ బేబీ ఎమర్జెనీ సి సెక్షన్ ద్వారా ఈ భూమి మీదకు వచ్చిందిని ఆమె ట్విట్‌ చేసింది. ఆగస్టు 17న జన్మించిన చిన్నారికి ‘రిలీ లూయిస్ స్కాట్’ అని  పేరు కూడా పేట్టేశారు. 24 వారాల మా నిరీక్షణకు ఫలితం దక్కిందిని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

ఇలాంటి ఇద్దరు అందమైన అమ్మాయిలు నా జీవితంలో ఉండడం నా అదృష్టం’ అంటూ మెగన్ స్కాట్  పేర్కొంది. కాగా 2018 ఆస్ట్రేలియాలో స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను చట్టబద్ధం చేశారు. దీంతో 2019లో తన చిరకాల భాగస్వామి అయిన  జెస్ హోలీయోక్‌ను మేగాన్‌ స్కాట్‌ వివాహం చేసుకుంది. ఈ ఏడాదిలో మేలో  జెస్ హోలియోక్‌  గర్బం దాల్చినట్లు స్కాట్‌ ప్రటించింది. ఆమె తన భార్య జెస్‌తో కలిసిఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు  సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది.

చదవండి: Jasprit Bumrah Wife Sanjana Ganesan: అదిరిపోయే ఫోటో షేర్‌ చేసిన బుమ్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement