- పలువురు రేంజ్ వీఆర్‌కు
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : ఎన్నికల బదిలీల ప్రక్రియ ఊపందుకుంది. గత నెల 26న 48 మంది ఎస్సైలను బదిలీ చేయగా, తాజాగా గురువారం భారీగా 66 మంది ఎస్సైలకు స్థానం కల్పించారు. గత నెల 26న జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న 35మంది పీఎస్‌ఐలకు స్టేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అదేసమయంలో ఆయా స్టేషన్ల లో పనిచేస్తున్న వారిని జిల్లా, రేంజ్ వీఆర్‌లకు బదిలీ చేశారు. రేంజ్ వీఆర్‌కు బదిలీ అయిన ర్యాంకర్ ఎస్‌ఐలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తమను బదిలీ చేశారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీ సు అధికారుల సంఘం జిల్లా, రాష్ట్ర కమిటీలు ఎన్నికల ప్రధాన కమిషనర్ భన్వర్‌లాల్‌ను కలిసి బదిలీల విషయాన్ని చర్చించారు.
దీంతో ర్యాంకర్ ఎస్‌ఐలు రేంజ్ వీఆర్ నుంచి జిల్లాకు వచ్చారు. వీరితో పాటు 9 మంది పీఎస్‌ఐలు గుంటూరు రేంజ్ నుంచి జిల్లా వీఆర్‌కు వచ్చారు. తాజాగా జిల్లా వీఆర్, పలు స్టేషన్లలో పనిచేస్తున్న 66 మంది ఎస్‌ఐలు, పీఎస్‌ఐలను బదిలీ చే స్తూ ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీల్లో తొమ్మిది మందిని రేంజ్ వీఆర్‌కు, ఇద్దరిని జిల్లా వీఆర్‌కు బదిలీ చేశారు. తొమ్మిది మంది పీఎస్‌ఐలకు పోస్టింగ్‌లు కల్పించారు. బదిలీ అయిన వారు వెంటనే తమ విధుల్లో చేరాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నగరంలోని పలు స్టేషన్‌ల్లో ఎస్‌ఐలు గురువారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. శుక్ర, శనివారాల్లో సీఐల బదిలీలు జరగున్నట్లు సమాచారం.
మరోసారి భారీగా ఎస్‌ఐల బదిలీలు
Published Fri, Feb 7 2014 3:57 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement