న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకోసం వేర్వేరుగా ఉప ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్ కాంగ్రెస్ వేసిన పిల్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ విషయంలో జూన్ 24లోగా స్పందన తెలపాలని బుధవారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జూన్ 25న దీనిపై వాదనలు వింటామని ధర్మాసనం తెలియజేసింది. గుజరాత్ కాంగ్రెస్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా మాట్లాడుతూ, ఈ విషయంలో గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉందని వాదించారు. దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ, ఎన్నికల షెడ్యూల్ ఒకటే ఉన్నప్పటికీ ప్రత్యేక స్థితిలో ఏర్పడిన ఖాళీలను వేర్వేరుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment