సాక్షి,తెలంగాణ భవన్ : స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఇంకెంత కాలం? అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (kkavitha) ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి (cm revanthreddy) లేఖ రాశారు.
ఆ లేఖలో ‘మీ వైఖరితో బీసీలకు తీరని అన్యాయం జరగుతోంది. రిజర్వేషన్ల పెంపును విస్మరిస్తే ఊరుకోబోం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందేనని’ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగంగా రాసిన లేఖలో పేర్కొన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రధాన హామీ అయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడం. “కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీలకు రిజర్వేషన్ల పెంపు” అని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో స్పష్టంగా పేర్కొని ఉంది. 6 నెలలు గడిచాయి… ఏడాది గడిచింది.. అయినా కూడా రిజర్వేషన్ల పెంపునకు అతీగతీ లేదు. అశాస్త్రీయంగా బీసీ గణన నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన చేయడమే మీ ఆలోచనగా కనిపిస్తోంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment