
'సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు'
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. నవంబర్ నెల నుంచి లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.
రేషన్ కార్డులు, పౌరసరఫరా, ఫించన్లపై సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వాలా, 30 కేజీలకు పెంచాలా అనే దానిపై కూడా చర్చించినట్టు తెలిపారు. దీనిపై ఈ నెలాఖరుకల్లా సీఎంకు నివేదిక అందజేస్తామని ఈటెల చెప్పారు.