వరంగల్ ఉప ఎన్నిక: ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు | candidates photos on evms in warangal loksabha by polls | Sakshi
Sakshi News home page

వరంగల్ ఉప ఎన్నిక: ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు

Published Fri, Oct 23 2015 6:17 PM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

వరంగల్ ఉప ఎన్నిక: ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు - Sakshi

వరంగల్ ఉప ఎన్నిక: ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు

హైదరాబాద్: వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు ముద్రిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ చెప్పారు. 1751 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఓటింగ్ సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తామని, అభ్యర్థులు 70 లక్షల రూపాయలకు మించి ఖర్చు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చేనెల 21న వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 25 వరకు ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందని భన్వర్ లాల్ చెప్పారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 14,75,311 మంది ఓటర్లున్నారని, 96,846 ఓట్లను తొలగించినట్టు తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్:

ఈ నెల 28న వరంగల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ నవంబర్ 4
నవంబర్ 5న నామినేషన్ల పరిశీలిన
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 7
నవంబర్ 21న పోలింగ్
నవంబర్ 24న ఓట్ల లెక్కింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement