సూత్రధారి చంద్రబాబు... పాత్రధారి నారాయణ | Mangalagiri mla RK takes on chandrababu and narayana | Sakshi
Sakshi News home page

సూత్రధారి చంద్రబాబు... పాత్రధారి నారాయణ

Published Thu, Oct 29 2015 12:15 PM | Last Updated on Tue, Oct 9 2018 5:07 PM

Mangalagiri mla RK takes on chandrababu and narayana

గుంటూరు : గుంటూరు జిల్లా మల్కాపురంలో చెరకు పంట దగ్ధం కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఆర్కే మండిపడ్డారు. గురువారం గుంటూరులో ఆర్కే మాట్లాడుతూ... పంట దగ్ధం కేసులో చెరకు రైతు గద్దే చంద్రశేఖర్ మేనల్లుడు సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆర్కే మండిపడ్డారు.

సురేష్ను వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆర్కే డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ పంట దగ్ధానికి సూత్రధాని చంద్రబాబు అయితే... పాత్రధారి మాత్రం మున్సిపల్ మంత్రి పి.నారాయణ అని ఆర్కే ఆరోపించారు. అయితే సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement