
సాక్క్షి, మెట్‌పల్లి: కేసీఆర్ సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. అక్కడ ‘మన సీఎం ఎవరని అడిగితే.. ఇప్పటి నుంచి ఎడమ కాలి చెప్పు’ అని చెప్పాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్‌కు ఇద్దరు పెళ్లాలని.. ఒకరు టీఆర్‌ఎస్ అయితే, మరొకరు కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు.