ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల ఒక్క వ్యక్తికి దేశ వ్యాప్తంగా ఒకే ఓటు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.
సోమందేపల్లి: ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల ఒక్క వ్యక్తికి దేశ వ్యాప్తంగా ఒకే ఓటు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం జూలకుంట గ్రామంలో వెలసిన భైలాంజనేయస్వామి విగ్రహాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కొంతమంది మూడు నాలుగు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని, దీనిని నివారించాలనే ముఖ్య ఉద్దేశంతో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చేస్తున్నామన్నారు. ఇలా చేయడం వల్ల ఓటరు కార్డు ఉన్న వ్యక్తి ఏ ప్రాంతానికి నివాసం వెళ్లినా అతని ఓటు కూడా అక్కడకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్‌ఫర్ అవుతుందన్నారు.