ఏ తల్లి బిడ్డలో.. చెరువులో శవాలయ్యూరు
వడ్డేపల్లి చెరువులో తేలిన
గుర్తుతెలియని ఇద్దరు చిన్నారుల మృతదేహాలు
మృతులు అన్నదమ్ములుగా అనుమానం
ముక్కుపచ్చలారని చిన్నారులిద్దరు ముద్దొ చ్చేలా తయారయ్యారు.. ఏం జరిగిందోగాని వారు చెరువులో విగతజీవులుగా తేలారు. ఆ కుటుంబ మంటే గిట్టని ఉన్మాదులు చేసిన దారుణమా ? లేక మరేదైనా కారణమా ? అనేది తెలియరాలేదు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఇద్దరు చిన్నారుల గుర్తింపునకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. వివరాలిలా ఉన్నాయి. కాజీపేటలోని వడ్డేపల్లి చెరువులో పదేళ్ల వయస్సులోపు ఉన్న పిల్లల మృతదేహాలు చెరువులో తేలియూడుతున్నట్లు మత్య్సకారులు.. స్థానికులకు సమాచారమిచ్చారు. వారి సమాచారం తో పోలీసులు వచ్చి పిల్లల మృతదేహాలను బయటికి తీరుుంచారు. పిల్లలు ఒంటిపై చక్కటి దుస్తులు ధరించి ఉన్నారు. శరీరాలు బాగా ఉబ్బిపోయి కుళ్లిపోయే స్థితికి చేరాయి. మృతదేహాలను బయటకు తీయగానే ఒక్కసారిగా దుర్వాసన వెలువడింది. వీరు మృతిచెంది రెండు, మూడు రోజులకుపైగా అవుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పిల్ల లు తప్పిపోయినట్లు జిల్లాలో ఎక్కడైనా కేసు నమోదైందో వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, స్థానికం గా మాత్రం ఎవరూ తమ పిల్లలు కన్పించడంలేదనే ఫిర్యాదులు చేయలేదంటున్నారు. కాగా చుట్టుపక్క ల ప్రాంతాలకు చెందిన ప్రజలు చెరువు కట్టపైకి చేరుకుని మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యూరు. ‘ఏ తల్లి కన్నబిడ్డలో.. చూడటానికి ముద్దొచ్చేలా ఉన్నారు.. ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకున్నారని’ రోదించారు.
హత్యా ! మరేదైనా కారణమా ?
మృతులిద్దరూ అన్నదమ్ములే అయి ఉంటారని స్థాని కులు అనుమానిస్తున్నారు. ఒకరినొకరు పట్టుకుని మృతిచెందినట్లుగా ఇద్దరు కలిసే నీటిలో తేలారు. కాళ్లకు శాండిల్స్ వేసుకుని ఉన్నారు. పిల్లలు స్థానికు లు కాకపోవచ్చని, ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు చెరువు చూపిస్తామని నమ్మించి ఇక్కడకు తీసుకొచ్చి చంపి చెరువులో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. పిల్లలను కిడ్నాప్ చేసి చంపా రా లేక కన్నవాళ్లే కడతేర్చారా అనే కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల ఫొటోలను రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లకు పంపి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రిపోర్టు వ స్తే తప్ప పిల్లలు ఎలా చనిపోయారనేది నిర్ధారణ చేయలేమని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాలను గుర్తించినవారు 94910-89128, 94407-00506 నంబర్లకు ఫోన్ చేయాలని కాజీపేట సీఐ పురుషోత్తం కోరారు