achal kumar jyothi
-
‘భన్వర్‌లాల్‌పై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది’
-
‘భన్వర్‌లాల్‌పై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది’
సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ కేంద్ర ఎన్నికల కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతికి లేఖ రాశారు. నంద్యాల ఉప ఎన్నికలో నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకే భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం కక్ష గట్టిందని అన్నారు. నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డబ్బు పంపిణీ అక్రమాలను కూడా భన్వర్‌లాల్ అడ్డుకున్నారని లేఖలో శర్మ చెప్పారు. అందుకే ఆయన్ను ప్రభుత్వం టార్గెట్ చేసుకుందని తెలిపారు. భన్వర్‌లాల్ లాంటి నిజాయితీ గల అధికారులను కాపాడేందుకు ఇందులో కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు. గతంలో బిహార్‌లో ఇలాగే జరిగినప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుందని గుర్తు చేశారు. -
ఎన్నికల కమిషనర్‌గా గుజరాత్ మాజీ సీఎస్
న్యూఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అచల్ కుమార్ జ్యోతి(62) గురువారం కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో అచల్ కుమార్ ప్రభుత్వ సీఎస్‌గా పనిచేశారు. గుజరాత్లో సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ ఎండీగా, కంద్లా పోర్ట్ ట్రస్టుకు చైర్మన్‌గా, తదితర పదవులు నిర్వహించిన అచల్‌కుమార్ సర్వీసు నుంచి 2013లో రిటైర్ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఆయన పదవీకాలం (మూడేళ్లు) మొదలవుతుందని న్యాయశాఖ గురువారం ఓ నోటిఫికేషన్లో పేర్కొంది. వాస్తవానికి ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఆరేళ్లు. అయితే, రాజ్యాంగం ప్రకారం 65 ఏళ్ల వయసుకు మించరాదు. కాబట్టి అచల్‌కుమార్ ఈ పదవిలో మూడేళ్లే ఉండనున్నారు.