ఆ ఎమ్మెల్యే అంశం హైకోర్టు పరిధిలో..
కోర్టు తీర్పు తరువాతే స్పందిస్తాం: భన్వర్‌లాల్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే అనర్హత అంశం హైకోర్టు పరిధిలో ఉందని, కోర్టు తీర్పు తరువాతే తాము స్పందిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. నారాయణఖేడ్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించేందుకు బుధవారం ఆయన మెదక్ జిల్లా సంగారెడ్డిలోని కలెక్టరేట్‌కు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అనర్హత అంశంపై విలేకరులు ప్రశ్నించగా.. ఆయన పైవిధంగా స్పందించారు. అంతకుముందు కలెక్టర్ రోనాల్డ్ రాస్, జిల్లా అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించిన తరువాత రాజకీయ పార్టీల జిల్లాశాఖ అధ్యక్షులు అధ్యక్షులు, నాయకులతో భన్వర్‌లాల్ సమావేశమై నారాయణఖేడ్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.
ఖేడ్ ఉప ఎన్నికకు తొలి నామినేషన్
నారాయణఖేడ్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు కాంగ్రెస్ అభ్యర్థి పి.సంజీవరెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.