నెలాఖరులోగా నూరుశాతం ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం
2014 సమగ్ర సర్వే వివరాలను నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు వెల్లడించలేదు : మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతపర్చేందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టినట్టు రాష్ట్ర రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం అన్ని రకాల అంశాలతో ఈ సర్వేను శాస్త్రీయంగా నిర్వ హిస్తోందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 17వ తేదీనాటికి రాష్ట్రవ్యాప్తంగా 58.3% ఇళ్లను సర్వే చేశామని, నెలాఖరులోగా నూరుశాతం సర్వే పూర్తి చేస్తామన్నారు.
ఇప్పటికే సర్వే చేసిన ఇళ్లకు సంబంధించి వివరాలను కంప్యూ టరీకరిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ప్రజల స్థితి గతులు తెలుసుకొని ప్రస్తుతం అమలు చేస్తున్న పథ కాలను విస్తృతం చేయడంతోపాటు కొత్త పథకాల అమలు కోసం ఈ సర్వే ఎంతో ఉపయోగ పడుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా సర్వే ప్రక్రియను నిర్వ హిస్తోందన్నారు. తాజాగా చేప డుతున్న సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.
మంచి ఉద్దేశంతో చేపడుతున్న సర్వేను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, అధికారులకు వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పథకాల్లో కోతపడుతుందని, పలు రకాల బెనిఫిట్స్ ఆగిపోతాయంటూ ప్రతిపక్ష పార్టీలు దుర్మార్గంగా మాట్లాడుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసిందని, కానీ ఆ సర్వేకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదన్నారు. ప్రజల ఆస్తులు తెలుసుకొని వాటిని కొల్లగొట్టేందుకు అప్పటి సర్వేను బీఆర్‌ఎస్ ప్రభుత్వం వినియోగించుకుందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టే సర్వే దేశానికే ఆదర్శంగా నిలిపేలా ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment