Live Updates..
► మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నేడు ప్రారంభించిన ఈ పోరాటం ఇంకా ఉధృతమవుతుందన్నారు. డిసెంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు తమ పోరాటం సాగుతుందని తెలిపారు. తాము చేపట్టిన ఆందోళన ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని తెలిపారు.
తమ దీక్షలకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. మోదీ ప్రభుత్వం తలుచుకుంటే ఈ బిల్లు పాస్ అవుతుందన్నారు. రాష్ట్రపతికి కూడా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
► మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సిందే. ఎమ్మెల్సీ కవితకు దీక్షకు బీఆర్‌ఎస్ మద్దతు ఉంటుంది. బిల్లు వస్తే ప్రతీ ఆడపిల్లకు రిజర్వేషన్ ఇచ్చినట్టు అవుతుంది.
► ఎమ్మెల్సీ కవిత దీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మద్దతు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ధర్నాకు సంజయ్ సింగ్ హాజరయ్యారు.
► సీతారాం ఏచూరి.. కవిత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మహిళల కోసం ముందడుగు వేశారు. బిల్లు ఆమోదం పొందే వరకు మా మద్దతు కొనసాగుతుంది. 30 సంవత్సరాల నుంచి ఈ బిల్లు పెండింగ్‌లో ఉంది.
► మహిళలు రాజకీయంగా, సామజికంగా, ఆర్థికంగా ఎదగాలంటే మహిళా బిల్లు అవసరం. రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యింది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. ప్రధాని మోదీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
► మహిళల భాగస్వామ్యం లేనంతవరకు సమాజం ముందుకు సాగదు. మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. తొమ్మిది ఏళ్లు అయ్యింది.. ఇప్పటి వరకు బిల్లును ప్రవేశపెట్టలేదు.
► ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం. మహిళా బిల్లు ఆమోందించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలి. ధరణిలో సగం, ఆకాశంలో సగం ఉన్న మహిళలకు అవకాశాల్లో సగ భాగం కావాలి. అప్పటి వరకు అందరం కలిసి పోరాటం చేస్తామని అన్నారు.
► మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నదని, 1996లో నాటి ప్రధాని దేవేగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని చెప్పారు. అందువల్ల బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. మహిళాబిల్లు ఓ చారిత్రక అవసరమని, సాధించి తీరాలని స్పష్టం చేశారు.
► మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదు. దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామన్నారు. ధరణిలో సగం, ఆకాశంలో సగం అనే తెలుగు నానుడి ఉన్నది. అందుకే అవకాశాల్లోనూ సగం కావాలని కోరుతున్నామని చెప్పారు.
► అంతకుముందు, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసిన మహిళా నేతలను ఈ సందర్బంగా కవిత గుర్తు చేసుకున్నారు. వారిపై ప్రశంసలు కురిపించారు.
► జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష ప్రారంభం. కవితతో పాటుగా దీక్షలో పాల్గొన్న సీతారాం ఏచూరి, మంత్రులు, మహిళా ప్రతినిధులు.
Bharat Rashtra Samithi MLC and Telangana CM K Chandrashekar Rao's daughter K Kavitha leads one-day hunger strike in the national capital to seek the introduction of the Women's Reservation Bill in the current Budget session of Parliament. pic.twitter.com/M0oUkAxFEx
— ANI (@ANI) March 10, 2023
► జంతర్ మంతర్ దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.
► సీపీఐఎం సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించనున్నారు.
► జంతర్ మంతర్ వద్ద బీఆర్‌ఎంపీ కవిత మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లకు ఆరోపణలు చేయడం తప్ప వేరే పనిలేదు. బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, చిత్తశుద్ధి పార్లమెంట్‌లో మహిళ బిల్లుకు ఆమోదం తెలపాలి. బీజేపీకి పార్లమెంట్‌లో పూర్తి మెజార్టీ ఉందన్నారు. మహిళ బిల్లు ఆమోదం పొందే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ అధికారంలోకి రావడానికి అక్కడ బలంగా ఉన్న పార్టీలను బలహీనం చేస్తారు. కానీ, సీఎం కేసీఆర్‌ను తట్టుకోవడం బీజేపీ వల్ల కాదు అంటూ కామెంట్స్ చేశారు.
► సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. మా బాధ్యత మేరకు మేము ఒత్తిడి తీసుకువస్తున్నాము. సభలో ఫుల మెజార్టీ ఉన్నప్పటికీ ఎందుకు బిల్లుకు ఆమోదం తెలపడంలేదని ప్రశ్నించారు.
► జంతర్ మంతర్ వద్దకు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత.
సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే.
►చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే డిమాండ్ చేస్తూ దీక్షకు దిగుతున్నారు.
► ఈ దీక్షకు భారత జాగృతి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
► ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభమై సాయంత్రం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
► కవిత దీక్షకు 18 రాజకీయ పా ర్ణీలు ఇప్పటికే సంఘీభావం ప్రకటించగా, వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment