computer operators
-
ఓ డాక్టరమ్మ.. చిట్టీలిచ్చే సార్లు ఎప్పుడత్తరు..!
సాక్షి, వరంగల్: ‘ఎంజీఎంల మంచిగ సూత్తరట’ అని ఎవరో అంటూంటే విని వచ్చాడు భీంరావు. అతడిది కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ గ్రామం. 8:20కి బస్సు దిగాడు. త్వరత్వరగా వెళ్లి ఓపీ దగ్గర పేరు రాయించుకునేందుకు లైన్లో నిల్చున్నాడు. అప్పటికే తనకంటే ముందు ఓ పదిమంది లైన్లో ఉన్నారు. ఓ వైపు తీవ్రమైన కడుపునొప్పి. అరగంట దాటింది. ‘ఓ డాక్టరమ్మ.. చిట్టీలిచ్చే సార్లు ఎప్పుడత్తరు’ అని అడిగాడు భీంరావు. ‘వస్తారు’ అని సమాధానమిచ్చింది నర్సు. అలా దాదాపు మరో గంట గడిచింది. సరిగ్గా పదింటికి వచ్చారు ఓపీ చిట్టీలు ఇచ్చే కంప్యూటర్ ఆపరేటర్లు. కంప్యూటర్లు ఆన్ చేసి, అందులో పనిచేసే వాళ్లకు తెలిసిన వాళ్లకు, వెనుకవైపు కిటికీ నుంచి ఇంకా బాగా తెలిసిన వాళ్లకు.. ఇలా భీంరావు వంతు వచ్చే సరికి అరగంట పట్టింది. అప్పటికి క్యూలైన్ మరింత పెరిగింది. ఓపీ చిట్టీ అందుకొని డాక్టర్ రూమెక్కడమ్మా.. అని అడుగుకుంటూ పరిగెట్టాడు భీంరావు. ఇలా ఒక్క భీంరావు మాత్రమే కాదు. ఎంతోమంది నిత్యం ఓపీ చిట్టీల దగ్గర ఎదురుచూడాల్సిందే! నిత్యం వేలాది మంది ఎంజీఎం ఆస్పత్రికి వస్తుంటారు. అంత మంచి పేరున్న ఆస్పత్రిలో కొందరి కారణంగా రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొంతమంది సిబ్బంది నెల రోజులుగా సమయపాలన పాటించకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రతీ సోమ, మంగళ, బుధవారాల్లో రోగులు కొన్ని సందర్భాల్లో వైద్యులను కూడా కలవకుండానే వెనుదిరుగుతున్నారు. ఒకవేళ కలిసినా స్కానింగ్, రక్త, మూత్ర పరీక్షలు చేయాల్సి ఉంటే సమయం సరిపోక మరో రోజు తిరిగి ఆసుపత్రికి వస్తున్నారు. లేదంటే తెలిసిన వారింట్లో, బంధువుల ఇంట్లో తలదాచుకొని తెల్లవారి వస్తున్నారు. అసలే మళ్లీ కరోనా వేరియంట్ రూపు మార్చుకుంది. ఇక్కడ సోషల్ డిస్టెన్స్ మాట అటుంచితే సమయానికి వైద్యున్ని కలిసే అవకాశం కూడా దొరకట్లేదు. రోగులకు ఇక్కట్లు.. రోగులకు సమయానుకూలంగా సేవలందించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా కనబడుతోంది. సోమవారం రూమ్ నంబర్ 3 (ఓపీ చిట్టిలు ఇచ్చే విభా గం) నుంచి అర కిలో మీటరు మేర రెండు క్యూ లైన్లు ఉండడాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. దీనికి కారణం ఏంటని వివరాలు ఆరా తీయడంతో కంప్యూటర్ అపరేటర్లు ఆలస్యంగా వస్తున్నారని తెలిసింది. దీంతో పాటు రోగులను పరీక్షించాల్సిన ప్రత్యేక డాక్టర్ల స్థానంలో చాలామంది పీజీ వైద్యులే ఉన్నారు. చాలా మంది వైద్యులు తమ సొంత క్లినిక్‌లపై దృష్టి సారించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఆసుపత్రి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇటు కంప్యూటర్ ఆపరేటర్లు, అటు వైద్యుల సమయపాలన లేమితో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిలబడలేక మరింత నడుంనొప్పి మామూనూరు క్యాంప్ సమీపంలోని జక్కలోది నుంచి ఆసుపత్రికి వచ్చా. గత సోమవారం వచ్చినప్పటికీ భారీ క్యూలైన్ ఉండడంతో నిల్చోలేక అవస్థలు పడ్డా. ఈ సోమవారం కూడా అదే పరిస్థితి కనిపించింది. నడుం నొప్పి విపరీతంగా ఉండడంతో చూపించుకునేందుకు వచ్చా. ఇంకా నా చేతికి ఓపీ చిట్టి రాలేదు. క్యూలైన్ ఉండడంతో ఇంకా మరింత నడుంనొప్పి కలుగుతోంది. – వరమ్మ, జక్కలోది గ్రామం 70 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చా.. దాదాపు 70 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చా. కీళ్ల నొప్పులు ఉండడంతో వైద్యుడితో పరీక్షించుకునేందుకు వచ్చా. ఉదయం ఎనిమిది గంటలకే చేరుకున్నా అప్పటికే లైన్ పెద్దగా ఉంది. 8.30కు రావాల్సిన కంప్యూటర్ ఆపరేటర్లు రాకపోవడంతో గంటన్నరపాటు లైన్లోనే నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురైంది. బాగా కాళ్లు గుంజినై. – బక్కయ్య, దంతాలపల్లి మండలం, బొడ్డలడ గ్రామం -
సంతకం సమర్పయామీ!
సంగారెడ్డి క్రైం: దొంగ చేతికి తాళం ఇచ్చినట్లుగా మారింది ప్రభుత్వ కార్యాలయాల్లోని పరిస్థితి. జిల్లాలోని ఆయా శాఖల్లో డిజిటల్ కీ వ్యవహారమంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉండాలి. కానీ ఆ వ్యవహారమంతా ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ల చేతిలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ శాఖల్లో సేవలను సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని శాఖలకు సంబంధించిన రికార్డులను కంప్యూటరీకరించి ఆన్లైన్ సేవలు అందిస్తోంది. అలాగే ఉన్నతాధికారులకు సంబంధించిన సిగ్నేచర్‌ను డిజిటలైజేషన్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ఆర్జీదారుల సర్టిఫికెట్ల కోసం సంతకాలు చేయాలంటే జాప్యమవుతోంది.జాప్యాన్ని నివారించేందుకు డిజిటల్ సిగ్నేచర్ పరికరం డిజిటల్ కీని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, రెవెన్యూ, ల్యాండ్ సర్వే, కార్మిక శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, పోలీసు తదితర శాఖల్లో ఈ డిజిటల్ కీ ప్రధాన భూమిక పోషిస్తోంది. ఆయా శాఖల ఉన్నతాధికారుల చేతుల్లో వుండాల్సిన డిజిటల్ కీ సిగ్నేచర్ వారికి తెలియకుండానే అనధికారికంగా దుర్వినియోగమవుతున్నట్టు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో డిజిటల్ కీ సిగ్నేచర్‌ను వాడుకొని ఒక సాధారణ కంప్యూటర్ ఆపరేటర్ రూ. 3 కోట్లకు పైగా నిధులను ఆన్లైన్ ద్వారా దారి మళ్లించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందంతో సమగ్ర విచారణ జరుపుతోంది. దీనితోపాటు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ నేతృత్వంలో జెడ్పీ సీఈఓ వర్షిణి, జిల్లా ఎస్పీ సుమతి నేతృత్వంలో సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్నలు వేర్వేరుగా దర్యాప్తులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కాగా వ్యవసాయ శాఖలో భారీగా నిధులు ఆన్లైన్ ద్వారా దారి మళ్లిన తర్వాత తీరిగ్గా అధికారులు తేరుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రతిరోజు సమావేశాలు, టెలీ కాన్ఫరెన్స్‌లు, మండలాల ప్రత్యేకాధికారుల నియామకం కారణంగా గ్రామాలను సందర్శించడం ఇలా ఆయా శాఖల అధికారులకు తీరక లేకుండాపోయింది. అంతేగాక డిజిటల్ కీని తమ వద్దే వుంచుకోవాలన్న విషయం తెలిసి కూడా ఉన్నతాధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డిజిటల్ కీని కార్యాలయాల సిబ్బందికి, కంప్యూటర్ ఆపరేటర్లకు అప్పగించి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ శాఖల్లోని కంప్యూటర్ ఆపరేటర్లే నియంతలుగా మారి అక్రమాలకు పాల్పడుతున్నారు. మీ సేవా, ఇతర ఆన్లైన్ సేవల ద్వారా ఇస్తున్న సర్టిఫికెట్లు చాలా వరకు ఆయా శాఖల ఉన్నతాధికారులకు సంబంధం లేకుండానే జారీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ ప్రధాన శాఖల్లో డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటే ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా అడ్డుకట్ట వేయడానికి అవకాశం వుంటుంది. డిజిటల్ సిగ్నేచర్ ఎందుకు వాడారు? ఏ ఏ సర్టిఫికెట్లకు వాడారో? పేర్కొంటూ రికార్డులు నమోదు చేస్తూ, వాటిని ప్రతి వారం జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది. -
కంప్యూటర్ ఆపరేటర్లకు బదిలీలు
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లను పక్కమండలాలకు బదిలీచేయనున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారానే భూముల క్రయ విక్రయాల్లోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని నిర్ణయానికి వచ్చిన అధికార యంత్రాంగం వారిని పక్క మండలాలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్ నాయక్ పరిపాలనాధికారి రమణ మూర్తికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్ కార్యాలయాలకూ ఉత్వర్వులు వెళ్లనున్నాయి. ఆపరేటర్లందరినీ వారు పనిచేస్తున్న మండలాల నుంచి పక్క మండలాలకు శనివారం నాటికి బదిలీచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దత్తిరాజేరు మండలం జి మర్రివలస గ్రామంలో ప్రభుత్వ భూమిని వేరే వ్యక్తుల పేరున వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. ఇందులోని అక్రమాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అప్పట్లో ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఎటువంటి చర్యలూ లేవు. దీనికి సంబంధం లేని ఇతర కారణంతో అక్కడి వీఆర్వోను ఇటీవలే సప్పెండ్ చేశారు. అలాగే భోగాపురం మండలంలో డిజిటల్కీ దుర్వినియోగం అయిందన్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఇక్కడా బాధ్యులెవరన్న విషయం తేల్చలేదు. వీఆర్వవోల పర్యవేక్షణలోనే నమోదు కంప్యూటర్ ఆపరేటర్లకు కంప్యూటర్ పరిజ్ఞానమే కానీ భూముల క్రయ, విక్రయాలపై అవగాహన తక్కువగా ఉంటుంది. అయితే ఈ భూముల అక్రమాలకు సంబంధించి వీఆర్వోలు, తహశీల్దార్ల ప్రమేయం లేకున్నా ఎలా జరుగుతున్నదన్న విషయాన్ని విస్మరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఉన్న వీఆర్వోలకు కనీస కంప్యూటర్ పరిజ్ఞానం లేదు. దీంతో వారు అధికారుల అనుమతితోనే కంప్యూటర్ ఆపరేటర్ల దగ్గర కూర్చుని వివరాలు నమోదు చేస్తుంటారు. వెబ్‌ల్యాండ్ తదితర పనులన్నీ వీఆర్వోలు చెప్పిన విధంగానే చేశారు. అయితే ఇప్పుడు పలు మండలాల్లో జరుగుతున్న భూ అక్రమాలకు, అధికారుల నిర్లక్ష్యానికి కంప్యూటర్ ఆపరేటర్లే కీలకమని భావించి వారిని బదిలీలు చేస్తున్నారు. అయితే తాము చేయని తప్పునకు తమను బలి చేస్తున్నారని కంప్యూటర్ ఆపరేటర్లు వాపోతున్నారు. మహిళలకు మినహాయింపు బదిలీల విషయంలో మహిళలకు మినహాయింపునిచ్చినట్టు తెలిసింది. వీరిని మినహాయించి మిగతా వారిని బదిలీలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ల జాబితాను తెప్పించుకుని ఎవరెవరెక్కడ ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారనే సమాచారంతో కలెక్టర్‌కు రిపోర్టు పంపిస్తున్నారు. శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ కార్యాలయాలకు బదిలీ ఉత్తర్వులు వెళ్లనున్నాయి. వేతనాలు ఇవ్వడం లేదు కానీ...! తహశీల్దార్ కార్యాలయాల్లో ఉన్న ఆపరేటర్లకు దాదాపు తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. ఇటీవల కొన్ని నెలలకు సంబంధించి బడ్జెట్ విడుదలయినప్పటికీ ఇంకా బిల్లులు పెట్టలేదని తెలిస్తోంది. వేతనాలు ఇవ్వకుండా పని చేయించుకుని ఇప్పుడు తమకు బదిలీలు చేయడం సరికాదని ఆపరేటర్లు వాపోతున్నారు. దత్తి రాజేరు తహశీల్దార్‌కు నోటీసులు మర్రి వలసలో చోటు చేసుకున్న భూ మాయకు సంబంధించి దత్తి రాజేరు మండల తహశీల్దార్ పేడాడ జనార్ధన రావుకు నోటీసు ఇవ్వాలని కలెక్టర్ ఎంఎం నాయక్ నిర్ణయించారు. తహశీల్దార్ కార్యాలయంలోని అదనపు ఆపరేటర్ , వీఆర్వో, ఇతరుల అక్రమాలను గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తూ నోటీసును పంపించాలని కలెక్టరేట్ పరిపాలనాధికారికి ఆదేశించారు. -
ఏడాదిగా జీతాల్లేవ్!
పాలకొండ: అవుట్ సోర్సింగ్ సిబ్బందికి చాకిరీ తప్ప చిల్లిగవ్వ అందడంలేదు. రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందికి గత 12 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతం. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థతి కొనసాగుతోంది. పైగా వేతనాలు అడిగితే సాగనంపుతామని అధికారులు భయపెడుతున్నారని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత, పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక సిబ్బందిని నియమించారు. 2008లో అవుట్ సోర్సింగ్ విధానం ప్రవేశపెట్టి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) పరిధిలో వీరిని కొనసాగిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో 64మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వెబ్ ల్యాండింగ్, మీ-సేవ, భూ వివరాల నమోదు వంటి కీలక కార్యకలాపాలకు వీరినే వినియోగిస్తున్నారు. ఈ శాఖలోని రెగ్యులర్ సిబ్బందికి కంపూటర్లపై అంతగా అవగాహన లేకపోవడంతో వీరే కీలకంగా మారారు. మీ సేవ ధ్రువపత్రాల జారీలోనే వీరే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 12 నెలలుగా..... అన్ని పనులకూ అవుట్ సోర్సింగ్ సిబ్బందినే వినియోగించుకుంటున్న అధికారులు వారికి వేతనాలు చెల్లించడంలో మాత్రం చొరవ తీసుకోవడం లేదు. ప్రతి వేతనాలు అందుతాయని ఆశగా ఎదురు చూడటం, తీరా అవి అందకపోవడంతో ఉసూరుమనడం.. మళ్లీ అదే ఆశతో కాలం వెళ్లదీయడం తమకు నిత్యకృత్యంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, 12 నెలలు దాటిపోవడంతో ఇప్పుడు అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించామని తెలిపారు. బెదిరింపులు మొదలు... వేతనాలు ఇవ్వకపోగా ప్రస్తుతం వీరికి బెదిరింపులు మొదలయ్యాయి. వేతనాలు చెల్లించనందుకు నిరసనగా ఆందోళన చేపట్టాలని ఇటీవల అవుట్ సోర్సింగ్ సిబ్బంది భావించారు. యూనియన్ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. సమావేశం నిర్వహించి విధులు భహిష్కరించాలని యోచించారు. అయితే ఉన్నతాధికారులు వీరిని హెచ్చరికలతో భయపెట్టారు. ఇప్పటికే పలు శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమయంలో నిరసన తెలియజేస్తే ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో వీరంతా విధులు నిర్వహిస్తున్నారు. -
ఈ-పాలన ఎప్పుడో..?
పల్లెలను ప్రపంచంతో అనుసంధానం చేసే బృహత్తర కార్యక్రమం ఈ-పాలన ఎందుకో జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. దీంతో లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు పంచాయతీ కార్యాలయాల్లో అలంకార ప్రాయంగా మారాయి. మరో వైపు ఈ-పాలన కోసం పది నెలల క్రితం శిక్షణ ఇచ్చిన కంప్యూటర్ ఆపరేటర్లకు నేటి వరకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. - మిర్యాలగూడ * నిర్వాహకులు, అధికారుల మధ్య కొరవడిన సమ్వయం * ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చినా.. పోస్టింగ్ ఇవ్వని అధికారులు * గ్రామపంచాయతీల్లో నిరుపయోగంగా కంప్యూటర్లు పాలనలో పారదర్శకతతో పాటు మారుమూల గ్రామాలను సైతం ఇంటర్నెట్ అనే వ్యవస్థ ద్వారా ప్రపంచంతో అనుసందానం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ-పాలనకు శ్రీకారం చుట్టింది. కానీ నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం నిర్వాహకులకు, ప్రభుత్వ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ-పాలనపై నీలినీడలు కమ్ముకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 2440 గ్రామ పంచాయతీలలో ఈ-పాలన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలోని 171 పంచాయతీలను అధికారులు ఎంపిక చేశారు. వీటిలో నల్లగొండ డివిజన్ పరిధిలో 65, మిర్యాలగూడ డివిజన్లో 53, భువనగిరి డివిజన్ పరిధిలో 53 గ్రామాలు ఉన్నాయి. ఎంపిక చేసిన గ్రామాలకు మూడు నెలల క్రితమే కంప్యూటర్లు పంపిణీ చేసి బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా ఇచ్చారు. కానీ ఆపరేటర్లను నియమించకపోవడంతో అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. పది నెలల క్రితం శిక్షణ పల్లెల్లో ఇంటర్నెట్ ద్వారా పాలన అందించడానికి గానూ కంప్యూటర్ ఆపరేటర్లను పది నెలల క్రితమే ఎంపిక చేశారు. వీరికి హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఆలస్యమైంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆగస్టులో పంచాయతీలకు కంప్యూటర్లు పంపిణీ చేసి ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చింది. కానీ ఆపరేటర్లను మాత్రం నియమించలేదు. పంచాయతీలకు కంప్యూటర్లు వచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో శిక్షణ పొందిన అభ్యర్థులు ఆయోమయంలో పడిపోయారు. జిల్లాలో 237 కంప్యూటర్ల పంపిణీ జిల్లాలో ఈ-పాలన అమలు చేయడానికి గానూ 237 కంప్యూటర్లు పంపిణీ చేశారు. జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయానికి ఒకటి చొప్పున 59, ఈ-పాలనకు ఎంపికైన గ్రామపంచాయతీలకు 171, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి రెండు, డివిజన్ పంచాయతీల కార్యాలయాలకు మూడు, జిల్లా పరిషత్ కార్యాలయానికి రెండు కంప్యూటర్లు కేటాయించిన పంపిణీ చేశారు. -
పల్లెకు చేరిన ఈ-పాలన
సంతకవిటి : పంచాయతీ ల్లో ఈ పాలన మొదలైంది. దీంతో గ్రామీణ ప్రజలకు సైతం ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి దశలో కొన్ని పంచాయతీలో ప్రారంభమైన ఈ ప్రక్రియ దశలవారీగా అన్ని పంచాయతీలకు విస్తరించనుంది. ఇప్పటివరకూ పంచాయతీల్లో రికార్డుల నిర్వహణతోపాటు అన్ని రకాల పనులు రాతకోతల రూపంలోనే జరుగుతున్నాయి. విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండే ది కాదు. కొందరు పెద్దలు తీసుకున్న నిర్ణయాలను అందిరపై రుద్దేవారు. ఈ పాలనలో భాగంగా అన్ని కార్యక్రమాలను ఆన్లైన్లో పొందుపరచడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ఏం జరుగుతుందన్నది ఎవరైనా తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. అక్రమాలను అరికట్టగలగడంతోపాటు వివిధ రకాల ధ్రువపత్రాలను సకాలంలో అందించేందుకు వీలవుతుంది. పంచాయతీ కార్యదర్శుల చుట్టూ రోజుల తరబడి కాళ్లరిగేలా తిరిగే బాధ తప్పుతుంది. అన్నింటికీ మించి ఎప్పుడూ మూసి ఉండే గ్రామసచివాలయాలు ఇక నుంచి 365 రోజులు ప్రజలకు సేవలందించనున్నాయి. జిల్లాలో ఇలా... జిల్లాలో మొత్తం 1099 పంచాయతీలు ఉండగా తొలిదశగా ప్రస్తుతం 87 పంచాయతీల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. సంతకవిటి మండలంలో మొత్తం 34 పంచాయతీలు ఉండగా ఆరు పంచాయతీల్లో వీటిని గత నెలాఖరు నుంచే ప్రా రంభించారు. మందరాడ, వాసుదేవపట్నం, సంతకవిటి, మామిడిపల్లి, బొద్దూరు, గుళ్లసీతారాంపురం పంచాయతీలు ఆన్లైన్లో చేరాయి. ఈ కార్యాలయాల్లో ఇప్పటికే కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. గ్రామ సచివాలయాలకు పక్కా భవనాలు ఉన్నచోటనే కంప్యూటర్లు ఏర్పా టు చేశారు. పక్కా భవనాలు లేని ప్రాం తాల్లో అద్దె భవనాల్లో వీటిని ప్రారంభిం చేందుకు చర్యలు చేపడుతున్నామని సంతకవిటి ఎంపీడీవో ఎ.త్రినాథస్వామి తెలి పారు. నెట్లో సమాచార సమస్తం ఈ సేవలు ప్రారంభించిన పంచాయతీల కు సంబంధించిన సమస్త సమాచారం, వాటి పరిధిలో లభించే సేవల వివరాలన్నీ ంటర్నెట్లో సంబంధిత పంచాయతీ వెబ్సైట్లో లభ్యమవుతాయి. పంచాయతీలోని వార్డులు, ఓటర్లు, జానాభా వివరాలు, స్త్రీలు, పురుషులు, పిల్లల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలు, జనన, మరణ వివరాలు, ధ్రువీకరణ పత్రా ల జారీ పరిస్థితి తదితర అంశాలన్నీ ఆన్లైన్లోనమోదవుతుంటాయి. అలాగే పంచాయతీల ఆస్తులు, పన్నుల వివరాలు, విని యోగ ఫలితాలు, ఆదాయ వ్యయాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తుంటారు. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు నిధుల మంజూరు, వినియోగ వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. -
నమోదు..నిదానం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సేకరించిన వివరాలను కంప్యూటర్లో నమోదు చేసే ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. సర్వే సందర్భంగా వరంగల్ నగరంలో వివరాల సేకరణలో విఫలమైన అధికార యంత్రాంగం... వీటి నమోదు విషయంలోనూ అదే దారిలో నడుస్తోంది. జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరితో సర్వే వివరాల నమోదు గడువులోపు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సర్వే వివరాల నమోదుకు అవసరమైన వసతులను కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. వివరాల నమోదు కోసం నియమించాల్సిన కంప్యూటర్ ఆపరేటర్లకు ఇచ్చే మొత్తం జిల్లాలో మరీ తక్కువగా ఉండడంతో ఈ పనుల కు ఎక్కువ మందిముందుకు రాలే దు. అవసరమైన కంప్యూటర్లు సమకూర్చే విషయంలో ఇదే జరిగింది. దీంతో సర్వేవివరాల నమోదు ఎప్పటివరకు పూర్తవుతుందో ఉన్నతాధికారులే చెప్పలేని పరిస్థితి ఉంది. సర్వే సైతం అసంపూర్తిగానే... రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. జిల్లాలో 11.40 లక్షల కుటుంబాల వివరాలను సేకరించారు. వరంగల్ నగర పరిధిలో సుమారు 2.55 లక్ష ల కుటుంబాల వివరాలను తీసుకున్నారు. 19న పలు కారణాలతో వివిధ ప్రాంతాల్లో సర్వే నిర్వహించలేకపోవడంతో మరొకరోజు ఈ ప్రక్రియ నిర్వహించారు. అరుునా అధికారులు పూర్తిస్థాయిలో సేకరిం చలేదు. ఇలా సమగ్ర సర్వే జిల్లాలో అసంపూర్తిగానే ముగిసింది. గడువు పెంచినా... సంక్షేమ, అభివృద్ధి పథకాల అమ లు, కొత్త ప్రాజెక్ట్‌లు, ప్రణాళికల రూ పకల్పనకు సమగ్ర సర్వే వివరాలే ప్రమాణికంగా ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. వీలైనంత త్వర గా సర్వే వివరాలను నమోదు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆగస్టు 22 నుంచి సర్వే వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయడం మొదలైంది. సర్కారు నిర్దేశించిన ప్రకారం సెప్టెం బర్ 3లోపు ఈ ప్రక్రియ పూర్తి కావా ల్సి ఉంది. గడువు దాటినా పూర్తికాలేదు. ఇప్పటివరకు 8.30 లక్షల కుటుంబాల వివరాలనే కంప్యూటర్ లో నమోదు చేశారు. ఫలితంగా సర్వే వివరాల నమోదులో రాష్ట్రంలో నే జిల్లా చివరి స్థానంలో నిలిచింది. దీంతో వివరాల నమోదు గడువును ప్రభుత్వం ఈనెల 7 వరకు పొడిగిం చింది. అరుునా మన జిల్లాలో అప్పటివరకు ఈప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. నగరంలోనే అతి తక్కువగా... జిల్లావ్యాప్తంగా 19 కేంద్రాల్లోని 2వేల కంప్యూటర్లలో రెండు విడతల సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవేకాకుండా కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్స్‌హాలు, ఎన్ఐసీ, ప్రగతిభవన్, అటవీశాఖ ఉత్తర డివి జన్ కార్యాలయంలో మరో 100 కంప్యూటర్లలో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలల్లో నగరానికి సంబంధించి 2.50 లక్షల కుటుంబాల వివరాల నమోదు ప్రక్రియ జరగుతోంది. ఇప్పటికి కేవలం 62వేల కుటుంబాల వివరాలే నమోదయ్యాయి. జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ ఎక్కువగా ఉండే నగరంలోనే ఈ పరిస్థితి ఉండడం విమర్శలకు తావిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఏటూరునాగారం, తాడ్వాయి, గీసుకొండ, మంగపేట, హసన్‌పర్తి, మొగుళ్లపల్లి, వెంకటాపూర్, వర్ధన్నపేట, భూపాపలపల్లి, రాయపర్తి మండలాల్లో నమోదు ప్రక్రియ ముగిసింది. గడువు లోపు పూర్తిచేస్తాం... సర్వే వివరాలను కంప్యూటర్లో నమోదు చేసే ఆపరేటర్లకు ఉదయం పూట అయితే ఒక కుటుంబానికి రూ.5.. రాత్రి సమయాల్లో రూ.7 చెల్లిస్తున్నట్లు అధికారులు తెలి పారు. మన జిల్లాలోనే ఇంత తక్కువ చెల్లిస్తున్నారు. దీంతో వివరాలు నమోదు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఫలితంగా నమోదు ఎంతకీ పూర్తి కావడంలేదు. సర్వే వివరాల నమోదును పర్యవేక్షిస్తున్న జిల్లా సమాచార అధికారి(డీఐ) విజయ్‌కుమార్ మాత్రం ఈనెల 7నాటికి ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. -
కంప్యూటర్ ఆపరేటర్లపై సైబర్ కేసులు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటర్ల జాబితాల్లో చోటు చేసుకున్న అక్రమాల గుట్టును జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు నిర్ధారించింది. ముఖ్యంగా ఒంగోలు, చీరాల, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అడ్డగోలుగా అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించిన విషయాన్ని ధ్రువీకరించింది. అదే సమయంలో అక్రమంగా చేర్చిన ఓటర్ల లెక్కను తేల్చింది. చీరాల నియోజకవర్గంలో 3976 మంది వాస్తవ ఓటర్లను, పర్చూరు నియోజకవర్గంలో 1610 మందిని, ఒంగోలు నియోజకవర్గంలో 37 మంది వాస్తవ ఓటర్లను జాబితాలో నుంచి తొలగించినట్లు నిర్ధారించింది. అదేవిధంగా పర్చూరు నియోజకవర్గంలో 340 ఓట్లు, ఒంగోలు నియోజకవర్గంలో 257 ఓట్లు అక్రమంగా చేర్చినట్లు గుర్తించింది. సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్లపై సైబర్ నేరాల కింద కేసులు నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని ఓటర్ల జాబితాలో కొంతమంది అక్రమాలకు పాల్పడ్డారు. ఆ పార్టీని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా తమ పని కానిచ్చారు. వాస్తవానికి ఓటర్ల నమోదు ప్రక్రియ అత్యంత పకడ్బందీగా జరగాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితా బయటకు వచ్చేవరకు అందులోని వివరాలు బయటకు పొక్కకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అయితే తాజాగా జరుగుతున్న ఓటర్ల నమోదులో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లను ప్రలోభపెట్టి తమదారిలోకి తెచ్చుకున్నారు. పర్యవసానమే కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా అక్రమాల చిట్టాగా మారింది. ఈ నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, పర్చూరు నియోజకవర్గ పార్టీ నాయకుడు గొట్టిపాటి భరత్, చీరాల నియోజకవర్గ నాయకులు పలుమార్లు కలెక్టర్ విజయకుమార్‌ను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ చేపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఇంకొల్లు మండలంలో 624 ఓట్లు అక్రమంగా తొలగించారు. మార్టూరు మండలంలో 495 ఓట్లు అక్రమంగా తొలగించగా, 20 అక్రమంగా ఓట్లు చేర్చారు. చినగంజాంలో 231 ఓట్లు తొలగించగా, 163 ఓట్లు చేర్చారు. పర్చూరు మండలంలో 180 ఓట్లు తొలగించ గా, 87 ఓట్లు చేర్చారు. కారంచేడు మండలంలో 50 ఓట్లు తొలగించి, 40 ఓట్లు చేర్చారు. యద్దనపూడి మండలంలో 30 ఓట్లు తొలగించ గా, 30 ఓట్లు చేర్చారు. చీరాల నియోజకవర్గ పరిధిలోని చీరాల మండలంలో 3299 ఓట్లు, వేటపాలెం మండలంలో 337 ఓట్లు అక్రమంగా తొలగించారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు లో 37 ఓట్లు అక్రమంగా తొలగిం చారు. ఈ మేరకు జిల్లా యంత్రాం గం వీటిని నిర్ధారించడం గమనార్హం. పోలీసు విచారణకు ఆదేశం... ఓటర్ల నమోదులో చోటు చేసుకున్న అక్రమాలపై జిల్లా యంత్రాంగం పోలీసు విచారణకు ఆదేశించింది. పర్చూరు, చీరాల, ఒంగోలు నియోజకవర్గాల్లోని అక్రమాలపై విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకుమార్ ఎస్పీకి సూచించా రు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అధికారులంతా ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటు హక్కు కల్పిస్తాం ఓటు హక్కు కోల్పోయిన వారికి ఓటరుగా చేరేందుకు అవకాశం కల్పిస్తామని కలెక్టర్ విజయకుమార్ స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సెక్షన్ 22 ప్రకారం సుమోటో కింద రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుమతితో నమోదు ప్రక్రియ చేపట్టవచ్చన్నారు. సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు ఫారం-6 తీసుకొని ఓటర్లుగా చేర్చాలని కలెక్టర్ ఆదేశించారు. -
14 నెలలుగా జీతాల్లేవ్..
మార్కాపురం, పెద్దారవీడు, న్యూస్‌లైన్: తహశీల్దార్ కార్యాలయాల్లో కీలక విధులు నిర్వర్తించే కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఒక నెలో.. రెండు నెలలో కాదు. ఏకంగా 14 నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో కుటుంబ పోషణ జరగక అప్పుల పాలవుతున్నారు. మార్కాపురం, కందుకూరు, ఒంగోలు రెవెన్యూ డివిజన్లలో 50 మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో ఈ దుస్థితి నెలకొంది. ప్రభుత్వం వీరిని అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా నియమించింది. మండల పరిధిలోని నివాస, ఆదాయ, జనన, మరణ తదితర సర్టిఫికెట్లను కంప్యూటరీకరించి జారీ చేయాల్సిన పని వీరిదే. ఒక్కో కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ 11,013 వేతనం నిర్ణయించారు. అయితే వివిధ పథకాల కింద వేతనంలో కొంత భాగం పోను రూ 8,400 చెల్లించాలి. వీరంతా తహశీల్దార్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ అవుట్ సోర్సింగ్ విభాగం కావడంతోనే చిన్నచూపునకు గురవుతున్నారు. సుదీర్ఘ కాలంగా జీతాలు రాకపోయినప్పటికీ విధుల పట్ల ఏమాత్రం అశ్రద్ధ చూపకుండా కార్యాలయానికి ప్రతి రోజూ హాజరవుతున్నారు. అప్పులు తెచ్చుకొని పొట్ట నింపుకుంటున్నారు. ఇలా మొత్తం 50 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు రూ 58.80 లక్షల బకాయిలు విడుదల కావాల్సి ఉంది. నిధులు విడుదల చేయాలి: శ్రీనివాస్: అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు తహశీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు చాలా కాలంగా వేతనాలు విడుదల కాలేదు. ఒక నెలకు మాత్రమే జీతాలు విడుదల చేయడంతో జిల్లా రెవెన్యూ అధికారికి సమాచారం ఇచ్చాం. కొంత మంది ఆపరేటర్లు డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. కొన్ని చోట్ల తహశీల్దార్లు బదిలీ కావడంతో సర్టిఫికెట్లు అందడంలేదు. నిధులు విడుదల అయితే అందరికీ బకాయిలతో కూడిన వేతనాలు అందిస్తాం.