
సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ కేంద్ర ఎన్నికల కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతికి లేఖ రాశారు. నంద్యాల ఉప ఎన్నికలో నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకే భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం కక్ష గట్టిందని అన్నారు. నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డబ్బు పంపిణీ అక్రమాలను కూడా భన్వర్‌లాల్ అడ్డుకున్నారని లేఖలో శర్మ చెప్పారు.
అందుకే ఆయన్ను ప్రభుత్వం టార్గెట్ చేసుకుందని తెలిపారు. భన్వర్‌లాల్ లాంటి నిజాయితీ గల అధికారులను కాపాడేందుకు ఇందులో కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు. గతంలో బిహార్‌లో ఇలాగే జరిగినప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment