సీఈవో భన్వర్‌లాల్‌కు బీజేపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ఉపాధ్యాయ కోటా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రాజ్‌భవన్ సిబ్బంది గృహ సముదాయాన్ని ప్రారంభించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) భన్వర్‌లాల్‌కు బీజేపీ బృందం విజ్ఞప్తి చేసింది. సోమవారం సచివాలయంలో సీఈవోను ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, పార్టీనాయకులు ఎస్ మల్లారెడ్డి, సాంబమూర్తి, కాసం వెంకటేశ్వర్లు, ప్రకాశ్‌రెడ్డి, దాసరి మల్లేశం కలసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ నెల 9న పోలింగ్ ఉన్న విషయం తెలిసినా రాజ్‌భవన్ సిబ్బంది గృహ సముదాయాన్ని ఆదివారం గవర్నర్, సీఎం, మంత్రులు కలసి ప్రారంభించారని వెల్లడించారు. అంతకు ముందు బీజేపీ కార్యాలయంలో చింతల రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
‘కోడ్’ ఉల్లంఘనులపై చర్యలు తీసుకోండి
Published Tue, Mar 7 2017 3:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement