Killed in suspicious circumstances
-
ఆ 15 రోజులు .. ఏం జరిగింది
ఫిర్యాదుపై వేగంగా స్పందించని పోలీసులు పట్టింపులేని హాస్టల్ సిబ్బంది నెల రోజులు తెలియని ఆచూకీ చివరికి శవాలుగా కనిపించిన గిరిజన విద్యార్థినులు నర్సంపేట/పర్వతగిరి/నల్లబెల్లి/చెన్నారావుపేట: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పర్వతగిరి మండలం నారాయణపురం, కంబాలకుంట గ్రామాలకు చెం దిన విద్యార్థినులు ప్రియాంక(14), భూమిక(14)లు హాస్టల్ నుంచి వెళ్లిన పదిహేను రోజులు ఎక్కడున్నారనేది మిస్టరీగా మారింది. ఈ నెల 27న చెన్నారావుపేట మండలం ఖాదర్గుట్ట సమీపంలో లభించిన బాలికల మృతదేహాల స్థితిని పరిశీలిస్తే వారు పదిహేను రోజుల కిందట మరణించినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. విద్యార్థులు తప్పిపోయిన 33 రోజుల తర్వాత ఆచూకీ లభించింది. ఈ లెక్కన వీరు చనిపోవడానికి ముందు పదిహేను రోజుల పాటు ఎక్కడ, ఎవరితో ఉన్నారనేది కేసులో కీలకంగా మారింది. బాలికల మృతదేహాలు పడి ఉన్న చోటులో సేకరించిన ఆధారాలతో ఇప్పటి వరకు దర్యాప్తులో ఎటువంటి ముందడుగూ పడలేదు. మరోవైపు కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారం సైతం కేసు పురోగతికి దోహదం చేయడం లేదు. దీంతో బాలికల ఆచూకీ కాదుగదా వారు మరణించిన తర్వాత కూడా కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. నిర్లక్ష్యం తీరిది.. గిరిజన బాలికలు ప్రియాంక, భూమికల అనుమానాస్పద మృతికి పోలీసులు, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలికలు కనిపించకుండా పోయి నెలరోజులు దాటినా వారి ఆచూకీ కనిపెట్టలేకపోవడం పోలీసుశాఖ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ బాలికలు నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. 2015 నవంబరు 6న ప్రియూంక, 8న భూమిక అనారోగ్య కారణాలతో స్వగ్రావూలకు చేరుకున్నారు. వీరిద్దరు హాస్టల్‌కు వెళ్తున్నామంటూ నవంబరు 23న తిరుగు ప్రయాణమయ్యారు. హాస్టల్‌కు వెళ్లకుండా ములుగు మండలం మల్లంపల్లిలో ఉన్న బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. మరుసటి రోజు(నవంబరు 24న) హాస్టల్‌కు బయలుదేరినా అక్కడికి చేరుకోలేదు. చివరికి 33 రోజుల తర్వాత చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట గుట్ల సమీపంలో విగత జీవులుగా లభ్యమయ్యారు. ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యమైన సంఘటనలో పోలీసులు, హాస్టల్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి నుంచి బయల్దేరిన తమ పిల్లలు హాస్టల్‌కు చేరుకున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు నవంబరు 24 సాయంత్రం బాలికల తల్లిదండ్రులు హాస్టల్ వార్డెన్ (సంక్షేమ అధికారి) జాటోతు వీరమ్మను ఫోన్లో సంప్రదించగా ‘నేను పని మీద నర్సంపేటకు వచ్చాను. తిరిగి హాస్టల్ వెళ్లగానే కబురు చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చారు. తాపీగా రెండు రోజుల తర్వాత నవంబరు 26న బాలికలు రాలేదంటూ తల్లిదండ్రులకు వీరమ్మ ఫోన్లో తెలిపారు. దీంతో బాలికల తల్లిదండ్రులు 27న హాస్టల్‌కు చేరుకుని అక్కడ ధర్నా చేశారు. బాలికల ఆచూకీ కనిపెట్టాలంటూ నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో నవంబరు 27 ఫిర్యాదు చేయగా.. పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటూ అక్కడి పోలీసులు సూచించారు. దీంతో నవంబరు 28న పర్వతగిరిలో ఫిర్యాదు నమోదైంది. కేసు విచారణలో భాగంగా పర్వతగిరి ఎస్సై ములుగు మండలం మల్లంపల్లిలో బాలికల బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత బాలికల తల్లిదండ్రులు అనుమానితులుగా పేర్కొన్న ఆటోడ్రైవరును విచారించారు. సదరు ఆటోడ్రైవరు ఫోన్ నుంచి బాలికలు నెక్కొండకు చెందిన మరో వ్యక్తికి ఫోన్ చేసినట్లుగా తెలుసుకుని అతన్ని సైతం విచారించారు. ఈ రెండు సందర్భాల్లో ఆశించిన మేరకు సమాచారం రాకపోవడంతో కేసు విచారణలో వేగం మందగించింది. డిసెంబరు 6, 8 తేదీలలో పర్వతగిరి స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు పర్యాటక ప్రాంతాల్లో గాలించారు. తల్లిదండ్రులు కూడా తిరుపతి, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో వెతికారు. డిసెంబరు 27న చెన్నారావుపేట మండలం ఖాదర్గుట్ట సమీపంలో గుర్తుపట్టలేని స్థితిలో బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుడు పోలీసుశాఖలో కదలిక వచ్చింది. హాస్టల్లో బాలికలు అదృశ్యమైన తర్వాత వారికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడంలో హాస్టల్ వార్డెన్ జాటోతు వీరమ్మ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదృశ్యమైన విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని తోటి విద్యార్థినుల నుంచిగానీ, సన్నిహితంగా ఉండే ఇతర హాస్టల్ సిబ్బంది నుంచిగానీ సేకరించేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. తమ పిల్లలు కనిపించకుండా పోయారని ఆందోళన చేసిన తల్లిదండ్రులపై నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వార్డెన్.. విద్యార్థులు తప్పిపోయినట్లుగా మాత్రం ఎటువంటి ఫిర్యాదూ ఇవ్వలేదు. నల్లబెల్లి హాస్టల్‌కు బయల్దేరే ముందు పర్వతగిరిలో ఓ ఫొటో స్టూడియోలో ఇద్దరు విద్యార్థినులు ఫొటోలు దిగినట్లు తెలిసింది. నవంబరు 24 నుంచి డిసెంబరు 27 వరకు విద్యార్థినుల ఆచూకీ లభించని కాలంలో వీరు సేంద్రియ ఎరువులు కంపెనీ తరఫున రిప్రజెంటేటీవ్‌గా పనిచేశారంటూ ప్రచారం జరుగుతోంది. విద్యార్థినుల ఫొటోలు చూపించి రామప్ప ఆలయం దగ్గర విచారించగా... వారు అక్కడకు వచ్చినట్లుగా సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. అయితే కచ్చితమైన తేదీని వెల్లడించలేకపోతున్నారు. -
విషాదాంతం
రెండు యువ జంటల కన్నుమూత తాడిగడపలో దంపతుల అనుమానాస్పద మృతి కుటుంబసభ్యులపై అనుమానం పశ్చిమగోదావరిలో జిల్లాకు చెందిన మరో జంట ఆత్మహత్య పెను విషాదం.. ఒకే రోజు రెండు యువజంటలు కన్నుమూశాయి. ఒకచోట భార్యాభర్తలు కలిసే కన్నుమూయగా.. మరో ప్రాంతంలో భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. పెనమలూరు : అనుమానాస్పద స్థితిలో ఓ యువజంట మరణించింది. తాడిగడప వసంతనగర్‌లో జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. యువకుడి తల్లిదండ్రులు, సోదరుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని యువతి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం... ఉంగుటూరు మండలం పొణుకుమాడు గ్రామానికి చెందిన దండూరి ప్రసాద్(30)కు, గుంటూరు జిల్లా ఎర్రబాలేనికి చెందిన లక్ష్మి(25)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ప్రసాద్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరు ఎనిమిదేళ్లుగా తాడిగడపలోని వసంతనగర్ కాలువ కట్టపై ఉంటున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ప్రసాద్ ఇంటి పక్క పోర్షన్లో అతని తమ్ముడు రాధాకృష్ణ, భార్య రంగమ్మ, కుమారుడితో కలిసి ఉంటున్నారు. సరిహద్దు విషయమై అన్నాదమ్ముల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఇద్దరి కుటుంబాల మధ్య మాటలు లేవు. -
‘సర్వే’ రోజు అదృశ్యం.. అస్థిపంజరంగా ప్రత్యక్షం
వీడిన వీఆర్వో అదృశ్యం మిస్టరీ హత్యేనంటూ ఆందోళన ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మందపల్లి వీఆర్వో కె.రాజేశ్వర్ అదృశ్యం మిస్టరీ వీడింది. నాగాపూర్ అటవీ ప్రాం తంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం అస్థికలు లభ్యం అయ్యా యి. సీఐ జీవన్‌రెడ్డి కథనం ప్రకారం.. గత నెల 19న సమగ్ర కుటుంబ సర్వే విధులకు వెళ్లిన రా జేశ్వర్ తిరిగి రాలేదు. ఈ మేరకు గత నెల 22న కుటుంబసభ్యులకు పెంబి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సోమవారం నాగాపూర్ అటవీ ప్రాంతంలో స్థానికులకు అస్థికలు కనిపించడం తో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో దుస్తులు, సెల్‌ఫోన్, గుర్తింపు కా ర్డు ఆధారంగా మృతుడు రాజేశ్వర్‌గా గుర్తిం చా రు. దుస్తులు, అస్థికలు, కపాలం వేర్వేరుగా కొద్ది దూరంలో పడి ఉండడం.. పక్కనే చెట్టుకు ధోవ తి కట్టి ఉండడంతో రాజేశ్వర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజేశ్వర్‌ది హత్యేన ని ఆరోపిస్తూ దళిత సంఘాలు మృతుడి కుటుం బసభ్యులు, అస్థికలతో రాస్తారోకో చేశారు. -
ఏ తల్లి బిడ్డలో.. చెరువులో శవాలయ్యూరు
వడ్డేపల్లి చెరువులో తేలిన గుర్తుతెలియని ఇద్దరు చిన్నారుల మృతదేహాలు మృతులు అన్నదమ్ములుగా అనుమానం ముక్కుపచ్చలారని చిన్నారులిద్దరు ముద్దొ చ్చేలా తయారయ్యారు.. ఏం జరిగిందోగాని వారు చెరువులో విగతజీవులుగా తేలారు. ఆ కుటుంబ మంటే గిట్టని ఉన్మాదులు చేసిన దారుణమా ? లేక మరేదైనా కారణమా ? అనేది తెలియరాలేదు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఇద్దరు చిన్నారుల గుర్తింపునకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. వివరాలిలా ఉన్నాయి. కాజీపేటలోని వడ్డేపల్లి చెరువులో పదేళ్ల వయస్సులోపు ఉన్న పిల్లల మృతదేహాలు చెరువులో తేలియూడుతున్నట్లు మత్య్సకారులు.. స్థానికులకు సమాచారమిచ్చారు. వారి సమాచారం తో పోలీసులు వచ్చి పిల్లల మృతదేహాలను బయటికి తీరుుంచారు. పిల్లలు ఒంటిపై చక్కటి దుస్తులు ధరించి ఉన్నారు. శరీరాలు బాగా ఉబ్బిపోయి కుళ్లిపోయే స్థితికి చేరాయి. మృతదేహాలను బయటకు తీయగానే ఒక్కసారిగా దుర్వాసన వెలువడింది. వీరు మృతిచెంది రెండు, మూడు రోజులకుపైగా అవుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పిల్ల లు తప్పిపోయినట్లు జిల్లాలో ఎక్కడైనా కేసు నమోదైందో వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, స్థానికం గా మాత్రం ఎవరూ తమ పిల్లలు కన్పించడంలేదనే ఫిర్యాదులు చేయలేదంటున్నారు. కాగా చుట్టుపక్క ల ప్రాంతాలకు చెందిన ప్రజలు చెరువు కట్టపైకి చేరుకుని మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యూరు. ‘ఏ తల్లి కన్నబిడ్డలో.. చూడటానికి ముద్దొచ్చేలా ఉన్నారు.. ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకున్నారని’ రోదించారు. హత్యా ! మరేదైనా కారణమా ? మృతులిద్దరూ అన్నదమ్ములే అయి ఉంటారని స్థాని కులు అనుమానిస్తున్నారు. ఒకరినొకరు పట్టుకుని మృతిచెందినట్లుగా ఇద్దరు కలిసే నీటిలో తేలారు. కాళ్లకు శాండిల్స్ వేసుకుని ఉన్నారు. పిల్లలు స్థానికు లు కాకపోవచ్చని, ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు చెరువు చూపిస్తామని నమ్మించి ఇక్కడకు తీసుకొచ్చి చంపి చెరువులో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. పిల్లలను కిడ్నాప్ చేసి చంపా రా లేక కన్నవాళ్లే కడతేర్చారా అనే కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల ఫొటోలను రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లకు పంపి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రిపోర్టు వ స్తే తప్ప పిల్లలు ఎలా చనిపోయారనేది నిర్ధారణ చేయలేమని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాలను గుర్తించినవారు 94910-89128, 94407-00506 నంబర్లకు ఫోన్ చేయాలని కాజీపేట సీఐ పురుషోత్తం కోరారు