గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లో... దుండగుల దుశ్చర్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఆయన సోమవారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. పంటలు తగులబెట్టిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చంద్రబాబు సందర్భంగా కలెక్టర్ను సూచించారు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిపై సమీక్షించనున్నారు.
కాగా రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న గ్రామాల్లో దుండగులు అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. గడ్డివాములు, కూరగాయల తోటల పందిళ్లు, గుడిసెలకు నిప్పు పెట్టారు. పెనుమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
రాజధాని గ్రామాల ఘటనపై చంద్రబాబు దిగ్ర్భాంతి
Published Mon, Dec 29 2014 10:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement