డిచ్‌పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని కుటుంబాలకు చెందిన పూర్తి చరిత్రను అధికారులు నమోదు చేయనున్నారు. ఇలాంటి సర్వే ఇంతవరకు దేశంలోని ఏ రాష్ట్రంలో జరిగిన దాఖలాలు లేవని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రం మొత్తంలో ఒకే రో జు ఈనెల 19న సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అధికారులు సర్వేకు సంబంధించి సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఇతర జిల్లా స్థాయి అధికారులు మంగళవారం జిల్లాలోని అన్ని మండలాల్లో న మూనా కుటుంబ సర్వే నిర్వహించారు. క్షేత్ర స్థాయి లో సరే ్వ నిర్వహించినప్పుడు ఎలాంటి సమస్యలు వ స్తాయి, వాటిని ఎలా అధిగమించాలనే విషయమై న మూనా సర్వే చేశారు.
సర్వే జరిగే రోజు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండి సర్వే సిబ్బందికి సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే పలుమార్లు కోరారు. ఆ రోజు ప్ర భుత్వం సెలవు దినం గా ప్రకటించింది. ఇంట్లో లేని వారి పేర్లు నమోదు చేయబోరని, చివరకు శుభకార్యాలను సైతం వాయిదా వేసుకోవాలని సీఎం సూచించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ రోజు ఇంటికి తాళం వేసి ఉండకుండా చూసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
విభాగం ఏ : గుర్తింపు వివరములు
1. జిల్లా పేరు:
2. మండలం పేరు:
3.గ్రామ పంచాయతీ పేరు/ మున్సిపాలిటీ పేరు:
4. రెవెన్యూ గ్రామం పేరు:
5.ఆవాసం పేరు/డివిజన్ పేరు/వార్డు పేరు:
6. నివశిస్తున్న ప్రదేశం/వాడ/కాలనీపేరు:
7. ఇంటి నెంబరు:
8. ఈ ఇంట్లో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య:
విభాగం బి: కుటుంబ వివరములు:
1. కుటుంబ యజమాని పేరు: ఇంటి పేరు.. పూర్తి పేరు
2. తండ్రి/భర్త పేరు:
3. కుటుంబ సభ్యుల సంఖ్య:
4.మతం: హిందూ.. ముస్లిం.. క్రైస్తవ .. సిక్కు.. జైన.. బౌద్ధ.. ఇతరులు
5. సామాజిక వర్గం/కులం పేరు: ఎస్‌సీ.. ఎస్టీ.. బీసీ.. ఓసీ..
6. గ్యాస్(ఎల్‌పీజీ )కనెక్షన్ ఉందా?: ఉంది.. లేదు..
7. వినియోగదారుని సంఖ్య:
8. మొబైల్ ఫోన్ నెం.(ఆప్షనల్)
9. ఆదాయం పన్ను చెల్లించే కుటుంబమా?: అవును.. కాదు అనాథల వివరాలు (ఉన్నట్లయితే)
10. అనాథలు ఎక్కడ నివశిస్తున్నారు (సొంత ఇంట్లో.. బంధువుల ఇంట్లో.. బహిరంగ ప్రదేశాల్లో.. పాడుబడ్డ ఇంట్లో.. అనాథాశ్రమంలో)
11. అనాథాశ్రమంలో ఉంటే ఆశ్రమం పేరు:
12. ఆశ్రమం ఉన్న గ్రామం:
13. ఆశ్రమం ఉన్న మండలం:
14. అనాథ స్థితి (తల్లిదండ్రులు చనిపోయారు.. తల్లి/తండ్రి వదిలేశారు.. కొడుకులు/కూతుళ్లు వదిలేశారు)
విభాగం సి:
1.క్రమ సంఖ్య
2. వ్యక్తిపేరు(కుటుంబ యజమానితో మొదలుకొని):
3. కుటుంబ యజమానికి సంబంధం:
4. లింగం(ఆడ.. మగ.. ఇతరులు):
5. పుట్టిన తేదీ.. తెలియనట్లయితే వయసు:
6. వైవాహిక స్థితి
7. పూర్తయిన విద్యార్హత
8. బ్యాంకు/పోస్టాఫీసు అకౌంటు ఉన్నదా ?.. లేదా?
9. పోస్టాఫీసు అకౌంట్ ఉన్నట్లయితే
పోస్ట్ ఆఫీస్ శాఖ పేరు:
10. ’’ ’’ అకౌంట్ నెంబరు:
11.బ్యాంకు అకౌంట్ ఉన్నట్లయితే బ్యాంకు పేరు:
12. ’’ ’’ బ్యాంకు బ్రాంచి పేరు:
13. ‘‘ ’’ బ్యాంకు అకౌంట్ నెంబరు:
14. ఉద్యోగం: ఉన్నది.. లేదు
15. ఉద్యోగం ఉన్నట్లయితే ఉద్యోగం రకం:
16. ప్రభుత్వ పెన్షన్‌దారు అయితే
(1.కేంద్ర ప్రభుత్వ పెన్షన్ 2. రాష్ట్రప్రభుత్వ పెన్షన్
3. ప్రభుత్వరంగ సంస్థల పెన్షన్
17. ప్రధానమైన వృత్తి:
18. సామాజిక పింఛన్‌దారులైతే పింఛన్ రకం
19. ఎస్‌హెచ్‌జీ సంఘ సభ్యత్వం:1 ఉన్నది 2. లేదు
20. ఆధార్ కార్డు(యుఐడి) నెంబర్:
విభాగం డి: వికలాంగుల వివరాలు
1.క్రమ సంఖ్య
2. వికలాంగుల పేరు:
3. ఎలాంటి వైకల్యం:
4. సదరం సర్టిఫికెట్ ఉందా: 1 ఉన్నది 2.లేదు
5. సదరం సర్టిఫికెట్ ఉన్నట్లయితే ఐడీ నెంబరు
6. వైకల్యశాతం సర్టిఫికెట్
విభాగం ఇ: దీర్ఘకాలిక వ్యాధులు
1. క్రమ సంఖ్య
2. దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్న వ్యక్తి పేరు:
3. వ్యాధి రకం
విభాగం ఎఫ్: ఇంటి వివరములు
1. నివాస స్థితి: సొంతం.. కిరాయి.. తాత్కాలిక గూడు(ప్లాస్టిక్ కప్పు మొదలైనవి)
2. ఇంటి కప్పు రకం(1.గుడిసె 2. పెంకులు /రేకులు/బండలు 3. కాంక్రీట్ శ్లాబ్
3. గదుల సంఖ్య (వంట గది కాకుండా)
4. కిరాయి.. తాత్కాలిక గూడుల్లో ఉంటున్న వారికి సంబంధించి ఇంకా ఎక్కడైనా ఇల్లు ఉందా?
5. కిరాయి.. తాత్కాలిక గూడుల్లో ఉంటున్న వారికి సంబంధించి ఇంటి స్థలం ఉందా (1.అవును 2.కాదు)
6. మీరు ఎప్పుడైనా ప్రభుత్వ బలహీనవర్గాల గృహ నిర్మాణ కార్యక్రమంలో లబ్ధి పొందారా?(1.అవును 2.కాదు)
7. 8.9.10.11.12 క్రమసంఖ్యల్లో మరుగుదొడ్డి, విద్యుత్, మీటర్ ఉందా? తదితర వివరాలు భర్తీ చేయాలి.
విభాగం జి .. హెచ్‌లలో
వ్యవసాయం.. పశు సంపదలకు
సంబంధించిన వివరాలు ఉన్నాయి.
విభాగం ఐ : కుటుంబ సొంత చరాస్తుల వివరములు:
చరాస్తి రకం: 1. మోటార్ సైకిల్/స్కూటర్
2. మూడుచక్రాల మోటార్ వాహనం/ఆటో
3. కారు/జీపు/జేసీబీ/నాలుగు చక్రాల మోటార్ వాహనం, ఇతర భారీ వాహనాలు
4. ట్రాక్టర్/ దున్నే యంత్రం/కోత కోసే యంత్రం/ ఇతర వ్యవసాయ యంత్రాలు
5. ఎయిర్ కండిషనర్ (పైవి ఉన్నది.. లేదు వివరాలు రాయాలి. ఉన్నట్లయితే వాహన రిజిస్ట్రేషన్ నెంబర్. ఒకే రకమైన వాహనాలు రెండు ఉన్నట్లయితే ఒకదాని రిజిస్ట్రేషన్ నెంబరు రాస్తే చాలు.
తాత్కాలిక సంచార కుటుంబాలు/జాతుల వారికి సంబంధించిన వివరాలు: శాశ్వత నివాసం..
ఎంతకాలంగా ఉంటున్నారు తదితర వివరాలు: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వారి వివరాలు: ఏ రాష్ట్రం నుంచి వచ్చారు.. మాట్లాడే భాష.. వచ్చిన సంవత్సరం
క్రమ సంఖ్యలో భర్తీ చేయాల్సిన వాటికి సంబంధించిన కోడ్ నెంబర్లు విడిగా ఇచ్చారు. వాటిని చూసి భర్తీ చేస్తారు.
ధ్రువీకరణ..
పైన తెలిపినసమాచారం వాస్తవమని..యదార్థమని నేను ధ్రువీకరిస్తున్నాను. పై సమాచారం తప్పుగా తేలినచో ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధిని రద్దుపరచి ప్రభుత్వ పథకాలకు అనర్హుడు/అనర్హురాలిగా ప్రకటించగలరు. ఇట్టి విషయం దైవ సాక్షిగా/ఆత్మసాక్షిగా ధ్రువీకరిస్తున్నాను.
కుటుంబ యజమాని/సభ్యుల యొక్క సంతకం లేదా ఎడమచేతి బొటనవేలి ముద్ర.
ఎన్యూమరేటర్ సంతకం.. వివరాలు
పర్యవే క్షక అధికారి సంతకం.. వివరాలు
అవసరమైన సందర్భాల్లో కుటుంబ యజమాని/ సభ్యుల సంతకం తీసుకునేముందు ధ్రవీకరణ చదివి వినిపించాలి
19న ఇంటింటా వివరాల నమోదు
Published Sat, Aug 9 2014 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement
Advertisement