కన్నీరు మున్నీరు అవుతున్న బాధిత కుటుంబ సభ్యులు
ఖలీల్‌వాడి /ఎడపల్లి : ఆహ్లాదకరమైన వాతావరణం అందించే అశోక్ సాగర్ ఇప్పుడు సూసైడ్ స్పా ట్‌గా మారింది. శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లు ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేయగా అందులో మూడేళ్ల బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటనతో అశోక్ సాగర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నాలుగు నెలల్లో సుమారు పది ఘటనల వరకు ఇక్కడ జరిగాయి. ఎడపల్లి మండలం జాన్కంపేట్ పరిధిలో ఉన్న ఈ చెరువు వందేళ్ల క్రితం ఏర్పడింది. దీనిని పెద్ద చెరువుగా పిలిచేవారు. నిజామాబాద్, బోధన్ రహదారిపై చెరువు ఉండటంతో ప్రయాణికులకు ఆహ్లాదం అందించడానికి 2001లో అప్పటి జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ పర్యాటకంగా అభివృద్ధి చేశారు.
రాక్ గార్డెన్‌తో పాటు చెరువులో బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జానకం పేట చెరువు అశోక్ సాగర్‌గా పిలువబడు తోంది. ఇది నగరానికి 12 కిలోమీటర్లు దూరంలో ఉంది. బీజీలైఫ్ గడిపే నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ చెరువు నుంచి 5 కిలోమీటర్ల దూ రంలో అలీసాగర్ ఉద్యానవనం ఉంది. ఈ రోడ్డు బాసర పుణ్యక్షేత్రానికి వెళ్లే రహదారి కావడంతో పర్యాటకులకు పిక్‌నిక్ స్పాట్‌గా మారింది.
అయితే గత కొంత కాలంగా అశోక్‌సాగర్ వద్ద ఆత్మహత్యల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ కలహాలు, భర్త మద్యానికి బానిసై వేధింపులకు గురిచేయడంతో మహిళలు పిల్లలతో సహా ఆత్మహత్య చే సుకున్న ఘటనలు ఇక్కడ గతంలో చోటుచేసుకున్నాయి. నిరుద్యోగ యువకులు, వ్యాపారంలో న ష్టం వచ్చి ఆర్థిక ఇబ్బందుతో బాధపడుతున్న వారు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.
పోలీసుల భద్రత పెంచాలి
అశోక్ సాగర్‌లో పోలీసుల భద్రతతో పాటు బ్లూకోల్ట్స్ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉంది. ఆత్మహత్యాయత్నాలకు పాల్పడే వా రిని కాపాడి కౌన్సెలింగ్ ఇవ్వాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వరకట్న వేధింపులతోనే..
నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెళ్లు అక్షయ, నిఖిత తమ ముగ్గురు పిల్లలతో కలిసి శుక్రవారం అత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అందులో అక్షయ కుమారుడు చిన్నా అలియాస్ భువనేశ్వర్ (3) నీటిలో గల్లంతు అయ్యా డు. అక్షయతో పాటు నిఖిత ఆమె పిల్లలు భవశ్రీ, శ్రీమాన్‌లను రోడ్డున వెళ్లే వారు కాపాడారు. అక్షయ వివాహం హైదరాబాద్‌కు చెందిన హేమంత్‌తో, నిఖిత వివాహం మెదక్‌కు చెందిన మహేశ్‌తో జరిగింది. కొంతకాలంగా హేమంత్, మహేష్ ఇద్దరూ కట్నంగా ఇచ్చిన ఇంటిస్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలని తమ భార్య లను వేధిస్తున్నారు.
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన అక్కా చెల్లెళ్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో రోడ్డు వెంట బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకు లు దీనిని గమనించి, ఘటన స్థలానికి చేరుకున్నారు. నిజామాబాద్ నెహ్రూనగర్‌కు చెందిన షేక్ హైదర్ చెరువులోకి దిగి నిఖిత, అక్షయలతోపాటు భవశ్రీ, శ్రీమాన్‌లను రక్షించాడు. మిగతా ఇద్దరు గౌస్, షారూక్ ఖాన్ ఒడ్డున ఉండి బాధితులను బయటకు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment