Tadigadapa
-
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: తాడిగడప శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని మృతి చెందింది. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామానికి చెందిన రామిశెట్టి గంగా భువనేశ్వరి.. నీట్లో కోచింగ్ తీసుకుంటోంది. కామినేని ఆసుపత్రికి విద్యార్థిని మృతదేహన్ని తరలించారు. కాగా, తమ కుమార్తె మృతిపై విద్యార్థిని తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు, కుమార్తె మృతి విషయం తెలుసుకున్న తండ్రికి గుండెపోటుకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.విద్యార్ధి తల్లి గోవింద లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు ఎటువంటి ఆనారోగ్య సమస్యలు లేవని.. నిన్న రాత్రి కూడా తనతో ఫోన్లో మాట్లాడిందన్నారు. గత రాత్రి తన కుమార్తెకు తలనొప్పి వస్తే అర్ధరాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పుడు చనిపోయింది అంటున్నారు.తలనొప్పి వస్తే ప్రాణం పోతుందా?. ఇప్పుడు నిర్లక్ష్యంగా శవాన్ని తీసుకువెళ్లమంటున్నారు’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన విషయం ఎందుకు దాచారు?. చనిపోయిందని ఆలస్యంగా ఎందుకు తెలిపారు?’’ అంటూ ఆమె ప్రశ్నించారు.ఇదీ చదవండి: తప్పు స్పెల్లింగ్‌తో నకిలీ కిడ్నాప్ గుట్టు రట్టు -
పగలు పార్టీ పని.. రాత్రి పేకాట
అడ్డంగా దొరికిన తాడిగడప ఉప సర్పంచ్ శ్రీనివాసరావు మరో 17 మంది అరెస్టు రూ. 4.62 లక్షల స్వాధీనం చంద్రబాబు ఫోటోతో ఆ నేత హల్చల్ పెనమలూరు: తాడిగడప గ్రామంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్న తాడిగడప టీడీపీ అధ్యక్షుడు, గ్రామ ఉప సర్పంచి మాణిక్యపల్లి శ్రీనివాసరావు (పేకాట శ్రీను) పోలీసుల వలకు చిక్కాడు. పోలీసు దాడుల్లో టీడీపీ నేతతో పాటు మరో 17 మంది పేకాడుతూ పట్టుపడగా,వారి వద్ద రూ. 4.62 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మాణిక్యపల్లి శ్రీనివాసరావు పై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటు ఉంది. అతని పనే పేకాట శిబిరాలు నిర్వహించడని ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో శుక్రవారం రాత్రి టీడీపీ నేత మేడసాని తాతేశ్వరరావు ఇంట్లో రాత్రి పేకాట ఆడుతున్న సమాచారం సెంట్రల్ ఏసీపీ సత్యానందంకు తెలిసి ఆయన అత్యంత గోప్యంగా పటమట సీఐ కెనడీ, పెనమలూరు సీఐ మామోదర్‌లతో కలిసి ఇంటిపై దాడి చేశారు. నిందితులను పెనమలూరు పీఎస్‌కు తరలించారు. పగలు పార్టీ పని.. రాత్రి పేకాట టీడీపీ నేత శ్రీనివాసరావు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫోటో కూడా దిగారు. వాటితో ఫ్లెక్సీలు వేయిస్తున్నారు. అలాగే ఎంపీ కొనకళ్ల నారాయణకు సన్మానం చేశాడు. పగటి పూట పార్టీ పనులు, రాత్రి పేకాట శిబిరాల్లో బిజీగా ఉంటాడని చెబుతున్నారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడెప్రసాద్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో అధికారంలో లేనప్పుడు పలు కేసుల్లో ఇతనిపై పోలీసులు రౌడీషీటు కూడా తెరిచారు. -
రేపు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాక
లబ్బీపేట : భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌కలాం ఆదివారం నగరానికి రానున్నారు. ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ పి.రమేష్‌బాబు గుంటూరులో ఏర్పాటుచేసిన 350 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించేందుకు వస్తున్న ఆయన తాడిగడపలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్య సంస్థను కూడా సందర్శించనున్నారు. కలాం ఇప్పటివరకు నగరానికి మూడుసార్లు వచ్చారు. 1998లో ఆయన పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ అవార్డు తీసుకున్నారు. తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు. అప్పుడు ఆయన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీ వో) చీఫ్‌గా ఉన్నారు. అప్పట్లో చాలా సాదాసీదాగా ఒక డిఫెన్స్ కారులో ఎలాంటి హడావుడి లేకుండా వచ్చి వెళ్లారు. 2006లో రాష్ట్రపతి హోదాలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్.ఆర్.ఐ. ఆస్పత్రి, సిరీస్ కంపెనీలను సందర్శించారు. మరోసారి 2008 ఏప్రిల్‌లో రామకృష్ణ మిషన్ విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. మళ్లీ ఏడేళ్ల తర్వాత కలాం నగరానికి రానున్నారు. -
విషాదాంతం
రెండు యువ జంటల కన్నుమూత తాడిగడపలో దంపతుల అనుమానాస్పద మృతి కుటుంబసభ్యులపై అనుమానం పశ్చిమగోదావరిలో జిల్లాకు చెందిన మరో జంట ఆత్మహత్య పెను విషాదం.. ఒకే రోజు రెండు యువజంటలు కన్నుమూశాయి. ఒకచోట భార్యాభర్తలు కలిసే కన్నుమూయగా.. మరో ప్రాంతంలో భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. పెనమలూరు : అనుమానాస్పద స్థితిలో ఓ యువజంట మరణించింది. తాడిగడప వసంతనగర్‌లో జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. యువకుడి తల్లిదండ్రులు, సోదరుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని యువతి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం... ఉంగుటూరు మండలం పొణుకుమాడు గ్రామానికి చెందిన దండూరి ప్రసాద్(30)కు, గుంటూరు జిల్లా ఎర్రబాలేనికి చెందిన లక్ష్మి(25)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ప్రసాద్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరు ఎనిమిదేళ్లుగా తాడిగడపలోని వసంతనగర్ కాలువ కట్టపై ఉంటున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ప్రసాద్ ఇంటి పక్క పోర్షన్లో అతని తమ్ముడు రాధాకృష్ణ, భార్య రంగమ్మ, కుమారుడితో కలిసి ఉంటున్నారు. సరిహద్దు విషయమై అన్నాదమ్ముల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఇద్దరి కుటుంబాల మధ్య మాటలు లేవు.