Kerala Assembly
-
జమిలి ఎన్నికల ఆలోచనను విరమించుకోండి: కేరళ తీర్మానం
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించటంపై ఆలోచనను విరమించుకోవాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికం, దేశ సమాఖ్య నిర్మాణానికి హానికరమని తీర్మానంలో పేర్కొన్నారు.Kerala Legislative Assembly passed a resolution urging the central government to withdraw its proposed 'One Nation, One Election' reform, describing it as undemocratic and detrimental to the nation's federal structure.— ANI (@ANI) October 10, 2024కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ ఇటీవల మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా.ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం. -
గవర్నర్‌కు వర్సిటీల చాన్స్‌లర్ హోదా రద్దు
తిరువనంతపురం: రాష్ట్రంలోని వర్సిటీలకు చాన్సెలర్‌గా గవర్నర్‌ను తొలగించడంతోపాటు ఆ హోదాలో ప్రముఖ విద్యావేత్తను నియమించేందుకు ఉద్దేశించిన బిల్లును కేరళ అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. అయితే, తమ ప్రతిపాదనలను బిల్లులో చేర్చలేదంటూ కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ సభ నుంచి వాకౌట్ చేసింది. కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని గానీ, సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీలను గానీ చాన్సలర్‌గా నియమించాలని యూడీఎఫ్ సూచించింది. చాన్సెలర్ ఎంపిక కమిటీలో సీఎం, ప్రతిపక్ష నేత, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలంది. ఇదీ చదవండి: పేరెంట్స్ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్.. బిత్తరపోయిన ఉపాధ్యాయులు -
MLA Rema: శాసన సభను కౌరవ సభగా మార్చొద్దు!
తిరువనంతపురం: అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు.. మహిళా ఎమ్మెల్యేపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో కేరళ అసెంబ్లీ అట్టుడుకి పోతోంది. సభకు క్షమాపణలు చెప్పి.. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తూ కార్యకలాపాలకు అడ్డుతగులుతోంది ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్. అయినా ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వం మాత్రం తగ్గట్లేదు. కేరళ అసెంబ్లీని మహిళలను వేధించే కౌరవ సభగా మార్చొద్దంటూ వేడుకున్నారు ప్రతిపక్ష నేత ఎం సతీశన్. ప్రోగ్రెసివ్ స్టేట్‌గా చెప్పుకునే కేరళలో.. విధవత్వాన్ని ఆమె తలరాతగా నిర్ధారించే స్థితికి రావడం దురదృష్ణకరమని వ్యాఖ్యానించారాయన. గత వారం పోలీస్ శాఖ నిధుల విజ్ఞప్తుల విషయంలో అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా.. ఎమ్మెల్యే కేకే రేమాను రెచ్చగొట్టేలా సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మణి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఒక గొప్పావిడ సీఎం పినరయి విజయ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఆమె తన భర్తను పొగొట్టుకుని విధవ అయ్యింది. అది ఆమె తలరాత. మేమేం దానికి బాధ్యులం కాదు’’ అంటూ ఎమ్మెల్యే మణి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సభ ఒక్కసారిగా భగ్గుమంది. మణి వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం చేస్తూ సభ కార్యాకలాపాలను అడ్డుకున్నాయి ప్రతిపక్షాలు. ‘‘మణిని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని కోరాం. ఆపై సీఎం పినరయి విజయన్ను జోక్యం చేసుకోమని అడిగాం. ఈ రెండూ చేయలేదు. ఇది నియమసభ. దీన్నొక మహిళలను వేధించే దుర్యోధనులు, దుశ్వాసనులకు నెలవైన కౌరవ సభగా మార్చొద్దు’’ అంటూ ఎమ్మెల్యే సతీశన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మణి వ్యాఖ్యలను పరిశీలిస్తామని డిప్యూటీ స్పీకర్ చిట్టాయమ్ గోపకుమార్ హామీ ఇవ్వడంతో ప్రతిపక్షం కాస్త శాంతించింది. అయితే సోమవారం మహిళా కాంగ్రెస్ నిరసనల్లో భాగంగా.. మణి ముఖాన్ని చింపాజీ కటౌట్‌తో ప్రదర్శించి నిరసన వ్యక్తం చేసింది. కేరళ కాంగ్రెస్ ఈ చర్యను సమర్థించుకుంది. ఇక తన భర్తను చంపినా.. ఇంకా పగతో రగిలిపోతూనే ఉన్నారంటూ ఎమ్మెల్యే రేమా సైతం మణి కామెంట్లపై మండిపడ్డారు. కొన్నేళ్ల కిందట.. సీపీఐ(ఎం) రెబల్ టీపీ చంద్రశేఖరన్‌ను పార్టీ వెలివేసింది. ఆ తర్వాత రెవల్యూషనరీ మార్కిస్ట్ పార్టీని(RMPI) స్థాపించారు. ఆయన 2012 మే 4వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. ఆ కేసులో సీపీఎం యాక్టివిస్టులను అరెస్ట్ చేసి శిక్షించారు. అప్పటి నుంచి పార్టీ బాధ్యతలను చూసుకుంటూ.. సీపీఐ(ఎం)పై, సీఎం విజయన్‌పైనా వీలుచిక్కినప్పుడల్లా విరుకుపడుతున్నారు కేకే రేమా. ప్రస్తుతం ఆమె వడకారా నియోజకవర్గపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
చట్ట సభల్లో సభ్యులైతే తప్పు చేస్తారా?
న్యూఢిల్లీ: చట్టసభల సభ్యులకు ఉండే ప్రత్యేక హక్కులు, హోదాలు చట్టం నుంచి తప్పించుకునేందుకు ఉద్దేశించిన మార్గాలు కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి పౌరుడి చర్యలను చట్టం నియంత్రిస్తుందని పేర్కొంది. 2015లో కేరళ అసెంబ్లీలో జరిగిన గొడవకు సంబంధమున్న 6గురు ఎల్డీఎఫ్ నేతలపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలన్న కేరళ ప్రభుత్వ విజ్ఞాపనను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ప్రజా ఆస్తుల ధ్వంసరచనను చట్టసభలో వాక్స్వాతంత్రం, ప్రతిపక్ష సభ్యుల నిరసన హక్కులాంటివాటితో పోల్చలేమని, ఆరోజు బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన పేరుతో చట్టసభలో సభ్యులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడాన్ని చట్టసభ్యుల విధుల్లో భాగంగా చూడలేమని కఠిన వ్యాఖ్యల చేసింది. ఈ సభ్యుల ప్రవర్తన రాజ్యాంగం విధించిన హద్దులను దాటిందని, అందువల్ల వీరికి రాజ్యాంగం కల్పించే ప్రత్యేక హక్కుల కింద రక్షణ లభించదని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని తేల్చిచెప్పింది. 2015లో కేరళ శాసనసభలో గొడవకు కారణమైన ఆరుగురు సభ్యులపై కేసును ఉపసంహరిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు కొట్టివేయగా, దీనిపై ప్రభుత్వం సుప్రీంకు అప్పీలు చేసింది. ఏం జరిగింది? 2015 మార్చి 13న రాష్ట్ర అసెంబ్లీలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎల్డీఎఫ్ సభ్యులు అప్పటి ఆర్థిక మంత్రి మణి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా వారు స్పీకర్‌స్థానాన్ని అగౌరవపరచడమే కాకుండా, సభలోని ఎలక్ట్రానిక్ పరికరాలను డ్యామేజి చేశారు. దీనివల్ల దాదాపు రూ. 2.2 లక్షల నష్టం వాటిల్లింది. వీరిపై ఐపీసీ 447 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అనంతరం వచ్చిన ప్రభుత్వం వీరిపై కేసును ఉపసంహరించుకునే యత్నాలు ఆరంభించింది. కానీ ప్రభుత్వ యత్నానికి కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం ఈ అంశం సుప్రీంకోర్టు చెంతకు చేరింది. దీనిపై విచారణ జరుపుతూ, ఆందోళన పేరుతో ప్రజా ఆస్తుల ధ్వంసాన్ని సహించకూడదని కోర్టులు, పార్లమెంట్ భావిస్తున్నాయనితెలిపింది. చట్టసభ్యులకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికిల్ 105, 194 అనేవి కేవలం చట్టసభ్యులు వారి విధులు సక్రమంగా నిర్వహించడం కోసం ఉద్దేశించినవని స్పష్టం చేసింది. ఈ విధుల్లో ఆందోళన పేరిట పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం రాదని తెలిపింది. -
కేరళ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ ప్రభుత్వానికీ సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టేవేసింది. ఆరుగురు సీపీఎం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసు విచారణను ఉపసంహరించుకోవాలన్న కేరళ ప్రభుత్వ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసిన చట్టం కింద ఆరుగురు ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచేప్పింది. దేశంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2015లో కేరళ అసెంబ్లీలో సీపీఎంకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. -
గవర్నర్ గో బ్యాక్.. సభలో తీవ్ర గందరగోళం
తిరువనంతపురం: అత్యంత హైడ్రామా నడుమ కేరళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉయదం ప్రారంభమయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నిరసనకు దిగడం.. యాంటీ సీఏఏ పోస్టర్లు పట్టుకొని.. ‘గవర్నర్.. గో బ్యాక్’ నినాదాలు చేయడంతో సభ దద్దరిల్లిపోయింది. దీంతో మార్షల్స్ రంగప్రవేశం చేసి.. నిరసనకు దిగిన ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. మార్షల్స్ భద్రత మధ్య అసెంబ్లీలోకి ప్రవేశించిన గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్.. తనను ఉద్దేశించి నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలకు చేతులు జోడించి ‘కృతజ్ఞతలు’ తెలిపారు. ఆయనకు ఇరువైపుల సీఎం పినరయి విజయన్, స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్ ఉన్నారు. మార్షల్ భద్రత నడుమ గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన ప్రసంగం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ గేటు వద్దకు చేరుకొని వారు ధర్నాకు దిగారు. సీఎం చదవమన్నారని.. చదువుతున్నా! తన ప్రసంగంలో భాగంగా సీఏఏ వ్యతిరేక తీర్మానంలోని కొంతభాగాన్ని గవర్నర్ చదివి వినిపించారు. అయితే, ఇది తన అభిప్రాయం కాదని, కేవలం ప్రభుత్వ అభిప్రాయం మాత్రమేనని, ప్రభుత్వ అభిప్రాయంతో ఏకీభవించనప్పటికీ.. సీఎం కోరిక మేరకు, ఆయన దీనిని నేను చదవాలని కోరుతున్నందుకే చదివి వినిపించానని గవర్నర్ ఖాన్ వివరించారు. సీఏఏకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో సీఎం విజయన్‌కు, గవర్నర్ ఖాన్‌కు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. విజయన్ సర్కారు తీరును గవర్నర్ బాహాటంగానే తప్పుబడుతున్నారు. -
సీఏఏకు తొలి షాక్.. కేరళ అసెంబ్లీలో తీర్మానం
తిరువనంతపురం : కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఉపసంహరించాలని కోరుతూ కేరళ అసెంబ్లీలో చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కేరళలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. కేరళకు లౌకిక రాష్ట్రమన్న గుర్తింపు ఉందని తెలిపారు. గ్రీకులు, అరబ్బులు, రోమన్లు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా ప్రతి ఒక్కరు కేరళలో నివసిస్తున్నారని ఆయన చెప్పారు. కేరళకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయని వాటిని కాలరాసేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేదిలేదని సీఎం అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, మతాధిపతులు, సామాజిక నేతలతో జరిగిన ఒక సమావేశంలో వారంతా పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తున్నట్లు తనతో, ప్రతిపక్షనాయకుడితో చెప్పినట్లు విజయన్ ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి పలువురు ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. కాగా.. ఎన్ఆర్సీ, సీఏఏ ఒకే నాణానికి రెండు వైపులా బొమ్మా, బొరుసని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. Thiruvananthapuram: Chief Minister of Kerala Pinarayi Vijayan moves resolution against #CitizenshipAmendmentAct in state Assembly, demanding withdrawal of #CAA. pic.twitter.com/IkkfLCwAyG — ANI (@ANI) December 31, 2019 -
ఎంపీ కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జాతీయ స్థాయిలోని పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహిస్తున్న సదస్సులో ప్రసంగించాల్సిందిగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఈ మేరకు కేరళ అసెంబ్లీ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్ ఎంపీ కవితకు ఆహ్వాన లేఖ పంపారు. కేరళ అసెంబ్లీ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. తొలిరోజు మధ్యాహ్నం జరిగే సదస్సులో ‘‘క్యాస్ట్స్ అండ్ ఇట్స్ డిస్కంటెట్స్..’’ అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. కేరళ సీఎంతో పాటు దేశం లోని వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు కూడా సదస్సుకు హాజరవుతారు. మాజికంగా, రాజకీయంగా క్రియాశీలకంగా ఉండే సుమారు రెండు వేల మంది విద్యార్థులు సద స్సుకు హాజరుకానున్నారు. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను గత ఏడాది ఆగస్టులో రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్ ప్రారంభించిన విష యం తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా అనేక సెమినార్లు జరుగుతున్నాయి. మొదటి సెమినార్ గత ఏడాది ఆగస్టు 6,7,8 తేదీల్లో ‘‘ఎస్సీ,ఎస్టీల సాధికారత – సవా ళ్లు..’ అంశంపై సదస్సు జరిగింది. ఇప్పుడు రెండో సెమినార్ ఈనెల 23–25 వరకు జరగనుంది. యువతలో ప్రజాస్వామిక విలు వలు, జీవన విధానం, ప్రజాస్వామిక ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యం వంటి అంశాలపై ఈ సెమినార్లో చర్చిస్తారు. కేరళ అసెంబ్లీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు సం యుక్తంగా ఎంఐటీ–వరల్డ్ పీస్ యూనివర్శిటీ, పుణె సాంకేతిక సహకారంతో ప్రజాస్వామ్యంపై ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. -
ఎంపీ కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని యూనివర్సిటీల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహిస్తున్న ’క్యాస్ట్స్ అండ్ ఇట్స్ డిస్కంటెంట్స్’అనే అంశంపై జరిగే సదస్సులో ఆమెను ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం వచ్చింది. ఈమేరకు కేరళ అసెంబ్లీ స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్ కవితకు లేఖ రాశారు. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం తిరువనంతపురంలోని కేరళ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ఈ సదస్సు జరగనుంది. కేరళ సీఎంతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సదస్సుకు హాజరవుతారని, దేశవ్యాప్తంగా 2 వేలమంది విద్యార్థులు సదస్సుకు హాజరవుతున్నారని శ్రీరామ కృష్ణన్ లేఖలో పేర్కొన్నారు. -
కేరళ అసెంబ్లీ సంచలన తీర్మానం
- అసెంబ్లీలో బీఫ్‌తో చేసిన వంటకాలు తిన్న ఎమ్మెల్యేలు తిరువనంతపురం: రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తోందంటూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కేరళ అసెంబ్లీ మండిపడింది. పశు విక్రయాలపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ ఇటీవల కేంద్రం జారీ చేసిన ఆదేశాలను ఖాతరు చేయబోమని కేరళ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించగా, గురువారం మరో అడుగు ముందుకువేసింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో.. కేంద్రం తీరును నిరసిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అధికార ఎల్డీఎఫ్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి విపక్ష యూడీఎఫ్ కూడా మద్దతు పలకడం గమనార్హం. కేంద్రం తీరును నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై కేంద్రం పెత్తనం చేయాలనుకోవడం తగదని ఆయన అన్నారు. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని భగ్నం చేసే ఏ నిర్ణయాన్నయినా తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. బీఫ్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేసిన ఎమ్మెల్యేలు పశు విక్రయాలు, బీఫ్ సహా ఇతర మాంసం విక్రయాలపై అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నదంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు కేరళ ప్రజాప్రతినిధులు. గురువారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలు.. గొడ్డుమాంసం(బీఫ్)తో వండిన వంటకాలను అల్పాహారంగా స్వీకరించారు. పశు విక్రయాలపై కేంద్రం విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, ఈ మేరకు న్యాయనిపుణులతో చర్చించాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. -
పేరుకే మహిళలు.. పెత్తనమంతా మగాళ్లదే!
కోచి: అనేక ఏళ్లు కమ్యూనిస్టులే పాలించినప్పటికీ కేరళ రాష్ట్ర అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం బాగా తక్కువ. 1957లో రాష్ట్ర అసెంబ్లీలో 114 సీట్లు ఉండగా, ఆరుగురు మహిళలు గెలిచారు. ప్రస్తుతం 140 సీట్లుగల అసెంబ్లీకి ఏడుగురు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక సంఘాల్లో ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎన్నికైన మహిళల సంఖ్య 54 శాతం ఉంది. అయినా ఏం లాభం పెత్తనమంతా మగవాళ్లదే. రాష్ట్రం మొత్తం మీద స్థానిక స్వయం పాలక సంఘాలు లేదా సంస్థలు 1200 ఉన్నాయి. వాటిలో 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్ పంచాయతీలు, 14 జిల్లా పంచాయితీలు, 87 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికైన మహిళా సర్పంచులను సంప్రతించగా, పేరుకే తాము సర్పంచులమని, పెత్తనమంతా తమ భర్తలది లేదా పాలకపక్ష నాయకులదేనని మెజారిటీ సభ్యులు చెప్పారు. రిజర్వేషన్ల కారణంగా ఎక్కువ మంది మహిళలు పదవుల్లోకి వస్తున్నారని, అయితే వారికి సరైన రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. మహిళలకు రిజర్వ్ చేయడం వల్లనే తాను మేయర్‌గా ఎన్నికయ్యానని లేకపోతే ఎన్నికయ్యే అవకాశమే లేదని కోచి మేయర్ సౌమిని జైన్ తెలిపారు. తనకు విధులు నిర్వహించడమంటే ప్రతిరోజు గడ్డు రోజేనని ఆమె చెప్పారు. కేరళ రాజకీయాల్లో మొదటి నుంచి మగవాళ్ల ప్రాబల్యమే ఎక్కువని ప్రముఖ ఆర్థిక వేత్త ఎంఏ ఊమ్మెన్ చెప్పారు. రాజకీయాల్లో మహిళల ప్రాబల్యం పెరగాలంటే పార్టీలకు అతీతంగా పదవుల్లో ఉన్న మహిళలంతా ఏకం కావాలని ఆయన సూచించారు. -
కళాశాలలో ఆయుధాలు?
అసెంబ్లీని తప్పుదోవ పట్టించారంటూ కేరళ సీఎంపై ప్రతిపక్షాల దాడి కోచి: కేరళలోని కోచిలో ఓ కళాశాలలో ఆయుధాలు పట్టుబడ్డాయన్న ఆరోపణలు శనివారం రాజకీయ దుమారం రేపాయి. సీఎం పినరయి విజయన్ ఈ వ్యవహారంలో అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. మహరాజా కళాశాల నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలను సీఎం శుక్రవారం అసెంబ్లీలో తోసిపుచ్చారు. అక్కడ ఎలాంటి ఆయుధాలు దొరకలేదని, నిర్మాణ సామగ్రి మాత్రమే ఉందని తెలిపారు. కళాశాల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో ఉందని మీడియాలో వార్తలు వెలువడటంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ స్పందిస్తూ...సీఎం అసెంబ్లీతో పాటు, ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అయితే అసెంబ్లీలో ప్రకటన చేయడానికి ముందే తాను ఎఫ్ఐఆర్ను చూశానని సీఎం అలెప్పీలో వెల్లడించారు. ఈ వ్యవహారంపై శనివారం అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ప్రాబల్యమున్న ఆ కళాశాల ఆయుధాగారంగా మారిందని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఆరోపించింది. ఈ విషయంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలన్న తమ వినతిని స్పీకర్ తిరస్కరించడంతో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. -
వ్యక్తితో 'అసెంబ్లీ' లుంగీ పంచాయతీ
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఓ వ్యక్తితో లుంగీ వివాదం పెట్టుకుంది. సభా కార్యక్రమాలు వీక్షించేందుకు కొంతమందితో కలసి వచ్చిన ఓ వ్యక్తిని లుంగీ ధరించాడనే కారణంతో లోపలికి అనుమతించకపోవడంతో అతడు మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. దీంతో ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ కమిషన్ అసెంబ్లీ వ్యవహారాల అధికారులకు ఆదేశాలిచ్చింది. మలప్పురంలోని కోండోట్టి ప్రాంతానికి చెందిన కుంజిమోయిన్ అనే వ్యక్తి ఈ నెల(నవంబర్) 8న 38మంది బృందంతో కలసి అసెంబ్లీ కార్యకలాపాలు సందర్శకుల గ్యాలరీలో ఉండి వీక్షించేందుకు వెళ్లారు. అయితే, అతడు తెల్ల గళ్ల లుంగీతో అసెంబ్లీకి వెళ్లగా అలాంటి వస్త్రాధరణతో అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలోకి అనుమతించబోమని తిరస్కరించారు. దీంతో అతడు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. గ్యాలరీలోకి మాత్రమే కాకుండా కనీసం అసెంబ్లీ గేటులో నుంచి లోపలికి కూడా అనుమతించలేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
కేరళ అసెంబ్లీలో రణరంగం
సభ్యుల వీరంగంతో అట్టుడికిన సభ బడ్జెట్‌ను అడ్డుకునేందుకు ఎల్డీఎఫ్ విశ్వప్రయత్నం పోడియం వద్ద విధ్వంసం, ముక్కలైన స్పీకర్ కుర్చీ తిరువనంతపురం: అధికార-విపక్ష సభ్యుల మధ్య ఘర్షణతో శుక్రవారం కేరళ అసెంబ్లీ అట్టుడికింది. ప్రజాప్రతినిధులంతా తమ స్థాయిని మరిచి సభలోనే అనుచితంగా ప్రవర్తించారు. కొట్టుకోవడం, కొరుక్కోవడం, తోపులాటలతో సభ రణరంగంగా మారింది. బార్ లెసైన్సుల జారీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ర్ట ఆర్థిక మంత్రి కేఎం మణి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి వీల్లేదంటూ ప్రతిపక్షాలు వీరంగం సృష్టించాయి. బడ్జెట్‌ను అడ్డుకోడానికి స్పీకర్ పోడియంలోనే విధ్వంసానికి దిగాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే బడ్జెట్‌ను మంత్రి మణి ప్రవేశపెట్టారు. విపక్షాలను అడ్డుకోడానికి అధికార యూడీఎఫ్ ఎమ్మెల్యేలు ఆయనకు అడ్డుకోటగా నిలవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రతా సిబ్బంది కూడా భారీగా మోహరించడంతో సభ్యులు ఏకంగా బాహాబాహీకి దిగారు. అస్వస్థతకు గురైన పలువురు ఎమ్మెల్యేలను సభలో నుంచి ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. బడ్జెట్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని కొందరు విపక్ష సభ్యులు, సభలో ప్రవేశపెట్టి తీరాల్సిందేనని ఆర్థిక మంత్రి సహా పలువురు మంత్రులు ముందు రోజు రాత్రి కూడా అసెంబ్లీలో ఉండిపోవడమే పరిస్థితికి అద్దం పడుతోంది. మణికి వ్యతిరేకంగా అసెంబ్లీ బయటా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిరసన తెలుపుతున్న ఎల్డీఎఫ్, యువ మోర్చ కార్యకర్తలపై పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేశారు. ఈ గొడవల్లో ఓ సీపీఎం కార్యకర్త చనిపోయాడు. నిరసనకారులు ఓ పోలీసు వాహనాన్ని తగులబెట్టారు. సభ ప్రారంభానికి ముందే అలజడి శుక్రవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభానికి ముందే అలజడి మొదలైంది. ప్రతిపక్ష ఎల్డీఎఫ్ కూటమి సభ్యులంతా సభలోకి వెళ్లే అన్ని మార్గాలకు అడ్డంగా నిలుచునున్నారు. స్పీకర్ వేదికను చుట్టుముట్టారు. మార్షల్స్ వారిని అక్కడినుంచి పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో తోపులాట మొదలైంది. ఈ క్రమంలోనే విపక్ష సభ్యులు స్పీకర్ కుర్చీని విరగ్గొట్టారు. అక్కడి స్పీకర్లు, కంప్యూటర్లు, లైట్లను ధ్వంసం చేశారు. ఓవైపు గొడవ జరుగుతుండగానే మరో ద్వారం నుంచి ఆర్థిక మంత్రి మణి సభలోకి ప్రవేశించారు. దీంతో విపక్ష సభ్యుల దృష్టి ఆయన వైపు మళ్లింది. చాలా మంది మూకుమ్మడిగా ఆయనవైపు దూసుకెళ్లారు. తోపులాటల మధ్యే ఆయన బడ్జెట్లోని కీలకాంశాలను వేగంగా చదివి వినిపించారు. కాగా, జేడీఎస్ మహిళా ఎమ్మెల్యే ప్రమీలా ప్రకాశం తనను కొరికిదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శివదాసన్ నాయర్ మీడియాకు వెల్లడించారు. తన భుజాన్ని కొరికినట్లు గాయాలు చూపించారు. అయితే ఆయనే తనను కులం పేరుతో దూషించారని ప్రమీల ఆరోపించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులతో అస్వస్థతకు గురైన ఆరుగురు ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేలను స్ట్రెచర్లు, వీల్చైర్లలో ఆసుపత్రులకు తరలించారు. శనివారం రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఎల్డీఎఫ్ ప్రకటించింది. ఈ ఘటనలపై సీఎం ఊమెన్ చాందీ స్పందిస్తూ.. అసెంబ్లీకే బ్లాక్‌డేగా పేర్కొన్నారు. దీనంతటికీ విపక్షాలే కారణమన్నారు. సోమవారం బ్లాక్ డేగా పాటించనున్నట్లు వెల్లడించారు. -
ఆ ఎమ్మెల్యే నన్ను కొరికింది
తిరువంతనపురం: వామపక్ష మహిళా ఎమ్మెల్యే జమీలా ప్రకాశం తనను కొరికారని కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు శివదాసన్ నాయర్ ఆరోపించారు. కేరళ అసెంబ్లీలో ఆర్థికమంత్రి కేఎం మణి శుక్రవారం నాడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ సమయంలోనే సీఎం ఊమెన్ చాందీకి రక్షణగా తాను నిలబడినప్పుడు వామపక్ష ఎమ్మెల్యే జమీలా ప్రకాశం తనను కొరికారని శివదాసన్ ఆరోపించారు.. తన చేతికి అయిన గాయాలను కూడా ఆయన మీడియాకు చూపించారు. అంతకుముందు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక మంత్రి కేఎం మణి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వీల్లేదంటూ ప్రతిపక్ష ఎల్డీఎఫ్ సభ్యులు నిరసనకు దిగారు. బార్ల లైసెన్సుల విషయంలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ మంత్రి మణి తక్షణం రాజీనామా చేయాలని పట్టుబట్టారు. మార్షల్స్ కు, విపక్ష సభ్యులకు మధ్య తోపులాట రణరంగాన్ని తలపించింది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ కుర్చీని పోడియం నుంచి తోసేశారు. కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీంతో శాసనసభ లోపల, బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు విపక్షాల నిరసనల మధ్య మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. -
స్పీకర్ కుర్చీని తోసేశారు...
తిరువనంతపురం: వార్షిక ఆర్థిక బడ్జెట్ నేపథ్యంలో కేరళ శాసనసభలో శుక్రవారం అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. బార్ లైసెన్స్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక మంత్రి కేఎం మణి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వీల్లేదంటూ ప్రతిపక్ష ఎల్డీఎఫ్ సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. విపక్షాల హెచ్చరికలతో నిన్న రాత్రంతా ఆయన అసెంబ్లీనే గడిపారు. మార్షల్స్ కు, విపక్ష సభ్యులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ కుర్చీని పోడియం నుంచి తోసేశారు. ప్రతిపక్షాల ఆందోళనతో శాసనసభ లోపల, బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
థరూర్, పాక్ జర్నలిస్ట్ వ్యవహారంపై రచ్చరచ్చ!
పాకిస్థాన్ జర్నలిస్ట్ తో కేంద్రమంత్రి శశి థరూర్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కేరళ అసెంబ్లీ దద్దరిల్లింది. పాక్ జర్నలిస్ట్ శశి థరూర్ రిలేషన్స్ మీ దృష్టికి వచ్చాయా అని అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీశాయి. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి రమేశ్ చెన్నితల సమాధానమిస్తూ.. శశిథరూర్ పై వచ్చిన ఆరోపణలన్ని మీడియా వార్తలే అని అన్నారు. సునంద పుష్కర్ మరణంపై శశి థరూర్ ను విచారించాలని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఏమైనా అనుమానస్పదంగా అనిపిస్తే.. కేంద్ర ఏజెన్సీలకు నివేదిస్తామని రమేశ్ చెన్నితల ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఢిల్లీలోని ఓ హోటల్ లో అనుమానస్పద స్థితిలో మరణించిన శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అస్థికలు శుక్రవారం త్రివేణి సంగమమ్ లో కలుపనున్నారు.