'గ్రేటర్లో 6.35 లక్షల ఓటర్లను తొలగించాం' | 6.35 lacks Voters removed in Greater Hyd | Sakshi
Sakshi News home page

'గ్రేటర్లో 6.35 లక్షల ఓటర్లను తొలగించాం'

Published Tue, Oct 6 2015 6:27 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

'గ్రేటర్లో 6.35 లక్షల ఓటర్లను తొలగించాం' - Sakshi

'గ్రేటర్లో 6.35 లక్షల ఓటర్లను తొలగించాం'

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో 6.35 లక్షలమంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ తెలిపారు. ఓటర్ల తొలగింపు విషయంలో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు సోమవారం భన్వర్లాల్ను కలిశాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ల తొలగింపు విషయమై ఆయనకు ఫిర్యాదు చేశాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా నివాసం ఉండని వారి పేర్లను మాత్రమే ఓటర్ల జాబితా నుంచి తొలిగించినట్టు తెలిపారు. ఈ విషయమై మరో 19 లక్షలమందికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. గ్రేటర్లో తొలగించిన ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement