థరూర్, పాక్ జర్నలిస్ట్ వ్యవహారంపై రచ్చరచ్చ!
థరూర్, పాక్ జర్నలిస్ట్ వ్యవహారంపై రచ్చరచ్చ!
Published Thu, Jan 30 2014 3:57 PM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
పాకిస్థాన్ జర్నలిస్ట్ తో కేంద్రమంత్రి శశి థరూర్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కేరళ అసెంబ్లీ దద్దరిల్లింది. పాక్ జర్నలిస్ట్ శశి థరూర్ రిలేషన్స్ మీ దృష్టికి వచ్చాయా అని అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీశాయి. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి రమేశ్ చెన్నితల సమాధానమిస్తూ.. శశిథరూర్ పై వచ్చిన ఆరోపణలన్ని మీడియా వార్తలే అని అన్నారు. సునంద పుష్కర్ మరణంపై శశి థరూర్ ను విచారించాలని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేశాయి.
రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఏమైనా అనుమానస్పదంగా అనిపిస్తే.. కేంద్ర ఏజెన్సీలకు నివేదిస్తామని రమేశ్ చెన్నితల ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఢిల్లీలోని ఓ హోటల్ లో అనుమానస్పద స్థితిలో మరణించిన శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అస్థికలు శుక్రవారం త్రివేణి సంగమమ్ లో కలుపనున్నారు.
Advertisement