
నేటి నుంచి ఓటు హక్కు నమోదు: భన్వర్‌లాల్
సాక్షి,హైదరాబాద్: ఏపీ, తెలంగాణల్లో నేటి(సోమవారం) నుండి ఓటు హక్కు నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ కొత్త ఓటరు దరఖాస్తు(ఫాం -6)ను ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించామని, నేరుగా తమ సమీప ప్రాంతంలో ఉన్న అధికారులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆన్‌లైన్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ceotelangana.nic.inనుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ceoandhra.nic.inనుండి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భన్వర్‌లాల్ తెలిపారు.