
‘రైల్వే బడ్జెట్‌లో నిజామాబాద్‌కు అన్యాయం’
నిజామాబాద్: రైల్యే బడ్టెట్‌లో జిల్లాకు అన్యాయం జరిగిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం ఆమె నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైను కేవలం ఇంకా 28 కి.మీటర్లు మాత్రమే ఉందని, ఇది సాధించుకోవడంలో విఫలమయ్యామన్నారు. ఈ పనులు పూర్తి కావాలంటే మరో రూ. 250 కోట్లు అవసరమన్నారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల విషయంలో కేంద్రం ఇంకా ఆలోచిస్తోందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొందరు అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ఐఏఎస్ అధికారుల పరిస్థితి త్వరలో తేలిపోతుందన్నారు.