విషాదాంతం | Died on the same day, two young couples | Sakshi
Sakshi News home page

విషాదాంతం

Published Sat, Dec 6 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

విషాదాంతం

విషాదాంతం

 రెండు యువ జంటల కన్నుమూత

తాడిగడపలో దంపతుల అనుమానాస్పద మృతి
కుటుంబసభ్యులపై అనుమానం
పశ్చిమగోదావరిలో జిల్లాకు చెందిన మరో జంట ఆత్మహత్య


పెను విషాదం.. ఒకే రోజు రెండు యువజంటలు కన్నుమూశాయి. ఒకచోట భార్యాభర్తలు కలిసే కన్నుమూయగా.. మరో ప్రాంతంలో భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
 
పెనమలూరు : అనుమానాస్పద స్థితిలో ఓ యువజంట మరణించింది. తాడిగడప వసంతనగర్‌లో జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. యువకుడి తల్లిదండ్రులు, సోదరుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని యువతి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం... ఉంగుటూరు మండలం పొణుకుమాడు గ్రామానికి చెందిన దండూరి ప్రసాద్(30)కు, గుంటూరు జిల్లా ఎర్రబాలేనికి చెందిన లక్ష్మి(25)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.

ప్రసాద్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరు ఎనిమిదేళ్లుగా తాడిగడపలోని వసంతనగర్ కాలువ కట్టపై ఉంటున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ప్రసాద్ ఇంటి పక్క పోర్షన్‌లో అతని తమ్ముడు రాధాకృష్ణ, భార్య రంగమ్మ, కుమారుడితో కలిసి ఉంటున్నారు. సరిహద్దు విషయమై అన్నాదమ్ముల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఇద్దరి కుటుంబాల మధ్య మాటలు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement