వీడిన వీఆర్వో అదృశ్యం మిస్టరీ హత్యేనంటూ ఆందోళన
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మందపల్లి వీఆర్వో కె.రాజేశ్వర్ అదృశ్యం మిస్టరీ వీడింది. నాగాపూర్ అటవీ ప్రాం తంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం అస్థికలు లభ్యం అయ్యా యి. సీఐ జీవన్‌రెడ్డి కథనం ప్రకారం.. గత నెల 19న సమగ్ర కుటుంబ సర్వే విధులకు వెళ్లిన రా జేశ్వర్ తిరిగి రాలేదు. ఈ మేరకు గత నెల 22న కుటుంబసభ్యులకు పెంబి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సోమవారం నాగాపూర్ అటవీ ప్రాంతంలో స్థానికులకు అస్థికలు కనిపించడం తో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలంలో దుస్తులు, సెల్‌ఫోన్, గుర్తింపు కా ర్డు ఆధారంగా మృతుడు రాజేశ్వర్‌గా గుర్తిం చా రు. దుస్తులు, అస్థికలు, కపాలం వేర్వేరుగా కొద్ది దూరంలో పడి ఉండడం.. పక్కనే చెట్టుకు ధోవ తి కట్టి ఉండడంతో రాజేశ్వర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజేశ్వర్‌ది హత్యేన ని ఆరోపిస్తూ దళిత సంఘాలు మృతుడి కుటుం బసభ్యులు, అస్థికలతో రాస్తారోకో చేశారు.
‘సర్వే’ రోజు అదృశ్యం.. అస్థిపంజరంగా ప్రత్యక్షం
Published Tue, Sep 30 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement
Advertisement