
ఎన్నికల కమిషనర్‌గా గుజరాత్ మాజీ సీఎస్
గుజరాత్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అచల్ కుమార్ జ్యోతి(62) గురువారం కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు.
న్యూఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అచల్ కుమార్ జ్యోతి(62) గురువారం కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో అచల్ కుమార్ ప్రభుత్వ సీఎస్‌గా పనిచేశారు. గుజరాత్‌లో సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ ఎండీగా, కంద్లా పోర్ట్ ట్రస్టుకు చైర్మన్‌గా, తదితర పదవులు నిర్వహించిన అచల్‌కుమార్ సర్వీసు నుంచి 2013లో రిటైర్ అయ్యారు.
బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఆయన పదవీకాలం (మూడేళ్లు) మొదలవుతుందని న్యాయశాఖ గురువారం ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. వాస్తవానికి ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఆరేళ్లు. అయితే, రాజ్యాంగం ప్రకారం 65 ఏళ్ల వయసుకు మించరాదు. కాబట్టి అచల్‌కుమార్ ఈ పదవిలో మూడేళ్లే ఉండనున్నారు.