సాక్షి ప్రతినిధి, వరంగల్ : సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సేకరించిన వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసే ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. సర్వే సందర్భంగా వరంగల్ నగరంలో వివరాల సేకరణలో విఫలమైన అధికార యంత్రాంగం... వీటి నమోదు విషయంలోనూ అదే దారిలో నడుస్తోంది. జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరితో సర్వే వివరాల నమోదు గడువులోపు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
సర్వే వివరాల నమోదుకు అవసరమైన వసతులను కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. వివరాల నమోదు కోసం నియమించాల్సిన కంప్యూటర్ ఆపరేటర్లకు ఇచ్చే మొత్తం జిల్లాలో మరీ తక్కువగా ఉండడంతో ఈ పనుల కు ఎక్కువ మందిముందుకు రాలే దు. అవసరమైన కంప్యూటర్లు సమకూర్చే విషయంలో ఇదే జరిగింది. దీంతో సర్వేవివరాల నమోదు ఎప్పటివరకు పూర్తవుతుందో ఉన్నతాధికారులే చెప్పలేని పరిస్థితి ఉంది.
సర్వే సైతం అసంపూర్తిగానే...
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. జిల్లాలో 11.40 లక్షల కుటుంబాల వివరాలను సేకరించారు. వరంగల్ నగర పరిధిలో సుమారు 2.55 లక్ష ల కుటుంబాల వివరాలను తీసుకున్నారు. 19న పలు కారణాలతో వివిధ ప్రాంతాల్లో సర్వే నిర్వహించలేకపోవడంతో మరొకరోజు ఈ ప్రక్రియ నిర్వహించారు. అరుునా అధికారులు పూర్తిస్థాయిలో సేకరిం చలేదు. ఇలా సమగ్ర సర్వే జిల్లాలో అసంపూర్తిగానే ముగిసింది.
గడువు పెంచినా...
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమ లు, కొత్త ప్రాజెక్ట్‌లు, ప్రణాళికల రూ పకల్పనకు సమగ్ర సర్వే వివరాలే ప్రమాణికంగా ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. వీలైనంత త్వర గా సర్వే వివరాలను నమోదు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆగస్టు 22 నుంచి సర్వే వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయడం మొదలైంది. సర్కారు నిర్దేశించిన ప్రకారం సెప్టెం బర్ 3లోపు ఈ ప్రక్రియ పూర్తి కావా ల్సి ఉంది. గడువు దాటినా పూర్తికాలేదు. ఇప్పటివరకు 8.30 లక్షల కుటుంబాల వివరాలనే కంప్యూటర్ లో నమోదు చేశారు. ఫలితంగా సర్వే వివరాల నమోదులో రాష్ట్రంలో నే జిల్లా చివరి స్థానంలో నిలిచింది. దీంతో వివరాల నమోదు గడువును ప్రభుత్వం ఈనెల 7 వరకు పొడిగిం చింది. అరుునా మన జిల్లాలో అప్పటివరకు ఈప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు.
నగరంలోనే అతి తక్కువగా...
జిల్లావ్యాప్తంగా 19 కేంద్రాల్లోని 2వేల కంప్యూటర్లలో రెండు విడతల సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవేకాకుండా కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్స్‌హాలు, ఎన్‌ఐసీ, ప్రగతిభవన్, అటవీశాఖ ఉత్తర డివి జన్ కార్యాలయంలో మరో 100 కంప్యూటర్లలో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలల్లో నగరానికి సంబంధించి 2.50 లక్షల కుటుంబాల వివరాల నమోదు ప్రక్రియ జరగుతోంది. ఇప్పటికి కేవలం 62వేల కుటుంబాల వివరాలే నమోదయ్యాయి. జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ ఎక్కువగా ఉండే నగరంలోనే ఈ పరిస్థితి ఉండడం విమర్శలకు తావిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఏటూరునాగారం, తాడ్వాయి, గీసుకొండ, మంగపేట, హసన్‌పర్తి, మొగుళ్లపల్లి, వెంకటాపూర్, వర్ధన్నపేట, భూపాపలపల్లి, రాయపర్తి మండలాల్లో నమోదు ప్రక్రియ ముగిసింది.
గడువు లోపు పూర్తిచేస్తాం...
సర్వే వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసే ఆపరేటర్లకు ఉదయం పూట అయితే ఒక కుటుంబానికి రూ.5.. రాత్రి సమయాల్లో రూ.7 చెల్లిస్తున్నట్లు అధికారులు తెలి పారు. మన జిల్లాలోనే ఇంత తక్కువ చెల్లిస్తున్నారు. దీంతో వివరాలు నమోదు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఫలితంగా నమోదు ఎంతకీ పూర్తి కావడంలేదు. సర్వే వివరాల నమోదును పర్యవేక్షిస్తున్న జిల్లా సమాచార అధికారి(డీఐ) విజయ్‌కుమార్ మాత్రం ఈనెల 7నాటికి ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు.
నమోదు..నిదానం
Published Sat, Sep 6 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM
Advertisement
Advertisement