సాక్షి, మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆదివారం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆరే మంచోడని అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం రానుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
కోరుట్లలో అర్వింద్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించి దూసుకుపోతున్నారు. ఇంట్రస్టింగ్ కామెంట్లతో పాటు తిట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే అర్వింద్ రేవంత్ కంటే కేసీఆర్ మంచోడని అనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ పోరు ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగగ్రెస్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకునే రేవంత్ కంటే కేసీఆర్ బెటరని అర్వింద్ అన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment