young couples
-
Manipur Violence: నిరసనలతో దద్దరిల్లిన ఇంఫాల్
ఇంఫాల్: మణిపూర్‌లో యువ జంట హత్యతో మొదలైన నిరసనలు గురువారం సైతం కొనసాగాయి. ఆందోళనకారులు ఇంఫాల్ వెస్ట్‌లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై దాడికి దిగారు. అక్కడున్న రెండు కార్లకు నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బుధవారం రాత్రి పలు చోట్ల నిరసనకారులు భద్రతా బలగాలపై దాడులకు దిగారు. దీంతో, బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. పోలీసు వాహనానికి నిప్పుపెట్టడంతోపాటు పోలీసు వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కెళ్లారు. థౌబల్ జిల్లా ఖొంగ్జమ్లో బీజేపీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. గురువారం రాత్రి సీఎం బిరేన్ సింగ్ పూరీ్వకుల ఇంటిపై దాడికి జరిగిన ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారు. మా వాళ్ల మృతదేహాలు ఎక్కడున్నాయో గుర్తించండి దుండగుల చేతుల్లో దారుణ హత్యకు గురైన తమ పిల్లల మృతదేహాల జాడ చెబితే అంత్యక్రియలు జరుపుకుంటామని వారి తల్లిదండ్రులు పోలీసులను కోరారు. మెయితీ వర్గానికి చెందిన యువతి, యువకుడు జూన్‌లో గుర్తు తెలియని దుండగుల చేతుల్లో హత్యకు గురి కావడం, వారి ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం తెలిసిందే. ఈ హత్య ఘటన మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలకు కారణమైంది. మెయితీల ఆచారం ప్రకారం..అంతిమ సంస్కారాలు జరపడానికి మృతులు ధరించిన దుస్తులకు సంబంధించిన చిన్న గుడ్డ ముక్కయినా ఉండాలి. అంత్యక్రియలు జరిపేవరకు వారి ఫొటోల వద్ద మృతుల తల్లులు అగరొత్తులు, క్యాండిల్ వెలిగిస్తూ రోజూ ఆహారం నివేదన చేస్తూ ఉండాలి. వారి లేని లోటు ఎవ్వరూ పూడ్చలేరు. కనీసం వారికి తగు గౌరవంతో అంత్యక్రియలు జరపాలనుకుంటున్నామని యువతి తండ్రి హిజామ్ కులజిత్ చెప్పారు. తాజాగా, సీబీఐ దర్యాప్తుతోనయినా తమ కోరిక నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మణిపూర్‌కు శ్రీనగర్ ఎస్ఎస్పీ బల్వాల్ బదిలీ న్యూఢిల్లీ: ఉగ్ర సంబంధ కేసులను డీల్ చేయడంలో సమర్థుడిగా పేరున్న శ్రీనగర్ సీనియర్ ఎస్పీ రాకేశ్ బల్వాల్ను కేంద్రం మణిపూర్‌కు బదిలీ చేసింది. మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, శాంతిభద్రతలు దారుణంగా దెబ్బతినడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. 2012 ఐపీఎస్ అధికారి అయిన రాకేశ్ బల్వాల్ను డిసెంబర్ 2021లో అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాల కేడర్‌కు మార్చారు. తాజాగా ఆయన్ను మణిపూర్ కేడర్‌కు మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన హోం వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మణిపూర్‌లో ఆయన కొత్త బాధ్యతలను చేపడతారని తెలిపింది. జమ్మూలోని ఉధంపూర్‌కు చెందిన బల్వాల్ మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌కు 2017లో సీనియర్ ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. -
అసలే లవ్ మ్యారేజ్.. స్వేచ్ఛ ఎక్కువే.. ఇంకేముంది.. పెళ్లయిన మూణ్ణాళ్లకే పెటాకులు!
కర్నూలులోని ఓ కాలనీకి చెందిన నిరంజన్, స్వప్న (పేర్లు మార్చాం) హైదరాబాదులో చదువులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఒకచోట చేరి కాపురం పెట్టిన రెండేళ్లకే అత్తింటి ఆచారాలు వధువుకు నచ్చలేదు. కొంతకాలం మౌనంతో భరించినా ఆ తర్వాత కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకున్నారు. కర్నూలు పాతబస్తీకి చెందిన నరేష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. భార్య స్రవంతి(ఇద్దరి పేర్లు మార్చాం)కి ఫోన్ చేసిన ప్రతిసారి సెల్‌ఫోన్ బిజీ వస్తుండటంతో భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై తరచూ వారు వాదులాడుకునేవారు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరకు కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకున్నారు. చిన్నచిన్న విషయాలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. నాలుగు గోడల మధ్య సర్దిచెప్పాల్సిన ఇరు కుటుంబాల పెద్దలు ఒక్కోసారి మరింత ఆజ్యం పోస్తున్నారు. చిలిపి తగాదాలను సైతం భూతద్దంలో చూస్తూ బంధాన్ని బలహీనం చేసుకుంటున్నారు. ఒక్కోసారి విడిపోయేందుకు కూడా జంకడం లేదు. కడదాకా కలిసి ఉంటామనే పెళ్లినాటి బాసలను అపహాస్యం చేస్తూ ఏడాది తిరక్కముందే భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. సాక్షి, కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో విడాకుల కోసం వచ్చే దంపతులు ఎక్కువయ్యారు. ఇక మూడేళ్ల కాలంలో చిన్నచిన్న మనస్ఫర్థలతో 2,986 మంది పోలీస్స్టేషన్లను ఆశ్రయించగా.. కలిసి ఉండటానికి ఇష్టపడని మరో 632 మంది కోర్టు మెట్లెక్కారు. వివిధ పోలీస్స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం 30 ఏళ్ల లోపు వారే ఉండటం ఆందోళన కరం. గొడవ పడే దంపతుల్లో ఎవరూ వెనక్కు తగ్గేందుకు ఇష్టపడటం లేదు. పెళ్లి అయిన యువతులు కొత్త కాపురంలోకి కాలు పెట్టగానే అప్పటివరకు ఊహించుకున్నవి గాలిమేడలనే అభిప్రాయానికి వస్తున్నారు. పుట్టిన రోజును మరచిపోవడం, పండక్కి పుట్టింటికి పంపడం లేదన్న చిన్నచిన్న కారణాలకే మనస్తాపం చెంది సమస్యను రాద్ధాంతం చేసుకునేంతవరకు వెళ్తోంది. ఒక్కోసారి వారు గుర్తించలేనంత స్థాయిలో అగ్నికి ఆజ్యం పోసేలా మూడో శత్రువు ప్రవేశిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగులో సఖ్యతగా ఉండే ఎవరో ఒకరు లేనిపోని అనుమానాలను పెంచుతున్నారు. వారు చెప్పేది నిజమా? కాదా? అని ఆలోచించకుండానే దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ఇలాంటి జంటలకు కౌన్సెలింగ్ ఇస్తున్నప్పటికీ మార్పు చెందకపోవడం వల్ల సంసారాల్లో కలతలు పెద్దవై విడాకుల వరకు వెళ్తున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారే అధికం పోలీస్స్టేషన్లకు ఎక్కువ ప్రేమ వివాహాలు చేసుకున్నవారే వస్తున్నారు. యుక్త వయస్సులో ఆకర్షణకు లోనై ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. పిల్లలు పుట్టాక ఆర్థిక సమస్యలు ఎదురై కలహాలు ప్రారంభమవుతున్నాయి. ముందే ప్రేమికులు కావడంతో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఈకారణంతో భార్యాభర్తలు పంతాలకు వెళ్తున్నారు. పోలీసులు ఏం చెబుతున్నారంటే.. కాపురంలో భరించలేనంత ఆర్థిక ఇబ్బందులేమీ కనిపించవు. కానీ ఒకరికొకరు బద్ధ శత్రువుల్లా భావిస్తున్నారు. ఇంత తీవ్రమైన నిర్ణయానికి వస్తున్న దంపతుల్లో అధిక శాతం పెళ్లయిన ఏడాది నుంచి నాలుగేళ్ల లోపు వారే ఎక్కువగా పోలీసులను ఆశ్రయిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. విడాకులు కావాలని చెప్పే కారణాలు చాలా చిన్నవిగా ఉంటున్నట్లు కౌన్సెలింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఉన్నత విద్యావంతులైన భార్యాభర్తలు కూడా ఎవరి స్వేచ్ఛ వారిదే అనే పద్ధతిలో పంతాలకు పోతున్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారు కూడా ఏడాది, రెండేళ్లకే అర్థం లేని పట్టింపులతో గొడవలు పడుతూ విడాకుల దాకా వెళ్తున్నారు. విభేదాలకు కారణాలు.. ►మద్యం కారణంగా జరిగే గొడవలు – 33% ►వరకట్న వేధింపులు – 31% ►వివాహేతర సంబంధాలు/అనుమానాలు – 26% ►మగపిల్లలు పుట్టలేదని/సంతానం కలగలేదన్న కారణాలతో – 5% ►ఇతర కారణాలు – 5% చిన్న కారణాలకే మనస్పర్థలు పెంచుకుంటున్నారు చిన్న కారణాలకే దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగి పోలీసులను ఆశ్రయిస్తున్నా రు. ఇరు కుటుంబాల సభ్యుల తో మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తూ చాలామందిలో మార్పు తీసుకొస్తున్నాం. అయినా కొందరు కోర్టు దాకా వెళ్తూ విడాకులు కోరుకుంటున్నారు. పలు సమస్యలతో దంప తుల మధ్య సఖ్యత తగ్గి విడాకుల దాకా వెళ్తున్నారు. – వెంకటరామయ్య, దిశ మహిళా పీఎస్ డీఎస్పీ కుటుంబ వ్యవస్థపై అవగాహన ఉండాలి ప్రస్తుత పరిస్థితుల్లో యువ జంటలకు కుటుంబ వ్యవస్థపై అవగాహన లేకపోవడం, సర్దుబాటు ధోరణి సన్నగిల్లడం వల్ల విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. పెంపక లోపం, ఆర్థిక స్వేచ్ఛ, అహంకారం, అక్రమ సంబంధాలు కూడా విడాకులకు కారణమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ సక్రమంగా నిలబడాలంటే స్త్రీ పాత్ర ముఖ్యమైనది. – ఎ.అన్నపూర్ణారెడ్డి, అడ్వకేట్ -
అనాథల సేవలో యువ దంపతులు
మహబూబాబాద్ : ‘సొంత లాభం కొంత మానుకొని తోటివారికి సాయపడవోయ్’ అన్నాడు మహాకవి గురజాడ. కానీ ఈ దంపతులు మాత్రం సొంతానికంటూ ఏమి లేకుండా కష్టార్జితమంతా అనాథలకే వెచ్చిస్తూ వారికి ప్రేమను పంచుతున్నారు. యుక్తవయసులోనే ఆ దంపతులు అనాథలను చేరదీసి చేయూతనందిస్తున్నారు. ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన బల్లెం విజయ్‌కుమార్, విక్టోరియా దంపతులకు రెండేళ్ల క్రితమే వివాహమైంది. వారికి ఏడాది పాప ఉంది. బల్లెం విజయ్‌కు అనాథాశ్రమం నడపాలని తన ఆశయం. అందుకు తాను పెళ్లి చేసుకున్న భార్య కూడా సహకరించటం ఆయనకు మరింత బలాన్ని చేకూర్చింది. బ్యాంక్ కాలనీ సమీపంలో చిన్నగది ఉన్న ఇల్లు నెలకు 1500 చొప్పున అద్దెకు తీసుకుని పిల్లలతో పాటు ఆ దంపతులు ఆ గదిలోనే ఉంటున్నారు. సుమారు 9 మంది అనాథలను చేరదీసి వారిని ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. గది అద్దె తక్కువ కావడంతో ఎలాంటి సౌకర్యాలు లేవు. దూరంగా వెళ్లి ఆ దంపతులు బోరింగ్ వద్ద నీళ్లు తెచ్చుకుంటున్నారు. సౌండ్ సిస్టమే ఆశ్రమానికి ఆధారం.. సౌండ్ సిస్టమ్ నడుపుతూ ఇతరత్రా పనులు చేస్తూ విజయ్ కుమార్ తన ఆదాయంతో అనాథ ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఇటీవల కాజీపేటకు చెందిన పాస్టర్ కురియన్ నెలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాడు. మరో ఇద్దరు చెరో రూ.1000 చొప్పున సాయం చేస్తున్నారు. వారు చేసే సాయం కిరాయికి పోను మిగిలిన డబ్బులు సరిపోవడం లేదు. ఆశ్రమం పేరుతో అధికారుల వద్దకు, వ్యాపారుల వద్దకు నిర్వాహకులు వెళ్లడం లేదు. కానీ ఆ ఆశ్రమం గురించి తెలిసిన అధికారులు అక్కడికి వెళ్లి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ నెల 15న డీఎస్పీ డి.నాగరాజు ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు ఆశ్రమాన్ని చూశారు. దాని గురించి ఆరాతీసి ఆ దంపతులు చేస్తున్న సేవను తెలుసుకుని ఆశ్రమానికి వెళ్లారు. వెంటనే ఆయన స్పందించి క్వింటా బియ్యం, పిల్లలకు, ఆ దంపతులకు దుస్తులను, ఇతర సామగ్రి అందజేశారు. ఇంటికి నెల అద్దె తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దాతలు ముందుకొచ్చి సదుపాయాలు కల్పిస్తే ఆ అనాథలు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కష్టంగానే నడుపుతున్నాం.. అయినా సంతోషంగా ఉంది నా భర్త ఆశయం ఆశ్రమం నడపాలని. అందుకు నేను కూడా అదృష్టంగా భావిస్తున్నా. వారికి వంట చేసి ఆలనా పాలనా చూసుకుంటున్నాను. డబ్బులపరంగా ఇబ్బంది అవుతున్నా వచ్చిన ఆదాయంలో వంట చేస్తూ పిల్లలకు పెడుతున్నాను. నా పిల్లల్లా చూసుకుంటున్నాను. కష్టం ఎక్కువగా ఉన్నా దానిలోను ఎంతో సంతోషం ఉంది. ఊరికి వెళ్లినా మాతో పాటుగా తీసుకెళ్తాం. మా పిల్లల లాగానే ప్రేమతో చూసుకుంటున్నాం. - విక్టోరియా, నిర్వాహకురాలు -
విషాదాంతం
రెండు యువ జంటల కన్నుమూత తాడిగడపలో దంపతుల అనుమానాస్పద మృతి కుటుంబసభ్యులపై అనుమానం పశ్చిమగోదావరిలో జిల్లాకు చెందిన మరో జంట ఆత్మహత్య పెను విషాదం.. ఒకే రోజు రెండు యువజంటలు కన్నుమూశాయి. ఒకచోట భార్యాభర్తలు కలిసే కన్నుమూయగా.. మరో ప్రాంతంలో భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. పెనమలూరు : అనుమానాస్పద స్థితిలో ఓ యువజంట మరణించింది. తాడిగడప వసంతనగర్‌లో జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. యువకుడి తల్లిదండ్రులు, సోదరుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని యువతి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం... ఉంగుటూరు మండలం పొణుకుమాడు గ్రామానికి చెందిన దండూరి ప్రసాద్(30)కు, గుంటూరు జిల్లా ఎర్రబాలేనికి చెందిన లక్ష్మి(25)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ప్రసాద్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరు ఎనిమిదేళ్లుగా తాడిగడపలోని వసంతనగర్ కాలువ కట్టపై ఉంటున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ప్రసాద్ ఇంటి పక్క పోర్షన్లో అతని తమ్ముడు రాధాకృష్ణ, భార్య రంగమ్మ, కుమారుడితో కలిసి ఉంటున్నారు. సరిహద్దు విషయమై అన్నాదమ్ముల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఇద్దరి కుటుంబాల మధ్య మాటలు లేవు. -
‘మరిచిపోయి’.. మళ్లీ పెళ్లి..!
అమెరికాకు చెందిన ఈ ‘నవ’దంపతులు అమందా కార్త్, కోడీ కార్త్.. పది నెలల క్రితమే ఒకరినొకరు ఇష్టపడి ఘనంగా మనువాడారు.. ఇటీవల మళ్లీ పెళ్లి చేసుకున్నారు! విడాకులు తీసుకుని మళ్లీ అదే జంటలు పెళ్లి చేసుకోవడం అమెరికాలో కొత్తేమీ కాదు కానీ.. వీరి కథ మాత్రం చాలా వెరైటీ. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... అమందా, కార్త్ పెళ్లిరోజు. వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. కేక్ కట్ చేసి, పెళ్లి డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఫొటోలు, వీడియోల ముచ్చటా తీరింది. చివరగా పడకగదికి చేరారు. కానీ, పొద్దునే శ్వాస తీసుకోలేక అమందా అటూ ఇటూ దొర్లడంతో కార్త్ నిద్రలేచాడు. అంతలోనే ఆమె గుండె ఆగిపోయింది. వెంటనే ఆమె ఛాతీపై గట్టిగా నొక్కుతూ ప్రథమ చికిత్స చేయడంతో.. గుండె తిరిగి కొట్టుకుంది. కానీ.. బ్రోకెన్ హీట్ సిండ్రోమ్ అనే ఈ సమస్య వల్ల ఆమె కోమాలోకి వెళ్లింది. నాలుగు రోజులకు కళ్లు తెరిచింది. కానీ, 27 ఏళ్ల జీవితంలో అన్నీ గుర్తున్నాయి కానీ.. పెళ్లిరోజు మాత్రం ఆమె మెదడు నుంచి పూర్తిగా చెరిగిపోయింది! ఫొటోలు, వీడియోలు చూపించినా.. పెళ్లి జ్ఞాపకాలు గుర్తురాలేదు. ఇటీవల వీరి కథ తెలుసుకున్న ఇన్సైడ్ ఎడిషన్ మ్యాగజైన్వారు అమందాకు పెళ్లి జ్ఞాపకాలను కానుకగా అందించాలనుకున్నారు. మళ్లీ పెళ్లి చేసి, అమందా ముచ్చట తీర్చారు.