తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే నెల 13వ తేదీ నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.
డిసెంబర్ 8 వరకు అవకాశం
జనవరి 15న తుది జాబితా
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే నెల 13వ తేదీ నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సాధారణంగా నవంబర్ 1వ తేదీ నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను కారణంగా, తెలంగాణలో పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ పూర్తి కానుందున ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వచ్చే నెల 13వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు భన్వర్‌లాల్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ యువకులందరూ ఓటర్లగా నమోదుకు అర్హులన్నారు. డిసెంబర్ 8 వరకు ఓటర్లుగా నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 15న ప్రకటిస్తారు.
ఓటర్ల నమోదు, జాబితా సవరణ షెడ్యూల్ ఈ విధంగా ఉంది...
ముసాయిదా జాబితా ప్రకటన : 13-11-2014
ఓటర్లుగా నమోదు, అభ్యంతరాలు, సవరణలు: 13-11-2014 నుంచి 08-12-2014
గ్రామసభల్లో, స్థానిక సంస్థల్లో పేర్లు చదువుతారు: 19-11-2014, 26-11-2014
పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి ఆఫీసర్లు, పార్టీల ఏజెంట్లు కూర్చుని దరఖాస్తుల స్వీకరణ: 16-11-2014, 23-11-2014, 30-11-2014, 07-12-2014
దరఖాస్తుల పరిష్కారం: 22-12-2014
సప్లమెంటరీ జాబితా ప్రచురణ, ఫొటోలు, పేర్లు నమోదు: 05-01-2015
ఓటర్ల తుది జాబితా ప్రకటన: 15-01-2015