అంతుచిక్కని గ్రేటర్ జనాభా | The greater the population of the elusive | Sakshi
Sakshi News home page

అంతుచిక్కని గ్రేటర్ జనాభా

Published Sat, Sep 20 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

అంతుచిక్కని గ్రేటర్ జనాభా

అంతుచిక్కని గ్రేటర్ జనాభా

1.20 కోట్లని సీఎం కేసీఆర్ ప్రకటన
85 లక్షలకు మించదంటున్న సవుగ్ర సర్వే
కుటుంబాల లెక్కలోనూ అయోవుయుం
జీహెచ్‌ఎంసీ సర్వేలోనూ కానరాని స్పష్టత

 
హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి పూర్తి చేసినప్పటికీ గ్రేటర్ నగర జనాభాపై స్పష్టత  రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ జనాభా దాదాపు 1.20 కోట్లు ఉంటుం దనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. సర్వే వివరాలను అంచనా వేస్తే  గ్రేటర్ జనాభా 85 లక్షలకు కూడా చేరడంలేదు.  ఈ నేపథ్యంలో అసలు గ్రేటర్ జనాభా ఎంత? అనేది ఆసక్తికరంగా మా రింది. సర్వే కంప్యూటరీకరణ పూర్తయిందని అధికారులు చెబుతున్నప్పటికీ, నిజంగా పూర్తయిం దా.. లేక ఇంకా జరుగుతోందా ? అనే అనుమానాలు సైతం వెలువడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ చేపట్టబోయే పలు కార్యక్రమాలకు, ఆస్తిపన్ను వసూళ్లకు, ఇతరత్రా కార్యక్రమాలకు సైతం వీటి నే ప్రామాణికంగా తీసుకోనున్నారు. సర్వే వివరాలు పజిల్‌గానే మిగలడంతో అధికారులు ఈ చిక్కుముళ్లను విప్పాల్సి ఉంది. సమగ్ర సర్వేకు ముందు జీహెచ్‌ఎంసీలో నిర్వహించిన ప్రీవిజిట్ సర్వేకు, ఆగస్టు 19న నిర్వహించిన సర్వేకు, సర్వే పూర్తయ్యాక జరిగిన కంప్యూటరీకరణ వివరాలకు వ్యత్యాసాలున్నాయి. ప్రీ విజిట్ సర్వేకు ముందు 17 లక్షల కుటుంబాలు ఉండవచ్చని అంచనా వేశారు. అరుుతే ప్రీవిజిట్ సర్వేలో 19 లక్షల కుటుంబాలు ఉన్నాయనే అంచనాకు వ చ్చారు. ఆగస్టు 19 తరువాత 20,11,293 కుటుం బాల సర్వే పూర్తయిందని, 1,49,308 కుటుంబా ల సర్వే జరగలేదని చెప్పారు. ఈ లెక్కన గ్రేటర్ లో  21,60,601 కుటుంబాలు ఉంటాయని భా వించారు. కంప్యూటరీకరణ పూర్తయిందని తెలి పే సమయానికి 20,40,000 కుటుంబాలున్నట్లు గుర్తించారు.
http://img.sakshi.net/images/cms/2014-09/41411163221_Unknown.jpg

http://img.sakshi.net/images/cms/2014-09/81411163279_Unknown.jpg

http://img.sakshi.net/images/cms/2014-09/61411163335_Unknown.jpg
ఈ లెక్కన గ్రేటర్ జనాభా దాదాపు 80 లక్షలకుపైగా ఉండవచ్చని ఒక అంచనా. గ్రేటర్‌లో ఒక్కో ఇంటికి సగటున 3.5 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. దీని ప్రకా రం జనాభా ఇంకా తగ్గుతుంది.  కానీ గ్రేటర్‌లోని విద్యుత్ కనెక్షన్లున్న కుటుంబాలు, ఆధార్ కార్డు లు కలిగిన వారు, రేషన్‌కార్డులున్న కుటుంబాలను పరిగణనలోకి తీసుకుంటే  జనాభా ఇంతకంటే ఎక్కువగా ఉంది.  ఈ వ్యత్యాసం సర్వేలో నమోదు కాని కుటుంబాలవా.. ఇందుకు  మరేదైనా కారణం ఉందా? అన్నది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. ఒక వేళ సర్వేలో నమోదు కానివైతే వారంతా స్వగ్రామాలకు వె ళ్లినందున నమోదు కాలేదా.. లేక వారి ఇళ్లలో సర్వే జరగలేదా? అన్నది సైతం స్పష్టం కావాలి. సర్వే జరగని కుటుంబాలు అధికసంఖ్యలో ఉన్నట్లయితే వారందరి వివరాల కోసం తిరిగి సర్వే జరిగితే కానీ పూర్తి స్పష్టత రాదు. ఈ అంశాలపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

అంతా గందరగోళం..

2011 సెన్సస్ మేరకు.. 2001-2011 నాటికి గ్రేటర్‌లోని హైదరాబాద్ జిల్లా జనాభా పెరుగుదల 2.97 శాతంగా నమోదైంది. జిల్లా పరిధిలో ఓయూ, కంటోన్మెంట్ ప్రాంతాలను కలిపి లెక్కిస్తే అది  4.7 శాతంగా ఉంది. 1991-2001 మధ్య పెరుగుదల రేటు 21.74 శాతంగా ఉండగా, మలి దశాబ్దానికి దారుణంగా తగ్గిపోవడం అప్పట్లోనే ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తింది. 2011 జనగణనలో హైదరాబాద్ జిల్లా జనాభా కేవలం 39.43 లక్షలుగా నమోదైంది. 2011 జనా భా లెక్కల ప్రకారం గ్రేట ర్‌లో 15.24 లక్షల కు టుంబాలుండగా, తాజా గా కంప్యూటరీకరణ పూర్తయిన కుటుంబాలు దాదాపు 20.40 లక్షలున్నట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement