మినహాయింపు ఇవ్వాల్సిందే | i will talk with kcr for telangana migrant people: kishan reddy | Sakshi
Sakshi News home page

మినహాయింపు ఇవ్వాల్సిందే

Published Fri, Aug 8 2014 10:30 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

i will talk with kcr for telangana migrant people: kishan reddy

సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్రేత రులకు సమగ్ర కుటుంబ సర్వే నుంచి మినహాయింపును ఇచ్చేందుకు కేసీఆర్‌తో మాట్లాడతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉపాధి కోసం ముంబై, శివారు ప్రాంతాలకు వచ్చిన వలస కూలీలు, ఉపాధి కార్మికులు 19న తప్పకుండా సొంత ఊరిలో ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడి తెలంగాణ ప్రజలు కొంత అయోమయానికి గురవుతున్నారు.

ఆ రోజు రావడం కుదరకపోతే, పనిచేస్తున్న చోట సెలవు దొరకకపోతే ఎలా? అని ఆందోళన చెందుతున్నారు. వలస బిడ్డల కష్టాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని, వారికి మినహాయింపునివ్వాలని కోరుతున్నారు. దీనిపై కిషన్ రెడ్డిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించింది. స్పందించిన ఆయన మహారాష్ట్రతోపాటు తెలంగాణ రాష్ట్రేతర ప్రజలకు మినహాయింపునిచ్చేలా కేసీఆర్‌తో, సంబంధిత అధికారులతో మాట్లాడతామన్నారు.

ప్రవాస తెలంగాణ ప్రజల కోసం నిబంధనలను సడలించాలని కోరతామని తెలిపారు. ఉన్నఫలంగా స్వగ్రామాలకు తరలి రావాలంటే కష్టమవుతుందని, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, మినహాయింపు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. ఇదిలాఉండగా తెలంగాణలోని స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇక్కడి ప్రజలు టికెట్లను బుక్ చే సుకుంటున్నారు. అయితే రైళ్లతోపాటు బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్‌లో టికెట్లన్నీ బుక్ అయిపోయానని, టికెట్లు దొరకడం కష్టంగా మారిందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement