
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని యూనివర్సిటీల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహిస్తున్న ’క్యాస్ట్‌స్ అండ్ ఇట్స్ డిస్‌కంటెంట్స్’అనే అంశంపై జరిగే సదస్సులో ఆమెను ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం వచ్చింది. ఈమేరకు కేరళ అసెంబ్లీ స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్ కవితకు లేఖ రాశారు. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం తిరువనంతపురంలోని కేరళ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ఈ సదస్సు జరగనుంది. కేరళ సీఎంతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సదస్సుకు హాజరవుతారని, దేశవ్యాప్తంగా 2 వేలమంది విద్యార్థులు సదస్సుకు హాజరవుతున్నారని శ్రీరామ కృష్ణన్ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment