‘సర్వే’పై ఎవరికీ ఫిర్యాదు చేయలేదు | 'Survey' did not complain to anyone - sujana chowdary | Sakshi
Sakshi News home page

‘సర్వే’పై ఎవరికీ ఫిర్యాదు చేయలేదు

Published Fri, Aug 15 2014 12:32 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

‘సర్వే’పై ఎవరికీ ఫిర్యాదు చేయలేదు - Sakshi

‘సర్వే’పై ఎవరికీ ఫిర్యాదు చేయలేదు

టీడీపీ పార్లమెంటరీ నేత సుజనాచౌదరి

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్ర హోంశాఖ మంత్రికి తమ పార్టీ ఎంపీలు ఫిర్యాదు చేసినట్టు వచ్చిన వార్తలను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనాచౌదరి ఖండించారు. గురువారం ఆయన ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎవరికీ ఏ ఫిర్యాదు ఇవ్వలేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సర్వే ఎందుకో తెలియజేయాలని కోరామని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉంది, అనుభవజ్ఞుడైన సీఎం ఉన్నారు. ఆయన ఏది కావాలనుకున్నా చేయొచ్చు. ఏది చేయాలో చేయకూడదో ఆయన నిర్ణయిస్తారు.

సర్వేపై తెలంగాణ ప్రజల నుంచే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే తప్పో ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు’’ అన్నారు. ఉద్యోగుల విభజనపై మాట్లాడుతూ.. వారి విభజన ఆలస్యం కారణంగా రెండు రాష్ట్రాల్లో పరిపాలనా పరంగా ఎన్నో ఇబ్బం దులు తలెత్తుతున్నాయని, విభజన ఎప్పటికి పూర్తి చేస్తారో కేంద్రం స్పష్టత ఇవ్వాలనే విషయం గురువారం పార్లమెంట్‌లో ప్రస్తావించానన్నారు. ఉద్యోగుల విభజన పారదర్శకంగా చేస్తామని డీఓపీటీ మంత్రి జితేందర్‌సింగ్ సమాధానమిచ్చారని, నిర్దిష్టమైన సమయం తెలియజేయాలని తాను కోరినట్టు చెప్పారు.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement