Delhi Liquor Scam: BRS MLC Kavitha To Attend ED Interrogation, Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

ముగిసిన కవిత ఈడీ విచారణ.. 9 గంటల పాటు ప్రశ్నల వర్షం..

Published Sat, Mar 11 2023 8:24 AM | Last Updated on Sat, Mar 11 2023 8:42 PM

MLC Kavitha Will Attends ED Investigation In Delhi Live Updates - Sakshi

Updates:

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటలపాటు  ఈడీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నెల 16న కవిత మళ్లీ విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. కవితను ఐదుగురు అధికారుల బృందం విచారించింది. ఒక జాయింట్ డైరెక్టర్, లేడీ డిప్యూటీ డైరెక్టర్, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్ల బృందం విచారణ జరిపింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సౌత్‌ గ్రూప్‌ పాత్రపై విచారణ జరిపినట్లు తెలిసింది. ఆరుణ్‌ పిళ్లై రిమాండ్‌ రిపోర్టు, ఆడిటర్‌ బుచ్చిబాబు వాట్సాప్‌ చాట్‌ ఆధారంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

కాసేపట్లో కవిత ఈడీ విచారణ ముగియనుంది. ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు.. ఈడీ ఆఫీసు ఆవరణ నుంచి బయటకు పంపుతున్నారు.

► ఢిల్లీ లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. గత ఏడు గంటలుగా ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.

► ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో వందల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నేత తరుణ్‌చుగ్‌ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలకు కేసీఆర్‌, సోనియా ఎవరైనా ఒక్కటేనన్నారు. లిక్కర్‌  స్కాంలో కవిత కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనన్నారు.

► ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో అవకతవకలకు సంబంధించి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతోంది. జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని బృందం అయిదు గంటలుగా ఎమ్మెల్సీను ప్రశ్నిస్తోంది.

కవిత విచారణకు అయిదు నిమిషాలు బ్రేక్‌ ఇచ్చారు. దీంతో విచారణ గది నుంచి బయటకు వచ్చిన ఆమె మళ్లీ లోపలికి వెళ్లారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సౌత్‌ గ్రూప్‌ పాత్రపై విచారణ జరుగుతోంది. ఆరుణ్‌ పిళ్లై రిమాండ్‌ రిపోర్టు, ఆడిటర్‌ బుచ్చిబాబు వాట్సాప్‌ చాట్‌ ఆధారంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

► హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసు వద్ద దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు. బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈడీ, బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు. భారీగా మోహరించిన పోలీసులు బలగాలు. 

► మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ కుటుంబమే లక్ష్యంగా కేంద్రం దాడులు చేస్తోంది. బీజేపీని జనం నమ్మే పరిస్థితి లేదు. ఈడీ విచారణలో ఏ తప్పు చేయలేదని తేలుతుంది. మోదీకి జై కొడితే ఎలాంటి నోటీసులు ఉండవు. వ్యతిరేకిస్తే నోటీసులు ఇస్తారు. 

► అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. కేసీఆర్‌ కుటుంబాన్ని బీజేపీ టార్గెట్‌ చేసింది. తెలంగాణలో అభివృద్ధిని తట్టుకోలేకే కేంద్రం ఇలా వ్యవహరిస్తోంది.

► లిక్కర్‌ స్కాంలో రెండు గంటలుగా కవితను ప్రశ్నిస్తున్న ఈడీ. జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. లిక్కర్‌ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు. ఇండో స్పిరిట్స్‌ కంపెనీలో వాటాలు, రూ. 100కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడీ ప్రశ్నిస్తోంది. 

► ఇప్పటి వరకు లిక్కర్‌ స్కాంలో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో విచారణ కొనసాగుతోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. రామచంద్ర పిళ్లైతో పాటే కవితను విచారిస్తున్నారు. 

► ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్‌ ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావును వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 

► కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీకి క్యూ కడుతున్న పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్‌ కీలక నేతలు. 


► హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం మెయిన్‌ గేట్‌ క్లోజ్‌. ఢిల్లీలో కవిత ఈడీ విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌ కార్యాలయం వద్ద పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. 

► ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు.

► ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. 

► కవితను ప్రశ్నిస్తున్న ఈడీ ప్రత్యేక బృందం. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. 

► కవితను ప్రశ్నిస్తున్న ఐదుగురు ఈడీ అధికారులు. రామచంద్ర పిళ్లైతోపాటు కవితను విచారిస్తున్న ఈడీ. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న సిసోడియా, పిళ్లై. 

► లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు హాజరైన కవిత. 

► కవిత వెంట వచ్చిన తన భర్త అనిల్‌, అడ్వకేట్లను పోలీసులు బయటే నిలిపివేశారు. 

► ఈడీ ఆఫీసుకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.

► ఈడీ ఆఫీసుకు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత.  ఆమె కారుతో పాటు మరో వాహనానికి మాత్రమే అనుమతిచ్చారు. ఈ సందర్భంగా ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

► కవితతో కేటీఆర్‌, హరీష్‌ రావు భేటీ. 

► ఎమ్మెల్సీ కవిత నివాసంలో​ తెలంగాణ అడిషనల్‌ ఏజీ. 

► కవిత నివాసానికి భారీగా చేరుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు. 

► ఈడీ ఆఫీసుకు ఎమ్మెల్సీ కవితతోపాటుగా జాగృతి కార్యకర్తలు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో రంగంలోకి దిగిన మహిళా పోలీసులు. 

► ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు కవిత ప్రయత్నాలు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కవిత కారుతో పాటుగా మరో వాహనానికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. 

► ఈడీ ఆఫీసు చుట్టుపక్కల పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ఇ‍ప్పటికే ఢిల్లీలోని కేసీఆర్‌ నివాసం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

► లిక్కర్‌ స్కాంలో భాగంగా కవిత వద్ద స్టేట్‌మెంట్‌ తీసుకోనున్న ఈడీ అధికారులు. కాగా, కవితకు సౌత్‌ గ్రూపులో 33 శాతం వాటా ఉందని ఈడీ పేర్కొంది.

► రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు స్టేట్‌మెంట్ల ఆధారంగా కవితను విచారించనున్న ఈడీ. 

 కవితను మద్దతుగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఢిల్లీలోని సీఎం కేసీఆర్‌ నివాసం వద్దకు తరలి వస్తున్నారు. 

ఢిల్లీలోని ఈడీ ఆఫీసు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

► మనీశ్‌ సిసోడియా, పిళ్లై, కవిత విచారణ నేపథ్యంలో ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. 

► ఈడీ ఆఫీసు వద్దకు మీడియాను అనుమతించని పోలీసులు. ప్రధాన రోడ్డు వరకే మీడియాను పరిమితం చేశారు. 

► ఢిల్లీలోనే కేటీఆర్‌, హరీశ్‌ రావు ఉన్నారు. 

► నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో న్యాయ నిపుణులతో కేటీఆర్‌ సంప్రదింపులు జరుపుతున్నారు. 

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత.. నేడు ఈడీ ఎదుట హాజరుకానున్నారు. 

► శనివారం ఉదయం 11 గంటలకు తన లాయర్‌తో కలిసి కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

► సౌత్‌ గ్రూప్‌ ఫండింగ్‌పై కవితను ప్రశ్నించనున్న ఈడీ అధికారులు. 

► సీఎం కేసీఆర్‌.. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారు. విచారణ పేరుతో కవితను అరెస్ట్‌ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. కేసులకు భయపడేది లేదు.. న్యాయపోరాటం చేస్తాం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement