jantar mantar
-
మోదీకీ రిటైర్మెంట్ ఇస్తారా?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చర్యలకు ఆరెస్సెస్ సమాధానం చెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ‘జనతా కీ అదాలత్’ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్‌కు ఐదు ప్రశ్నలు సంధించారు. ‘‘75 ఏళ్లు దాటిన నేతలు పదవుల నుంచి తప్పుకోవాలని బీజేపీలో నిబంధన ఉంది. ఎల్కే అడ్వాణీ వంటి నేతకు కూడా దీన్ని వర్తింపజేశారు. ఈ నిబంధనను మోదీకి కూడా వర్తింపజేస్తారా? అడ్వాణీ మాదిరిగానే మరో ఏడాదికి మోదీని కూడా ప్రధాని పదవి నుంచి తప్పిస్తారా?’’ అని భగవత్‌ను ప్రశ్నించారు. ఆరెస్సెస్‌ను కూడా మోదీ ఖాతరు చేయడం లేదనే అర్థం ధ్వనించేలా, ‘కొడుకు చివరికి తల్లిపైకే తల ఎగరేసేంత పెద్దవాడయ్యాడా?’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘పారీ్టలను విచ్ఛిన్నం చేయడానికి, బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకోవడాన్ని ఆర్ఎస్ఎస్ సమరి్థస్తోందా? నేతలపై అవినీతిపరులనే ముద్రవేసి, చివరికి వారిని బీజేపీలో చేర్చుకోవడం సంఘ్‌కు ఇష్టమేనా? బీజేపీ సాగిస్తున్న ప్రస్తుత రాజకీయాల పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా? సైద్ధాంతికంగానూ, అన్ని రకాలుగానూ బీజేపీకి మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్ ఇక మీదట పారీ్టకి అవసరమే లేదన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యలు విన్నాక మీకేమనిపించింది? వీటన్నింటిపై స్పందించండి. బదులివ్వండి’’ అని భగవత్‌ను కోరారు. దేశంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, పదవుల కోసం కాదని స్పష్టంచేశారు. రాబోయే ఎన్నికలు అగ్నిపరీక్ష ఏ తప్పూ చేయని తనపై అవినీతి ఆరోపణలు రావడంతో కలత చెంది సీఎం పదవికి రాజీనామా చేశానని కేజ్రీవాల్ అన్నారు. గత పదేళ్లలో గౌరవం సంపాదించుకున్నాను తప్పితే డబ్బు సంపాదించలేదని వ్యాఖ్యానించారు. ‘‘దసరా నవరాత్రుల తర్వాత అధికారిక నివాసం వీడతా. ప్రజలే నాకు వసతి కలి్పస్తారు’’ అన్నారు. కేజ్రీవాల్ ప్రశ్నలపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లిన ఆయనకు నైతిక విలువలే లేవంటూ ఎక్స్‌లో ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌కు ఐదు ప్రశ్నలు సంధించారు. కేజ్రీవాల్ రాముడు, నేను లక్ష్మణుడినిఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో తనకున్నది రామలక్ష్మణుల సంబంధమని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా అభివర్ణించారు. ఏ రావణుడూ తమను విడదీయలేడంటూ బీజేపీనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జన్తా కీ అదాలత్‌లో సిసోడియా ప్రసంగించారు. అవినీతి రావణుడిపై పోరాటం సాగిస్తున్న రాముడు కేజ్రీవాల్ పక్కన లక్ష్మణుడిలా ఉంటానన్నారు. -
మా పార్టీ నేతలపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు: వైఎస్ జగన్
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో విపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో వైఎస్ జగన్.. ఏపీలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతలపైనే దాడి చేశారు. మాజీ ఎంపీ, దళిత నేత రెడ్డప్ప ఇంటిపై దాడికి పాల్పడ్డారు. రెడ్డప్ప ఇంటిపై దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ హోర్డింగ్స్ పెట్టారు. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతికార చర్యలను ప్రోత్సహించలేదు. ఏకంగా మా పార్టీ ఎంపీ, మాజీ ఎంపీపైనే దాడి చేశారు. దాడులు చేసి, తిరిగి బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతో పాటు, చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికి కూడా విఘాతం కలుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మీడియా ముందుకు రావాల్సి వస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయి. వందల ఇళ్లను ధ్వంసం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా అక్రమ కేసులో పెట్టారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. -
YSRCP ధర్నా.. జగన్‌కు జాతీయ నేతల మద్దతు
YSRCP Protest in Delhi Updates సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై ఢిల్లీ వేదికగా చేపట్టిన వైఎస్సార్సీపీ నిరసన ముగిసింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులంతా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ ధర్నాకు జాతీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు.సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్దవ్ శివసేన, అన్నాడీఎంకే, జీఎంఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీలో విధ్వంసాలపై ప్రతి ఒక్కరూ గళం విప్పాలని వైఎస్ జగన్ అన్నారు. ఏపీలో దాడులను ముక్తకంఠంతో ఖండించారని.. సంఘీభావం తెలిపిన జాతీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. I sincerely thank the @samajwadiparty, @AamAadmiParty, @AIADMKOfficial, @ShivSenaUBT_, @AITCofficial, @VCKofficials, IUML, @yadavakhilesh, @priyankac19, @rautsanjay61, @AdvRajendraPal, @AbdulWahabPV, @proframgopalya1, Thambi Durai, @MdNadimulHaque6, @AGSawant and @thirumaofficial…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2024 జాతీయ మీడియాతో వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతపైనే దాడి చేశారుమాజీ ఎంపీ, దళిత నేత రెడ్డప్ప ఇంటిపై దాడి చేశారు.. కార్లను ధ్వంసం చేశారుఏపీలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. అందుకు తగ్గట్లే దాడుల పర్వం కొనసాగుతోందిప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడుల్ని ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందిజాతీయ పార్టీలకు ఆహ్వానం పంపాం.. ఇక్కడికి వచ్చి టీడీపీ ప్రభుత్వ అరాచకాలను చూడాలని(ఎగ్జిబిషన్ గ్యాలరీ) కోరాంరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి అపాయింట్మెంట్ కోరాం.. వాళ్లకు ఏపీలో జరుగుతున్న హింసను వివరిస్తాంరాష్ట్రపతి పాలన విధించాలి..ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఘటనల వీడియోలు చూసిన తరవాత, నాకు ఒక్కటే అనిపించింది. స్వతంత్య్ర భారతావనిలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో కనీసం వాటిని ఊహించలేము. మరి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ ఏమైంది? గవర్నర్ ఏం చేస్తున్నారు?. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. విపక్ష పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారు. వారిపై దాడి చేస్తున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి, టీడీపీ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. అందుకే నేను కేంద్రాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా కళ్లు తెరవాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి.-రాంగోపాల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ (రాజ్యసభ)ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలిఎన్నికల తరవాత ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో.. అన్న విషయాలు చూపారు. మాకు చాలా ఆవేదన కలిగింది. రాష్ట్రాల్లో ఏం జరిగినా, ఢిల్లీకి పట్టదు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, ఎప్పుడూ, ఎక్కడా చోటు చేసుకోవడం ఏ మాత్రం సరి కాదు. ఇలాంటి వాటిని మేము కచ్చితంగా వ్యతిరేకిస్తాము. మేమంతా మీకు ఒకే భరోసా ఇస్తున్నాము. ఎక్కడైతే వ్యవస్థలపై దాడులు జరుగుతాయో, పార్టీలపై దౌర్జన్యాలు కొనసాగుతాయో.. ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందో.. ఇండియా కూటమి అక్కడ నిలబడి పోరాడుతుంది. భుజం భుజం కలిపి పని చేస్తుంది. ఎందుకంటే, ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ పోరాటమే కాదు.. మీ పార్టీ కార్యకర్తలకు సంబంధించింది మాత్రమే కాదు.. ఎక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా.. ఇది ఏ ఒక్కరికి మంచిది కాదు. అందుకే మేము అండగా నిలుస్తాము. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్ర గవర్నర్ స్పందించాలి. సుప్రీం కోర్టు కూడా సుమోటోగా కేసు స్వీకరించాలి.-ప్రియాంక చతుర్వేది, శివసేన నాయకురాలుఏపీలో పరిస్థితి చూసి షాక్ తిన్నా..నేను బెంగాల్ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూసి, షాక్ తిన్నాను. రాష్ట్రంలో ఏ స్థాయిలో దౌర్జన్యాలు జరిగాయో చూస్తే, బాధ అనిపిస్తోంది. ఇళ్లపై దాడులు చేశారు. ఆ ఘటనలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కేంద్రం సుమోటోగా చర్య తీసుకోవాలి. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చక్కదిద్దాలి. మేము జగన్‌గారికి, రాష్ట్ర ప్రజలకు అండగా, తోడుగా నిలబడతాము.-నదిముల్‌హక్ (తృణమూల్ కాంగ్రెస్)ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం..న్యాయం కోసం మీరు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు మేము ఇక్కడికి వచ్చాము. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఫోటోలు, వీడియోల క్లిప్పింగ్స్ అన్నీ చూశాము. నిజంగా షాక్‌కు గురయ్యాము. ఎన్నికలు జరిగిన నెల రోజుల్లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా, అధికార టీడీపీ అనేక దౌర్జన్యాలు చేసింది. వారి ఇళ్లపైన పడిన టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. పక్కాగా ప్లాన్ చేసి మరీ ఈ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన టాప్ లీడర్ల ఆదేశాల మేరకే, ఆ పార్టీ కార్యకర్తలు ఈ దాడులు, దౌర్జన్యాలు చేశారు.ముఖ్యంగా ప్రస్తుత సీఎం కొడుకు, తన పార్టీ కేడర్‌ను ఈ దాడులకు ఉసి గొల్పుతున్నాడు. మా పార్టీ తరపున ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీలో జరుగుతున్న అరాచకాలను కేంద్రం కూడా పరోక్షంగా సమర్థిస్తోంది. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి. ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలి. మా పార్టీ తరపున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. జగన్‌కు అండగా నిలుస్తాం. ఏపీలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయాలి. సంబంధిత నాయకులపై కేసులు నమోదు చేయాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ దిశలో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేం డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనేలా చూడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలకు చోటు లేదు. అందుకే దీన్ని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు కూడా ఖండించాలి. మేమ తప్పనిసరిగా మీకు అండగా నిలుస్తాము. న్యాయం కోసం మీరు చేస్తున్న పోరాటంలో మీకు మద్దతునిస్తామని హామీ ఇస్తున్నాను.-తిరుమా వలవన్. వీసీకే పార్టీ అధ్యక్షుడు (తమిళనాడు)వారికి, దేశ ద్రోహులకు తేడా ఏముంది?ఇది చాలా బాధాకరం. దేశం ఎటు పోతుంది? దేశంలో ఏం జరుగుతోంది? నాడు స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ వ్యవస్థను రూపొందించిన వారు, దీన్ని ఆనాడు ఊహించారా?. ఎన్నికల్లో గెల్చిన పార్టీ, ఓడిన పార్టీ వారిపై దాడులు చేసి ప్రాణాలు తీయడం.. ఏమిటిదంతా?. వారికి, దేశ ద్రోహులకు తేడా ఏముంది? దేశ ద్రోహుల కంటే వీరు తక్కువ కాదు. కానీ కేంద్రం ఏం చేస్తోంది. ఎన్డీఏ కూటమి కూడా ఎందుకు స్పందించడం లేదు. ఏపీలో జరుగుతున్న ఘటనలపై కేవలం దాడులు, దౌర్జన్యాల కోణంలోనే కాకుండా, దేశద్రోహ కేసులు నమోదు చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవి ఏ మాత్రం ఆమోదం కాదు. ఇలా దాడులు చేస్తున్న వారిని వెంటనే జైలుకు పంపాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. వారు దేశానికే ప్రమాదకారిగా మారారు కాబట్టి.. వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.-రాజేంద్రపాల్ గౌతమ్. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో ఫోటో గ్యాలరీని ఎఐఎడిఎంకే ఎంపీ (రాజ్యసభ) చంద్రశేఖర్ సందర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రజా తీర్పుకు అనుగుణంగా పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి.అయితే గెల్చిన పార్టీ, ఓడిన పార్టీపై దాడులు చేయడం, వేధించడం సరికాదుఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అంత దారుణంగా ఉందిఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా, అధికారంలోకి వచ్చినా, ప్రజలందరినీ కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కానీ, ఏపీలో అది జరగడం లేదుఅందుకే ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలని.. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు అరికట్టాలని, శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నానురాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, శాంతి భద్రతలు బాగు పడడానికి.. మేము, జగన్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించాముఆ దిశలోనే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ఇస్తుంది.ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలిఏపీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలిపరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిఅత్యాచారాల పైన అందరూ పోరాటం చేయాలిఏపీ తరహాలో తమిళనాడులో దాడులు జరుగుతున్నాయిశాంతిభద్రతలు క్షీణించాయిదాడులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి:::తంబీ దురై, అన్నా డీఎంకే ఎంపీ ఏపీ మణిపూర్ లాగా మారుతోందిఎవరు వెళ్ళిపోయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిలబడ్డారుఎవరికైనా అధికారం వస్తుంది పోతుందిప్రతీకార దాడులు, అత్యాచారాలు దారుణంఈ దాడులు చూస్తే బాధ కలుగుతోందివైఎస్ జగన్ కు మద్దతు ఇస్తున్నాం:::అరవింద్ సావంత్, శివసేన ఎంపీ( ఉద్దవ్ వర్గం)వైఎస్సార్సీపీ పోరాటానికి శివసేన మద్దతువైఎస్ఆర్సీపీ జంతర్ మంతర్ ధర్నాకు మద్దతు పలికిన శివసేన జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్జగన్ పోరాటానికి మద్దతు ప్రకటించిన అరవింద్ సావంత్ వైఎస్సార్సీపీ ధర్నాకు అన్నాడీఎంకే మద్దతుఏపీ కూటమి పాలనపై వైఎస్సార్సీపీ ఢిల్లీలో ధర్నాధర్నాకు మద్దతు తెలిపిన అన్నాడీఎంకే పార్టీజగన్ను కలిసిన అన్నాడీఎంకే ఎంపీ తంబి దొరైఏపీ అరాచకాలను తంబి దొరైకు వివరించిన జగన్ చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదుఏపీలో చట్ట బద్ద పాలన జరగడం లేదుకేంద్ర హోం శాఖ , ఏపీకి స్పెషల్ టీమ్ పంపి ఈ దారుణ దాడులపై స్వతంత్ర దర్యాప్తు చేయాలిఎవరు అధికారంలో ఉన్నా కార్యకర్తలపై దాడులు సరికాదుఅధికారం రావడం పోవడం సహజంవైఎస్ జగన్ కు మద్దతు ఇస్తున్నాం:::సంజయ్ రౌత్, ఉద్ధవ్ శివసేన ఎంపీ వైఎస్సార్సీపీ పోరాటానికి ఉద్దవ్ శివనసేన మద్దతుజగన్ కలిసి సంఘీభావం తెలిపిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది సంజయ్‌కు రాష్ట్రంలో గతి తప్పిన లా అండర్ ఆర్డర్ పరిస్థితుల్ని వివరిస్తున్న జగన్ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదుప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదువిపక్షాలపై అరాచకాలు మంచి సంప్రదాయం కాదుఅధికారంలో ఉన్నవాళ్లు శాంతియుతంగా ఉండాలిఇవాళ చంద్రబాబు సీఎం.. జగన్ అధికారంలో లేకపోవచ్చు.. కానీ రేపు జగన్ మళ్లీ సీఎం కావొచ్చుఏ పార్టీకైనా కార్యకర్తలే బలంకార్యకర్తల కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారుయూపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది.. బుల్డోజర్ రాజకీయం నడుస్తోందిప్రజాస్వామ్యంలో దాడుల్ని అందరూ ఖండించాలి::: అఖిలేష్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నిరసనకు సమాజ్ వాదీ పార్టీ సంఘీభావంజగన్ ను కలిసి మద్దతు ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఎంపీ రాంగోపాల్ యాదవ్అఖిలేష్కు టీడీపీ హింసకు సంబంధించి వీడియోలు చూపించిన జగన్ వైఎస్ఆర్సీపీ నిరసనకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ సంఘీభావంవైఎస్ జగన్ కలిసి సంఘీభావం ప్రకటించిన వాహబ్ ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు : వైఎస్ జగన్ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా?కూటమి అధికారంలోకి వచ్చాక 30 మందికిపైగా వైఎస్సార్సీపీ కార్యకర్తల హత్యప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు.లోకేష్ రెడ్‌బుక్ హోర్డింగ్‌లు ఏపీలో పెట్టారు.మేం అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదువందల ఇళ్లను ధ్వంసం చేశారు. గిట్టనవారి పంటలను కూడా ధ్వంసం చేశారు.కూటమి ప్రభుత్వం దాడులతో పాలన సాగిస్తోందిఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: వైఎస్ జగన్ నిరసనలో జగన్‌తో పాటు పాల్గొననున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలుజాతీయ స్థాయిలో ఏపీలో కొనసాగుతున్న అరాచకాల్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే నిరసనఏపీ హింసాత్మక ఘటనలపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ఏపీలో విధ్వంస పాలన కొనసాగుతోందివైఎస్సార్సీపీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయిప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు::: వంగ గీతా ఏపీలో విధ్వంస పాలన నడుస్తోందిరాక్షస పాలన సాగుతోంది:::దేవినేని అవినాష్ అమాయకులను తీవ్రంగా కొడుతున్నారువైఎస్సార్సీపీ లక్ష్యంగా దాడులు చేస్తున్నారువినుకొండలో రషీద్‌ను నడిరొడ్డు మీద హత్య చేశారు50 రోజుల్లో ఎన్నో ఘోరాలు జరిగాయి కాబట్టే ధర్నా చేస్తున్నాంఅరాచక పాలనను అరికట్టాలని ఢిల్లీ వేదికగా ధర్నా:::అంబటి ఏపీలో టీడీపీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయినిన్న కూడా వైఎస్సార్సీపీ నేతపై దాడి జరిగిందివైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారుఅసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నాయిరాష్ట్రంలో 31 హత్యలు జరిగాయి.. వెయ్యికిపైగా దాడులు జరిగాయిఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందిఏపీలో అరాచకాలను జాతీయస్థాయిలో తీసుకెళ్లేందుకే ధర్నా::: సజ్జలవైఎస్సార్సీపీ టార్గెట్‌గా దాడులు చేస్తున్నారుఏపీ పరిస్థితులు జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకే ధర్నా::: ఎమ్మెల్సీ భరత్ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందిరాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది::: వరుదు కల్యాణి ఏపీలో జరుగుతున్న హింసాకాండపై ధర్నాఏపీలో 31 హత్యలు జరిగాయి300 హత్యాయత్నాలు, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారుఏపీ పరిస్థితులు దేశ ప్రజలకు తెలిసేందుకే ధర్నా:::పుష్పశ్రీవాణి👉వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు, కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ అరాచక పాలనను.. దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఢిల్లీలో ఇవాళ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5గం. వరకు ఈ నిరసన కొనసాగనుంది.👉ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఆంక్షలు విధించారు. ఏపీ భవన్ గేట్లు మూసేశారు. జగన్ ధర్నా నేపథ్యంలోనే నిషేధాజ్ఞల నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. 👉ఏపీలో ప్రతీకార రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. గతంలో.. ఎన్నడూ ఇలాంటివి జరగలేదు. గత ఐదేళ్లు శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది అవి క్షీణిస్తూ వచ్చాయి. చంద్రబాబు రాష్ట్రంలో చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. TDP కేడర్‌ను ఉసిగొల్పి రాష్ట్రంలో నరమేధాన్ని సృష్టిస్తున్నారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు.. ఆఖరికి ఓట్లు వేశారన్న కారణంగా కూడా దాడులకు తెగబడుతున్నాయి టీడీపీ శ్రేణులు. 👉 ఢిల్లీ ధర్నాలో టీడీపీ కూటమి ఆటవిక పాలనకు నిదర్శనంగా.. ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది వైఎస్సార్సీపీ. ఇప్పటివరకు జరిగిన దాడుల తాలుకా ఫొటోలు, వీడియో ఫుటేజీలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనుంది. తద్వారా ప్రభుత్వ ప్రేరేపిత హత్యాకాండను, రాష్ట్రంలో పరిస్థితి తీవ్రతను దేశం దృష్టికి తీసుకెళ్లనుంది.👉 జంతర్ మంతర్‌లో ఈ ఉదయం వైఎస్సార్సీపీ ధర్నా కార్యక్రమం జరగనుంది. ఈ నిరసన కార్యక్రమానికి పోలీసుల నుంచి వైఎస్సార్సీపీకి అనుమతి లభించింది. వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలక నేతలు అంతా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనపై నిరసన గళం విప్పుతూ.. మీడియాతో జగన్ మాట్లాడనున్నారు. అలాగే.. ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ద్వారా ఏపీలో కొనసాగుతున్న నరమేధాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లనున్నారాయన. 👉టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దాడులు, హత్యలు, హత్యాచారాలు.. హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీని టార్గెట్ చేసుకుని అధికారి టీడీపీ కూటమి చేస్తున్న దాడులను వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. అధికారం రాకముందు తమ శ్రేణుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లు.. అధికారం చేపట్టాక దాడులపై మౌనం వహించడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 👉ఈ నెలన్నర కూటమి పాలనలో.. రాష్ట్రంలో 36 హత్యలు.. నలుగురిపై అత్యాచారాలు, ఆపై హత్యలు.. 16 హత్యాచారాలు.. వెయ్యికి పైగా దాడులతో రాష్ట్రంలో అధఃపాతాళానికి శాంతి భద్రతలు దిగజారాయి. 👉ఎన్నికల ప్రచారంలో.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, ఇతర కూటమి నేతలు.. వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలంటూ బహిరంగంగానే ఆ పార్టీల కేడర్లకు పిలుపు ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు బ్యానర్లు కూడా రాష్ట్రమంతా ఏర్పాటు చేశారు. పర్యవసానంగా వందల సంఖ్యలో దాడులు.. విధ్వంసాలతో కూటమి పార్టీల శ్రేణులు రాష్ట్రాన్ని హడలెత్తిస్తున్నాయి. వినుకొండ ఘటనతో.. ఆ హింస తారాస్థాయికి చేరింది. 👉 ఎన్నికల హామీల అమలుకు కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని జగన్ భావించారు. అయితే జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తమై వెంటనే ఆయన రంగంలోకి దిగారు. వైఎస్సార్సీపీ కేడర్‌కు మనోధైర్యం కలిగించడంతో పాటు వినుకొండ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలోనే ఢిల్లీ ధర్నా నిర్ణయాన్ని ప్రకటించారు. 👉ఏపీలో కొనసాగుతున్న ఆటవిక పాలనపై జోక్యం చేసుకోవాలి, గత 50 రోజులుగా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని ఆయన కేంద్రాన్ని కోరబోతున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న వైఎస్సార్సీపీ అధినేత.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి, ఇతర కేంద్ర మంత్రల్ని కలుస్తారు. సహేతుమైన కారణాల్ని వాళ్లకు వివరించి.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే పలు జాతీయ పార్టీల నేతల్ని కలిసి ఆయన రాష్ట్రం పరిస్థితి వివరించి.. మద్దతు కోరనున్నారు. 👉టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తోన్న దారుణాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే పోరాటం ప్రారంభించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని.. హత్యలు, హత్యాచారాలు, దాడులతో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారని.. తక్షణమే జోక్యం చేసుకుని శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 👉మారణకాండకు సంబంధించి ఫొటోలు, వీడియోలు వంటి సాక్ష్యాధారాలున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని ఎత్తిచూపారు. టీడీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకుని, శాంతిభద్రతలను పరిరక్షించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి కోరారు. చట్టసభల్లో నల్ల కండువాలతో నిరసన గళం వినిపించారు. కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని ఇప్పుడు జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. -
సానుకూలంగా చర్చలు.. సరిహద్దులోనే రైతులు!
తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలో యాత్ర చేపట్టిన రైతులు.. తమ నిరసనల్ని కొనసాగించాలనే నిర్ణయించారు. గురువారం అర్ధరాత్రి దాకా కేంద్రంతో జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాలేదు. అయితే సానుకూలంగానే జరిగినట్లు ఇటు కేంద్రం, అటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మీడియాకు తెలియజేశారు. కానీ, రైతు సంఘాలు మాత్రం కాలపరిమితితో కూడిన హామీ కోరుతున్నాయి. దీంతో ఇరువర్గాలు ఆదివారం సాయంత్రం మరోసారి భేటీ కావాలని నిర్ణయించాయి. అయితే.. తమ నిరసనలను మాత్రం కొనసాగించి తీరతామని, ఢిల్లీ మార్చ్ కొనసాగిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. మంగళ, బుధవారాల్లో అట్టుడికిన పంజాబ్, హర్యానా సరిహద్దులు.. చర్చల నేపథ్యంలో గురువారం కాస్త శాంతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అలాగే.. ఢిల్లీ సరిహద్దుల నుంచి తాము వెనక్కి వెళ్లబోమని.. శాంతియుతంగానే నిరసనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. చర్చలపై ఎవరేమన్నారంటే.. .. ఛండీగఢ్‌లో గురువారం రాత్రి కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్‌తో రైతు సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. రైతుల డిమాండ్లలో ముఖ్యమైన అంశాలపై వివరంగా చర్చించామని.. సానుకూలంగా చర్చలు జరిగాయని మంత్రి అర్జున్ ముండా మీడియాకు తెలియజేశారు. ఆదివారం సాయంత్రం జరగబోయే చర్చలతో ఇరువైపుల నుంచి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారాయన. రైతు సంఘాల నేతలతో జరిగిన చర్చలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని, శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు హామీ ఇచ్చారని తెలిపారు. అదే సమయంలో హర్యానా ప్రభుత్వం సరిహద్దులో వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. #WATCH | Union Ministers Piyush Goyal, Arjun Munda, Nityanand Rai and Punjab CM Bhagwant Mann hold a meeting with farmer leaders, in Chandigarh. (Video: CM Bhagawant Mann PRO) pic.twitter.com/3mCx30DXbd — ANI (@ANI) February 15, 2024 ఇక రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర(MSP), రైతుల రుణమాఫీ లాంటి అంశాలపై చర్చించినా.. కాలపరిమితితో కూడిన హామీ దొరికితేనే తాము నిరసనలు విరమిస్తామని తెలిపారు. ‘‘కేవలం చర్చల కోసమే మేం లేం. పరిష్కారం కూడా కావాలి. అందుకు సమయం కావాలి అని వాళ్లు(కేంద్ర మంత్రుల్ని ఉద్దేశిస్తూ..) కోరారు అని రైతు సంఘాల నేత ఒకరు తెలిపారు. అదే సమయంలో.. శాంతియుతంగా నిరసనలు కొనసాగిద్దామని రైతులకు సంఘాల నేతలు పిలుపుఇచ్చారు. ఇక తమ సోషల్ మీడియా అకౌంట్లపై ఆంక్షలు విధించడం..రైతులపై భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరును వాళ్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అదే సమయంలో.. #WATCH | Chandigarh: After the meeting between the central government and the farmer unions concluded, farmer leader Jagjit Singh Dallewal says, "The protest will continue peacefully... We will not do anything else. We will appeal to the farmers too. When meetings are underway… pic.twitter.com/YJOZIZ8Nlm — ANI (@ANI) February 15, 2024 నేడు బంద్‌కి పిలుపు రైతు సంఘాలు శాంతియుతంగా ఢిల్లీకి యాత్ర నిర్వహిస్తామంటున్నాయి. ఇక సంయుక్త్ కిసాన్ మోర్చా ఇచ్చిన గ్రామీణ భారత్ బంద్ నేపథ్యంలో పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈరోజు వ్యవసాయ పనులు మాని.. రైతులంతా రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపాలని పిలుపు ఇచ్చింది కిసాన్ మోర్చా. ఎమ్ఎస్పీ, కనీస పెన్షన్, కనీస వేతనం.. ఇలా 21 డిమాండ్ల సాధన కోసం తొమ్మిది యూనియన్ల సీనియర్ నేతలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సంయుక్త నిరసన తెలిపేందుకు సిద్దం అయ్యారు. రైతుల సంఘాలుఇచ్చిన భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. నోయిడాలో 144 సెక్షన్ విధించారు. -
Kerala CM Pinarayi Vijayan: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం
న్యూఢిల్లీ: కేంద్రం పెత్తందారీ పోకడలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ కేరళలోని వామపక్ష కూటమి(ఎల్డీఎఫ్) గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టింది. కేంద్రం తీరుతో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సమస్యలతోపాటు, పరిపాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఇబ్బందికరంగా మారిందని విజయన్ చెప్పారు. రుణాలను, గ్రాంట్లను సరిగా ఇవ్వడం లేదన్నారు. తమది రాజకీయ పోరాటమెలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాలకు సమాన గౌరవాన్ని, న్యాయమైన వాటాను ఇవ్వాలన్న పోరాటానికి ఇది ఆరంభమని విజయన్‌తో పాటు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కార్యక్రమంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, రాజ్యసభ సభ్యుడు సిబల్, డీఎంకే నేతలు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల ఆర్థిక సమస్యలకు కేంద్రమే కారణమన్న ఎల్డీఎఫ్ వాదనను తాము అంగీకరించడం లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. -
రెజ్లర్లను అడ్డుకున్న పోలీసులు
రెజ్లర్లను అడ్డుకున్న పోలీసులు -
'అది మేము కాదు.. మా ఫోటోలను మార్ఫింగ్ చేశారు!'
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా టాప్ రెజ్లర్లు నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. చాన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపు శాంతియుత ర్యాలీ చేపట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీకి వెళ్తున్న రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని బస్సుల్లో ఎక్కించి వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఫొటోల్లో వినేశ్ ఫోగట్, సంగీత ఫోగట్ పోలీసు వ్యాన్‌లో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఉంది. ఈ ఫొటోలపై రెజ్లర్లు స్పందించారు. తమ ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆరోపించారు. ''కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI Technology) ఉపయోగించి మొహాలనే మార్చేస్తున్నారు.. మేమెంత చెప్పండి.. మా నిరసనపై బురద జల్లే ప్రయత్నంలో కొందరు గిట్టని వ్యక్తులు ఇలాంటి తప్పుడు చిత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ నకిలీ ఫొటోను పోస్ట్ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తాం'' అని భజరంగ్ పునియా ట్వీట్ చేశాడు. దీనిపై సాక్షి మలిక్ స్పందిస్తూ..''అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావట్లేదు. మాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు'' అని మండిపడ్డారు. IT Cell वाले ये झूठी तस्वीर फैला रहे हैं। हम ये साफ़ कर देते हैं की जो भी ये फ़र्ज़ी तस्वीर पोस्ट करेगा उसके ख़िलाफ़ शिकायत दर्ज की जाएगी। #WrestlersProtest pic.twitter.com/a0MngT1kUa — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 28, 2023 చదవండి: శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం -
‘కాలుస్తావా.. ఎక్కడికి రావాలో చెప్పు’.. రిటైర్డ్ ఐపీఎస్‌కు బజరంగ్ పూనియా ఛాలెంజ్
న్యూఢిల్లీ: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ రాజకీయ ప్రముఖుడిపై కేంద్రం సరిగా స్పందించకపోవడంతో రెజర్లు ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు వారి అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద రెజర్ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై రిటైర్డ్ ఐపీఎస్ ఒకరు ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పూనియా..ధీటుగా బదులిచ్చారు. కాల్పుల అంశంపై పునియా అన్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ రిటైర్డ్ ఐపీఎస్, కేరళ పోలీస్ మాజీ చీఫ్ ఎన్ సీ ఆస్తానా ఈ రకంగా ట్వీట్ చేశారు. ‘పరిస్థితులు బట్టి మీపై కాల్పులు జరుపుతారు తప్ప మీరు చెబితే కాదు. ఒక బస్తా చెత్తను పడేసినట్లే.. మిమ్మల్ని లాగి పడవేస్తాం. సెక్షన్ 129 ప్రకారం పోలీసులకు కాల్చులు జరిపే అధికారం ఉంది. సమయం వస్తే ఆ కోరిక నెరవేరుతుంది. అందుకే మీరు ముందుకు చదువుకుని ఉండాలి. పోస్ట్‌మార్టం టేబుల్‌పై మళ్లీ కలుద్దాం’’ అంటూ రెజర్లను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ పై పునియా స్పందిస్తూ.. ‘‘ఈ ఐపీఎస్ అధికారి మమ్మల్ని కాల్చడం గురించి మాట్లాడుతున్నారు. సోదరా, మేము మీ ముందు ఉన్నాం, ఎక్కడికి రావాలో చెప్పండి. మీ బుల్లెట్లకు మా చాతీని చూపుతామని మీకు ప్రమాణం చేస్తున్నా. ఇప్పటి వరకు రెజర్లు బుల్లెట్లు మినహా మిగతావన్నింటినీ ఎదుర్కొన్నారు. ఇక మిగిలింది అదొక్కటే, అది కూడా తీసుకురండి’’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు. ये IPS ऑफिसर हमें गोली मारने की बात कर रहा है। भाई सामने खड़े हैं, बता कहाँ आना है गोली खाने… क़सम है पीठ नहीं दिखाएँगे, सीने पे खाएँगे तेरी गोली। यो ही रह गया है अब हमारे साथ करना तो यो भी सही। https://t.co/jgZofGj5QC — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 29, 2023 చదవండి: Delhi Shahbad Dairy Case:: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
ఇక నో మోర్ పర్మిషన్.. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనపై పోలీసుల నిర్ణయం
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన సందర్భంగా నిన్న(ఆదివారం) పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ నిరసనకారుల్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని 12 మందిపై కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు షాక్ ఇచ్చారు. ఇక నుంచి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతుల కోసం గనుక వాళ్లు దరఖాస్తు చేసుకుంటే.. జంతర్ మంతర్ కాకుండా వేరే ఎక్కడైనా అనుమతులు ఇస్తామంటూ న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది. ‘‘వాళ్లు(రెజ్లర్లు) పోలీసుల అభ్యర్థనను పట్టించుకోకుండా పార్లమెంట్ మార్చ్‌ను చేపట్టి.. చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. అందుకే జంతర్ మంతర్ వద్ద వాళ్లు చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది!. రెజ్లర్లు గనుక భవిష్యత్తులో మళ్లీ నిరసనకు దరఖాస్తు చేస్తే.. జంతర్ మంతర్ కాకుండా అనువైన ప్రదేశంలో వారి నిరసనకు అనుమతిస్తాం అని డీసీపీ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.. कुश्ती पहलवानों का धरना और प्रदर्शन निर्बाध तरीक़े से जंतर मंतर की सूचित जगह पर चल रहा था। कल, प्रदर्शकारियों ने तमाम आग्रह और अनुरोध के बावजूद कानून का उन्मादी रूप से उल्लंघन करा। अतः चल रहे धरने को समाप्त कर दिया गया है। — DCP New Delhi (@DCPNewDelhi) May 29, 2023 ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఈ నిరసనలు కొనసాగాయి. మొత్తం 38 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగింది. భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేదించారని, అతన్ని అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. కానీ, రెజ్లర్లు మాత్రం బ్రిజ్‌ను అరెస్ట్ చేసే దాకా నిరసనలు ఆపమని చెబుతున్నారు. VIDEO | Security heightened at Jantar Mantar in Delhi ahead of the 'Mahila Samman Mahapanchayat' called by protesting wrestlers today. pic.twitter.com/rP0EXvLuwg — Press Trust of India (@PTI_News) May 28, 2023 Video Source: PTI News అవి మార్ఫింగ్ ఫొటోలు ‘‘అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావడం లేదు. మాకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’’.. అరెస్టు తర్వాత వ్యానులో వినేష్, సంగీత ఫొగాట్‌లు నవ్వుతున్నట్లు ఉన్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై రెజ్లర్ సాక్షి మాలిక్ పై విధంగా స్పందించారు. ఇదీ చదవండి: రాజదండం ఎవరి కోసం? -
శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు కొన్ని వారాలుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించిన రెజ్లర్ సంఘ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా రెజ్లర్లు గత కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి పలు వర్గాల నుంచి పూర్తి మద్దతు లభించింది. అయితే ఆదివారం రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు ఆదివారం కొత్త పార్లమెంటు వైపు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఇవాళే కొత్తగా ప్రారంభమైన నూతన పార్లమెంట్ భవనం ముందు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలకు డిమాండ్ చేస్తూ ''మహిళా మహాపంచాయత్'' నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. ఈ మేరకు నూతన పార్లమెంట్ భవనం వైపు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు జంతర్‌మంతర్ వద్ద అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న పలువురు రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, మరో రెజ్లర్ బజరంగ్ పూనియా ఉన్నారు. కాగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని రెజ్లర్లు మండిపడుతున్నారు. మేం బారీకేడ్లు విరగొట్టామా..? ఇంకేమైనా హద్దులు మీరామా..? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. #WATCH | Delhi: Security personnel stop & detain protesting wrestlers as they try to march towards the new Parliament from their site of protest at Jantar Mantar.Wrestlers are trying to march towards the new Parliament as they want to hold a women's Maha Panchayat in front of… pic.twitter.com/3vfTNi0rXl— ANI (@ANI) May 28, 2023 #WATCH | Mahapanchayat will certainly be held today. We're fighting for our self-respect.They're inaugurating the new Parliament building today, but murdering democracy in the country.We appeal to the administration to release our people detained by police: Wrestler Bajrang Punia pic.twitter.com/VI4kGLxGWV— ANI (@ANI) May 28, 2023 To all my international fraternity Our Prime Minister is inaugurating our new parliamentBut on the other hand, Our supporters has been arrested for supporting us.By arresting people how we can call us “mother of democracy”India’s daughters are in pain.— Sakshee Malikkh (@SakshiMalik) May 28, 2023 जंतर मंतर पर सरेआम लोकतंत्र की हत्या हो रही एक तरफ़ लोकतंत्र के नये भवन का उद्घाटन किया है प्रधानमंत्री जी ने दूसरी तरफ़ हमारे लोगों की गिरफ़्तारियाँ चालू हैं. pic.twitter.com/ry5Wv9xn5A— Vinesh Phogat (@Phogat_Vinesh) May 28, 2023 చదవండి: స్కూటీపై చక్కర్లు; ఆ ఇద్దరు గుజరాత్ బలం.. జాగ్రత్త -
అతన్ని అరెస్టు చేయకపోతే నిరసన జంతర్‌మంతర్‌ని దాటి వెళ్తుంది!
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో భారత రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారి నిరసనకు రైతు సంఘాలు కూడా మద్దతు తెలపాయి. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి సరైన విధంగా స్పందన రాకపోవడంతో.. రెజ్లర్లు తమ నిరసనను జంతర్ మంతర్ని దాటి మరింత ముందుకు తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్లు సోమవారం ప్రకటించారు. ఇతర దేశాల ఒలింపిక్ పతక విజేతలు, అథ్లెట్లను సంప్రదించి వారి మద్దతును కూడా తీసుకుని తమ ఆందోళన మరింతగా ఉద్ధృతం చేస్తామని చెప్పారు. బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌ని అరెస్టు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకుంటే ఇలానే చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు భారత స్టార్ రెజ్లర్లు ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు మే 21న పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 23 రోజులుగా భారత రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: అమితాబ్ బచ్చన్ పోస్ట్ వివాదం..రంగంలోకి దిగిన ముంబై పోలీసులు) -
రెజ్లర్లకు అండగా రైతు సంఘాలు.. భారీగా పోలీసులు మోహరింపు
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత పది రోజులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అనూహ్యంగా రైతు సంఘాల మద్దతు లభించింది. ఈ మేరకు రెజ్లర్లకు మద్దతుగా పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తారని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో ఆదివారం దేశ రాజధానిలో వేలాదిమంది రైతులు ఆ రెజ్లర్ల నిరసనకు సంఘీభాం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న రైతుల బృందాన్ని టిక్రి సరిహద్దుల వద్దే ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసులు మోహరించడమే గాక భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేగాదు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు, పెట్రోలింగ్‌ను పెంచారు. అలాగే చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఢిల్లీని కలిపే హర్యానా, పంజాబ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్లను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు చెలరేగకుండా భారీగా బలగాలు మోహరించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా భారత రెజ్లర్లు తమకు న్యాయం జరిగేంత వరకు వెనుదిరిగేదే లేదని తెగేసి చెప్పారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా తొలగించి కటకటాల వెనక్కినెట్టే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారికి భారీగా రైతు సంఘాల నుంచి ఊహించని రీతీలో మద్దతు లభించింది. కాగా, వారంతా కేంద్రం రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు సంఘాలు కావడం గమనార్హం. VIDEO | A group of farmers trying to enter Delhi to join wrestlers' protest at Jantar Mantar stopped by police at Tikri Border. pic.twitter.com/3L8WyKWgQu — Press Trust of India (@PTI_News) May 7, 2023 (చదవండి: పెళ్లి పూర్తయ్యే టైంలో సినిమాని తలపించే సీన్..అర్థాంతరంగా పెళ్లిని ఆపేసిన వరుడు) -
రెజ్లర్ల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్న దీక్షా స్థలి ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్ర బిందువైంది. రెజ్లర్లు, వారికి మద్దతుగా వచ్చిన ఆప్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, చివరకు తోపులాట, ఘర్షణకు దారితీసింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దీక్షా శిబిరం వద్ద వర్షాలతో రెజ్లర్లు వినియోగిస్తున్న పరుపులు తడిసి ముద్దయ్యాయి. వారికి సాయపడేందుకు కొన్ని చెక్క మంచాలను ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి తన కార్యకర్తలతో తెప్పించారు. వాటిని రెజ్లర్లకు ఇచ్చేందుకు అనుమతించేది లేదని, జంతర్‌మంతర్‌ను శాశ్వత దీక్షాశిబిరంగా మార్చేందుకు అనుమతులు లేవని అక్కడే మొహరించిన పోలీసులు తెగేసి చెప్పారు. అయినా సరే కొన్ని మంచాలను రెజ్లర్లకు కార్యకర్తలు ఇవ్వడం, వాటిని రెజ్లర్లు శిబిరంలోకి తీసుకెళ్తుండటంతో పోలీసులు, ఆప్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. తమకు సాయపడేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో రెజ్లర్లు వారితో వాదనకు దిగారు. దీంతో రెజ్లర్లు, కార్యకర్తలను నిలువరించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు బలప్రయోగం చేశారు. ఇరువర్గాల వాదనలు చివరకు తోపులాటలు, ఘర్షణకు దారితీశాయి. ఈ ఘటనలో రాహుల్ యాదవ్, దుష్యంత్ ఫొగాట్‌సహా పలువురు రెజ్లర్లకు గాయాలయ్యాయి. వినేశ్ ఫొగాట్ కంటతడి నన్ను తిట్టారు. నేలకు పడేశారు. పురుష పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారు. ఒక్క మహిళా పోలీసు అయినా ఉన్నారా ఇక్కడ?. మమ్మల్ని చంపేద్దామనుకుంటున్నారా? చంపేయండి. ఇలాంటి రోజు కోసమేనా మేం దేశం కోసం పతకాలు సాధించింది? అంటూ ప్రముఖ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ కన్నీరు పెట్టుకున్నారు. తాము సాధించిన పతకాలు, కేంద్రం ఇచ్చిన అవార్డులు, పద్మశ్రీ అన్నీ వెనక్కి ఇస్తామని రెజ్లర్లు హెచ్చరించారు. విపక్షాల తీవ్ర ఆగ్రహం రెజ్లర్లపై పోలీసుల దాడి దారుణమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ‘ఆటగాళ్లపై పోలీసుల దాడి సిగ్గు చేటు. సమాఖ్య చీఫ్ శరణ్‌ను ఆ పదవి నుంచి మోదీ తొలగించాలి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘కోర్టు పర్యవేక్షణలో ఘటనపై దర్యాప్తు జరగాలి. కనీసం ఘటనాస్థలికి వెళ్లి మోదీ రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించాలి’ అని కాంగ్రెస్ డిమాండ్చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితర నేతలూ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. -
Indian Wrestlers' Protest: విమర్శలపాలై.. ఆలస్యంగానైనా వచ్చిన ఉష! కానీ చేదు అనుభవం!?
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై తాము చేసిన లైంగిక ఆరోపణల విషయంలో మహిళా రెజ్లర్లు తమ వాదనలకు సంబంధించి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే తాము ఈ సమాచారాన్ని గురువారం సీల్డ్ కవర్లో అందిస్తామని ఏడుగురు రెజ్లర్లు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన బెంచీ దీనికి అంగీకరించింది. ఈ అఫిడవిట్ కాపీని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కూడా అందించేందుకు తాము సిద్ధమని, అయితే దీనిని బహిరంగపర్చవద్దని రెజ్లర్ల తరఫు న్యాయవాది కోరారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది కాబట్టి విచారణాధికారికి మాత్రం దీనిని అందించవచ్చా అని మెహతా అడగ్గా... అభ్యంతరం లేదని బెంచీ సభ్యులు స్పష్టం చేశారు. గత శుక్రవారం బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. హామీ ఏమీ లేదు! భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష ఎట్టకేలకు రెజ్లర్లను కలిసింది. గత వారం రెజ్లర్ల నిరసన కారణంగా దేశం పరువు పోతోందంటూ వ్యాఖ్య చేసి విమర్శలపాలైన ఉష తాజా భేటీ ఆసక్తిని రేపింది. వారితో ఏం చర్చించిందనే అంశంపై పూర్తి స్పష్టత లేకున్నా... అధికారికంగా ఐఓఏ అధ్యక్షురాలి హోదాలో ఉష నుంచి రెజ్లర్లకు ఎలాంటి హామీ మాత్రం లభించలేదు. పీటీ ఉషకు చేదు అనుభవం ‘ఆలస్యంగానైనా ఉష ఇక్కడకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఐఓఏ అధ్యక్షురాలికంటే ముందు తాను అథ్లెట్‌నని ఆమె చెప్పారు. మాకు న్యాయం కావాలని, రెజ్లింగ్ మేలు కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పాం. మా పరిస్థితి చూస్తే బాధేస్తుందంటూ సంఘీభావం తెలిపారు. అయితే తక్షణ పరిష్కారం గురించి మాత్రం ఆమె ఏమీ చెప్పలేదు’ అని రెజ్లర్లు వెల్లడించారు. మరోవైపు ఉషపై ఒక మహిళ దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఉషపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంపదెబ్బ కొట్టినట్లుగా ఒక వీడియో కనిపిస్తున్నా... దానిపై స్పష్టత లేదు. మరోవైపు బుధవారం రాత్రి రెజ్లర్లు నిరసన చేస్తున్న జంతర్ మంతర్ వద్దకు ఢిల్లీ పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి రెజ్లర్లను తరలించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, రెజ్లర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చదవండి: ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అథ్లెట్.. 32 ఏళ్ల టోరి బోవి హఠాన్మరణం The Castiest frauds asked their Castiest goons to attack Legendary PT Usha at Jantar Mantar Whole Wrestling protest at jantar mantar is a propaganda and all of them are Liars and frauds pic.twitter.com/Fysm2yAp7d — Khushi Singh (@KhushiViews) May 3, 2023 -
Vinesh Phogat: ఇలాంటివి చూసేందుకే పతకాలు సాధించామా?
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత్ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి జంతర్‌మంతర్ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్ల నిరసను ఆపించి, తరలించేందుకు భారీ సంఖ్యలో ఢిల్లీ పోలీసులు జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో వర్షం కారణంగా వారి పరుపులు తడిచిపోవడంతో బయటనుంచి మరికొన్నింటిని తీసుకొచ్చేందుకు యత్నించగా అందుకు పోలీసులు అంగీకరించలేదు. మేము నేరస్తులం కాదు.. ఈక్రమంలోనే బృందంలోని కొంతమంది సభ్యులను ఢిల్లీ పోలీసులు దూషించారు. దీంతో పోలీసులు, రెజ్లర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ మేరకు రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇలాంటి రోజులు చూడటానికేనా! తాము పతకాలు సాధించింది? అంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ సందర్భంగా వినేష్ ఉద్వేగంగా మాట్లాడుతూ.. మాపై ఇలా పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి తామేమి నేరస్తులం కాదంటూ మండిపడ్డారు. ఘటనా స్థలంలో మహిళా పోలీసులు లేకపోవడంపై నిలదీశారు. ఓ పోలీసు అధికారి తాగిన మద్యం మత్తులో దుర్భాషలాడి, తమపై దాడి చేశారని ఆరోపణలు చేశారు. Watch | "Did We Win Medals To See Such Days?" Wrestler Vinesh Phogat Breaks Down pic.twitter.com/NXOrAZwfPA — NDTV (@ndtv) May 3, 2023 ఆప్ నేత అరెస్టు! ఈ క్రమంలో రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో నాలుగు పతకాలు గెలుచుకున్న బజరంగ్ పునియా ఉద్వేగభరితంగా తన పతకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాని అని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా భారతి మంచాలు తీసుకొచ్చేందుకు యత్నించారని, దూకుడుగా ప్రవర్తించారని అందుకే ఆయనతోపాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం జంతర్ మంతర్ ప్రాంతాన్ని సీల్ చేశారు. రెజ్లర్లను పరామర్శించేందుకు వస్తున్న ప్రతిపక్షాల హాజరును నమోదు చేసి మరీ నిరసన ప్రాంతానికి అనుమతించకుండా, రెజ్లర్లను కలవకుండా అడ్డుకున్నారు. కాగా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఏడుగురు మహిళ రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేశారు. అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తదనంతరం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: కోపంలో నోరు జారిన పోలీసు..సెకనులో టెర్రరిస్టుగా మారుస్తా! అని బెదిరింపులు) #WATCH | Delhi: A scuffle breaks out between protesting wrestlers and Delhi Police at Jantar Mantar pic.twitter.com/gzPJiPYuUU — ANI (@ANI) May 3, 2023 -
అతనికి ఎదురు నిలబడటం కష్టం! కేంద్ర క్రీడా మంత్రిపై ఆరోపణలు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత్ రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత ఏస్ రెజ్లర్ వినేష్ ఫోగట్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న శక్తిమంతమైన వ్యక్తికి చాలా కాలం పాటు వ్యతిరేకంగా నిలబడటం చాలా కష్టం అన్నారు. తాము నిరసన ప్రారంభించడానికి మూడు, నాలుగు నెలల ముందు ఆ అధికారిని కలిశామని చెప్పారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మహిళా అథ్లెట్లు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆవేదనకు గురవుతున్నామని ఆ అధికారికి వివరించి చెప్పామన్నారు. ఆ తర్వాత తాము నిరసనకు దిగిమని వెల్లడించింది వినేష్. ఈనేపథ్యంలోనే కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాగూర్‌పై ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు వినేష్. కమిటీ వేసి విషయాన్ని అణిచివేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. మేము ఆయనతో మాట్లాడాకే నిరసనకు దిగినట్లు చెప్పారు. ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా రెజ్లర్ బజరంగ్ పునియా ఒలింపిక్స్ ఎంపికకు సంబంధించిన కొత్త నిబంధన విషయమై నిసనలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఒలింపిక్స్ గురించి కాదని తాము లైంగిక వేధింపులకు వ్యతిరేకంగానే నిరసన చేస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాత్రం తాను రాజీనామా చేస్తే ఆరోపణలను అంగీకరించినట్లువుతుందన్నారు. అందుకు స్పందించిన వినేష్ ఫోగట్ తమకు కావాల్సింది న్యాయం అన్నారు. అతేగాదు మా మన్ కీ బాత్ వినండి మోదీ అని వినేష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆఖరికి స్మృతి ఇరానీ కూడా మా గోడు వినడం లేదని ఆవేదనగా చెప్పారు. కాగా, ఇప్పటికే ఈ విషయమై బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: "న్యాయం మీ అంగీకారం కోసం వేచి ఉంది!": ప్రియాంక గాంధీ) -
దీక్ష చేస్తున్న మహిళా రెజ్లర్లకు కాంగ్రెస్ మద్దతు
-
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం చేస్తాం
-
మోదీ ప్రభుత్వం తలుచుకుంటే ఈ బిల్లు పాస్ అవుతుంది: కవిత
Live Updates.. ► మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నేడు ప్రారంభించిన ఈ పోరాటం ఇంకా ఉధృతమవుతుందన్నారు. డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు తమ పోరాటం సాగుతుందని తెలిపారు. తాము చేపట్టిన ఆందోళన ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని తెలిపారు. తమ దీక్షలకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. మోదీ ప్రభుత్వం తలుచుకుంటే ఈ బిల్లు పాస్ అవుతుందన్నారు. రాష్ట్రపతికి కూడా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ► మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిందే. ఎమ్మెల్సీ కవితకు దీక్షకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుంది. బిల్లు వస్తే ప్రతీ ఆడపిల్లకు రిజర్వేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ► ఎమ్మెల్సీ కవిత దీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మద్దతు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ధర్నాకు సంజయ్ సింగ్ హాజరయ్యారు. ► సీతారాం ఏచూరి.. కవిత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మహిళల కోసం ముందడుగు వేశారు. బిల్లు ఆమోదం పొందే వరకు మా మద్దతు కొనసాగుతుంది. 30 సంవత్సరాల నుంచి ఈ బిల్లు పెండింగ్‌లో ఉంది. ► మహిళలు రాజకీయంగా, సామజికంగా, ఆర్థికంగా ఎదగాలంటే మహిళా బిల్లు అవసరం. రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యింది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. ప్రధాని మోదీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ► మహిళల భాగస్వామ్యం లేనంతవరకు సమాజం ముందుకు సాగదు. మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. తొమ్మిది ఏళ్లు అయ్యింది.. ఇప్పటి వరకు బిల్లును ప్రవేశపెట్టలేదు. ► ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం. మహిళా బిల్లు ఆమోందించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలి. ధరణిలో సగం, ఆకాశంలో సగం ఉన్న మహిళలకు అవకాశాల్లో సగ భాగం కావాలి. అప్పటి వరకు అందరం కలిసి పోరాటం చేస్తామని అన్నారు. ► మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నదని, 1996లో నాటి ప్రధాని దేవేగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని చెప్పారు. అందువల్ల బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. మహిళాబిల్లు ఓ చారిత్రక అవసరమని, సాధించి తీరాలని స్పష్టం చేశారు. ► మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదు. దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామన్నారు. ధరణిలో సగం, ఆకాశంలో సగం అనే తెలుగు నానుడి ఉన్నది. అందుకే అవకాశాల్లోనూ సగం కావాలని కోరుతున్నామని చెప్పారు. ► అంతకుముందు, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసిన మహిళా నేతలను ఈ సందర్బంగా కవిత గుర్తు చేసుకున్నారు. వారిపై ప్రశంసలు కురిపించారు. ► జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష ప్రారంభం. కవితతో పాటుగా దీక్షలో పాల్గొన్న సీతారాం ఏచూరి, మంత్రులు, మహిళా ప్రతినిధులు. Bharat Rashtra Samithi MLC and Telangana CM K Chandrashekar Rao's daughter K Kavitha leads one-day hunger strike in the national capital to seek the introduction of the Women's Reservation Bill in the current Budget session of Parliament. pic.twitter.com/M0oUkAxFEx — ANI (@ANI) March 10, 2023 ► జంతర్ మంతర్ దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత. ► సీపీఐఎం సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించనున్నారు. ► జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎంపీ కవిత మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లకు ఆరోపణలు చేయడం తప్ప వేరే పనిలేదు. బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, చిత్తశుద్ధి పార్లమెంట్లో మహిళ బిల్లుకు ఆమోదం తెలపాలి. బీజేపీకి పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉందన్నారు. మహిళ బిల్లు ఆమోదం పొందే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ అధికారంలోకి రావడానికి అక్కడ బలంగా ఉన్న పార్టీలను బలహీనం చేస్తారు. కానీ, సీఎం కేసీఆర్‌ను తట్టుకోవడం బీజేపీ వల్ల కాదు అంటూ కామెంట్స్ చేశారు. ► సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. మా బాధ్యత మేరకు మేము ఒత్తిడి తీసుకువస్తున్నాము. సభలో ఫుల మెజార్టీ ఉన్నప్పటికీ ఎందుకు బిల్లుకు ఆమోదం తెలపడంలేదని ప్రశ్నించారు. ► జంతర్ మంతర్ వద్దకు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత. సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. ►చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే డిమాండ్ చేస్తూ దీక్షకు దిగుతున్నారు. ► ఈ దీక్షకు భారత జాగృతి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ► ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభమై సాయంత్రం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ► కవిత దీక్షకు 18 రాజకీయ పా ర్ణీలు ఇప్పటికే సంఘీభావం ప్రకటించగా, వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరు కానున్నారు. -
ఢిల్లీ జంతర్ మంతర్ లో కవిత దీక్ష
-
సీతారాం ఏచూరిని కలిసిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి, ఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో గురువారం కలిశారు. ఆయనను జంతర్ మంతర్ వద్ద దీక్షకు ఆహ్వానించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ, దేశంలో పరిస్థితులు, మహిళా రిజర్వేషన్ బిల్లు రావాల్సిన ఆవశ్యకతపై చర్చించామన్నారు. ఎస్పీ, ఆర్జేడీ పార్టీలకు ప్రాథమికంగా మహిళ రిజర్వేషన్లపై ఎలాంటి అభ్యంతరం లేదని కవిత అన్నారు. ‘‘మజ్లిస్ పార్టీని కూడా ధర్నాకు ఆహ్వానించాం. బిల్లు పెడితే అన్ని అంశాలు పరిష్కరించుకునే అవకాశం ఉంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. 18 పార్టీలకు చెందిన నేతల ప్రతినిధులు రేపు హాజరుకానున్నారు. కాలేజీలు, యూనివర్సిటీలో బిల్లు ప్రాముఖ్యత వివరిస్తాము. మహిళా బిల్లు వల్ల ఎవరికీ నష్టం లేదు. బిల్లు పెట్టే బీజేపీ చిత్తశుద్ధి నెరవేర్చుకోవాలి. బీజేపీ హైదరాబాద్ దీక్ష చేపడుతుందంటే.. ఢిల్లీలో నా దీక్ష సక్సెస్ అయ్యనట్టే కదా.. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేలా బండి సంజయ్, కిషన్ రెడ్డి చూడాలి’’ అని కవిత అన్నారు. ‘‘మార్చి 2న నేను దీక్ష చేస్తామని ప్రకటించాను. నాకు ధైర్యం ఉంది. 9 వతేదీన రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.. నేను 11ను వస్తాను అని తెలియజేశాను. బీఎల్ సంతోష్ ఎందుకు సిట్ ఎదుటకు రారు. కోర్టు స్టేలు తెచ్చుకున్న వ్యక్తులు మాట్లాడితే ఎలా?. ఈడీ ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తా. వెళ్లాల్సిన సమయంలో కోర్టుకు వెళ్తాం’’ అని కవిత పేర్కొన్నారు. చదవండి: ఈడీ విచారణకు కవిత.. అరెస్ట్ తప్పదా?.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితి ఏంటి? -
రేపు హాజరు కాలేను.. ఈడీకి కవిత లేఖ
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీకి ఎమ్మెల్సీ కవిత.. లేఖ రాశారు. రేపటి విచారణను హాజరు కాలేనని లేఖ కవిత పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈడీ విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలో ఈడీకి కవిత లేఖను రాశారు. లేఖలో భాగంగా రేపు(గురువారం) ఈడీ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. కాగా, ఈనెల 15వ లేదీన హాజరు అవుతానని లేఖలో వెల్లడించారు. ఈనెల 10వ తేదీన జంతర్‌మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయిన కారణంగా హాజరు కాలేనని తెలిపారు. అందుకే సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ స్పందనపై ఉత్కంఠ నెలకొంది. ఇక, ధర్నా కోసం రేపు మధ్యాహ్నం కవిత ఢిల్లీలోకి వెళ్లనున్నారు. ఎల్లుండి జంతర్ మంతర్ వద్ద కవిత ధర్నాలో పాల్గొననున్నారు. -
మన క్రీడాకారిణులకు బాసట ఏది?
బుధవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్రశ్రేణి భారతీయ మహిళా రెజ్లర్లు... భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు భ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు చేశారు. తమను ఆయన లైంగికంగా వేధిస్తున్నారనీ, నిరంకుశంగా వ్యవ హరిస్తున్నారనేవి వారి ఆరోపణలు. ఈ ఉదంతం భారత క్రీడారంగంలోని మురికిని మరోసారి ఎత్తిచూపింది. క్రీడా సంస్థల నాయకత్వంలో ఉన్న పురుషాధిపత్యం, రాజకీయాలతో వారికున్న అవినాభావ సంబంధాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. ఆ మధ్య హరియాణా క్రీడా మంత్రి, భారత హాకీ మాజీ క్రీడాకారుడు అయిన సందీప్ సింగ్‌పై మరో ప్రముఖ అథ్లెట్, మహిళా కోచ్ చండీగఢ్‌లో చేసిన ఆరోపణలూ దాదాపూ ఇటువంటివే. క్రీడాకారిణులకు మద్దతు ఇవ్వడమే తమ విధిగా ఉండాల్సిన మన క్రీడాధికారులు వాస్తవానికి తమ రాజకీయ బలాన్ని వారిని వేధించడానికి అనుకూలంగా మలచుకుంటున్నారు. తమ వేధింపులను ఎదిరించినవారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు. కుటుంబపరమైన మద్దతు ఏమాత్రం లేకుండా నెలలు, సంవత్సరాల తరబడి శిక్షణ పొందుతూ... రక్తం, చెమట, కన్నీళ్లను పణంగా పెడుతున్న మహిళలు వీరు. వీరికి మరో వృత్తిని ఎంచుకునే అవకాశమూ ఉండదు. అవినీతి పరులైన అధికారుల చేతుల్లో వీరు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. విషాదకరమైన విషయం ఏమిటంటే, క్రీడల్లో మహిళలపై వేధింపునకు సంబంధించి ఇటీవల వెలికివస్తున్న కేసులు నిజానికి సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే. మహిళా రెజ్లర్లు తమ ప్రెస్ కాన్ఫ రెన్సులో ఎత్తి చూపినట్లుగా ఈ ప్రత్యేక సమస్యకు సంబంధించిన నిజమైన రూపం చాలా భారీ స్థాయిలో, అంత్యంత సంక్లిష్టంగా ఉంటోంది. క్రీడాకారిణులు చేస్తున్న ఫిర్యాదులను స్వీకరించడానికి ఇంతవరకు నెలకొల్పిన సమస్యా పరిష్కార నిబంధనలు ఏమాత్రం తమ ప్రభావం చూపలేదని స్పష్టమవుతోంది. పైగా తమను వేధింపులకు గురి చేస్తున్న వారి గురించి బయటపడి ఫిర్యాదు చేయడానికి ఇవి మహిళల్లో ఏమాత్రం విశ్వాసం కలిగించలేదని కూడా స్పష్టమవుతోంది. వందలాది క్రీడాకారిణులు మౌనంగా ఉంటూ అధికారులకు లోబడి ఉండటానికి ప్రధాన కారణం వారు క్రీడల నుంచి బయటపడటానికి మరొక అవకాశం లేకపోవడమేనని చెప్పాలి. శక్తిమంతులైన రాజకీయ నియామకాల ద్వారా పదవుల్లోకి వచ్చి రాజకీయ సంరక్షణలో ఉంటున్న వారికి వ్యతిరేకంగా పోరాడటం అంత సులభం కాదని మహిళా అథ్లెట్లు, వారి కుటుంబాలకు బాగా తెలుసు. ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పాల్సి ఉంది. మన అంతర్జాతీయ క్రీడాకారిణులలో చాలామంది తమను సపోర్టు చేయడానికి తమ కుటుంబాలు తమ వనరులను మొత్తంగా వెచ్చిస్తున్నారని చెబుతూ వచ్చారు. అధికారిక ప్రవేశ ద్వారాలను వారి ముఖాలమీదే మూసివేసిన సమయంలో, జంతర్ మంతర్ వద్ద మన మహిళా రెజ్లర్ల ప్రెస్ కాన్ఫరెన్స్ని చూస్తున్నప్పుడు... కీలకమైన ప్రాక్టీస్ సీజన్లో ఇలా బయటికి వచ్చారంటే వారు ఎంత నిస్పృహకు గురై ఉంటారో కదా అని చూసేవారికి బాధ, ఆగ్రహం కలుగుతాయి. హరియాణాలో సైతం ఆ జూనియర్ మహిళా కోచ్ రాష్ట్ర క్రీడా మంత్రికి వ్యతిరేకంగా న్యాయం పొందడానికి ఒకచోటు నుంచి మరొక చోటుకి పరుగులు తీశారు. కానీ హరియాణా ప్రభుత్వం మాత్రం నిందితుడి పక్షానే నిలిచింది. ఆ రకంగా మహిళా క్రీడా కమ్యూ నిటీ మొత్తానికి అది ప్రతికూల సందేశాన్ని అందించింది. ఆరోపణలకు గురైనవారు, వారి రాజకీయ ప్రభుత్వ యంత్రాంగానికి చెందినవారు బాధితురాలినే అవమానిస్తున్నారు. పైగా లైంగిక వేధింపు కేసుల వల్ల ఆపాదించబడే సామాజిక కళంకాన్ని భరిస్తూ... తమ కెరీర్‌నే నిలిపివేయగలిగిన విధ్వంసకరమైన అధికారాన్ని చలాయిస్తున్న మొత్తం అధికార యంత్రాంగాన్ని ఒంటరి బాధితురాలు ఎదురించి నిలబడటం చాలా కష్టం కూడా. 1990లలో నాటి టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు, హరియాణా పోలీస్ ఐజీ ఎస్పీఎస్ రాథోడ్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన టెన్నిస్ క్రీడాకారిణి రుచికా గిర్హోత్రాకు చెందిన ముఖ్యమైన ఉదంతాన్ని మననం చేసు కోవలసి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగానూ, అనేక కుల ప్రాతిపదిక సంస్థలు ఆనాడు నిందితుడి పక్షానే నిలబడ్డాయి. ఆరోపణకు గురైన రాథోడ్ నిజానికి ప్రమోషన్ పొంది హరియాణా డీజీపీ అయ్యారు. తీవ్రమైన శత్రుపూరిత వాతావరణంలో రుచిక తన జీవి తాన్నే ముగించుకున్నారు. న్యాయం కోసం కుటుంబం సాగించిన పోరా టంలో ఆమె తండ్రి కూడా మరణించారు. ఆమె సోదరుడు జనం కంట పడకుండా ఎంతో దూరంలో జీవితం గడపాల్సి వచ్చింది. ఆమె సన్ని హిత మిత్రుడి కుటుంబం, ఇతర మహిళా సంస్థలు ఎంతో శ్రమ కోర్చి ఈ కేసును ప్రతి స్థాయిలోనూ ముందుకు తీసుకెళుతూ 19 ఏళ్ల పాటు పోరాడారు. అయినప్పటికీ నిందితుడైన రాథోడ్ ఆరునెలల జైలు శిక్షను, వెయ్యి రూపాయలు జరిమానాను మాత్రమే పొందాడు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే నాటి నుంచి నేటివరకు మన క్రీడాకారిణుల జీవితాల్లో పెద్దగా మార్పు లేదు. తన జీవితాన్ని ముగించుకోవాలనే నిస్పృహతో కూడిన ఆలోచనల గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన వినేశ్ ఫోగాట్ దీన వదనం చూసి దేశ ప్రజలు, ముఖ్యంగా క్రీడా సమాజం దిగ్భ్రాంతి చెంది ఉండాలి. ఈ రెండు కేసు ల్లోనూ ప్రసుతం అధికారంలో ఉన్న బీజేపీని, క్రీడాధికారులను తప్పక కఠిన ప్రశ్నలు వేసితీరాలి. క్రీడాకారిణులు పతకాలు తీసుక వస్తున్నప్పుడు వారు సాధించిన ఉజ్వల కీర్తిని తమ సొంతం చేసుకుని మురిసిపోవడంలో రాజకీయ నేతలు, క్రీడా సమాఖ్య అధిపతులు ముందు ఉంటున్నారు. కానీ మరోవైపున తమకు జరుగుతున్న అన్యా యానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి క్రీడాకారిణులు ప్రయత్నించిన ప్రతిసారీ ఏమాత్రం సిగ్గూ శరమూ లేకుండా నిందితులనే కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. వీరందరూ ఇప్పుడు సమాధానం చెప్పి తీరాలి. క్రీడాకారిణులను వేధించిన కేసుల్లో అవసరమైన సమర్థ న్యాయ ప్రక్రియను తక్షణం ఏర్పర్చాల్సిన అవసరం ఉంది. అత్యున్నత స్థాయు ల్లోని క్రీడా విభాగాలు, సమాఖ్యలు, ప్రభుత్వ క్రీడా విభాగాలు అన్నింటిలో లైంగిక వేధింపులకు వ్యతిరేక కమిటీలను తప్పక ఏర్పర్చాలి. ఈ ప్రక్రియను అనుసరించనప్పుడు, సంబంధిత అధికారులనే జవాబుదారీగా చేయాలి. మైదానంలో అత్యున్నతంగా పోరాడుతూనే తమకు న్యాయం జరగాలని గట్టిగా పోరాడుతున్న మన క్రీడాకారిణులకు సంఘీ భావం పలకడం ఈ దేశంలో క్రీడలను ప్రేమించే ప్రతి ఒక్కరి బాధ్యత. - జగ్మతి సాంగ్వాన్ వాలీబాల్ క్రీడాకారిణి, ‘ఐద్వా’ జాతీయ ఉపాధ్యక్షురాలు (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
Mahapanchayat: ఢిల్లీలో తికాయత్ నిర్బంధం.. భారీ భద్రత
న్యూఢిల్లీ: రైతు సంఘాల సమాఖ్య ఎస్కేఎం సోమవారం(ఇవాళ) జంతర్‌మంతర్‌లో మహాపంచాయత్ తలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. నిరుద్యోగ సమస్యపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్‌ను ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మధు విహార్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, తిరిగి వెళ్లిపోవాల్సిందిగా కోరినట్లు ఆయన్ను కోరినట్లు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(శాంతి భద్రతలు) దేపేంద్ర పాఠక్ చెప్పారు. ఆయన అంగీకరించడంతో పోలీసు భద్రతతో వెనక్కి పంపినట్లు వివరించారు. దేశ రాజధానిలో అనవసరంగా గుమిగూడటాన్ని నివారించడానికే తికాయత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. రైతు గళం వినిపించకుండా చేసేందుకు కేంద్రం ఆదేశాల మేరకే ఢిల్లీ పోలీసులు తనను నిర్బంధంలోకి తీసుకున్నారని తికాయత్ ఆరోపించారు. ఇది మరో విప్లవానికి నాంది కానుందని, తమ పోరాటం ఆపేది లేదని ఆయన ట్వీట్ చేశారు. తికాయత్‌ను నిర్బంధించడాన్ని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఖండించారు. ఇదీ చదవండి: చెప్పుతో కొట్టి.. పరారయ్యాడు! -
Agnipath Scheme: కాంగ్రెస్ సత్యాగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ సత్యాగ్రహం చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆదివారం నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా మాట్లాడుతూ... నకిలీ జాతీయవాదులను, నకిలీ దేశభక్తులను గుర్తించాలని యువతకు పిలుపునిచ్చారు. అసలైన దేశభక్తిని ప్రదర్శించే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. జైరాం రమేష్, రాజీవ్ శుక్లా, సచిన్ పైలట్, సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ్ సింగ్, హరీశ్ రావత్, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జేడీ శీలం, కొప్పుల రాజు, వంశీచంద్‌రెడ్డి, రుద్రరాజు పాల్గొన్నారు. నేడు కాంగ్రెస్ దేశవ్యాప్త శాంతియుత ర్యాలీలు అగ్నిపథ్ కార్యక్రమంతోపాటు, తమ నేత రాహుల్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా లక్షలాదిగా తమ కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీలు చేపడతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇదే విషయమైన పార్టీ ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. బిహార్‌లో 804 మంది అరెస్ట్ అగ్నిపథ్‌పై హింసాత్మక నిరసనలకు పాల్పడిన 804 మందిని అరెస్ట్ చేసినట్లు బిహార్ పోలీసులు తెలిపారు. 145 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. యూపీలో 34 కేసులు నమోదు చేసి, 387 మందిని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినట్లు గుర్తించిన 35 వాట్సాప్ గ్రూపులపై నిషేధం విధించినట్లు కేంద్రం తెలిపింది. ఆందోళనల కారణంగా దేశవ్యాప్తంగా 483 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. -
మీ నిరసనలతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు చేస్తున్న ధర్నాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర శాంతియుతంగా సత్యాగ్రహం చేయడానికి అనుమతినివ్వాలని రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ‘ఇప్పటికే మీ ధర్నాలతో ఢిల్లీ గళం నొక్కేశారు. ఇంకా నగరం లోపలికి కూడా వస్తారా?’అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిరసన తెలిపే హక్కు ఉండొచ్చు. అదే సమయంలో పౌరులందరికీ నగరంలో స్వేచ్ఛగా, నిర్భయంగా తిరగడానికి సమాన హక్కులుంటాయి. వాటిని కాలరాయకూడదు’అని కోర్టు హితవు పలికింది. జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం రైతులు చేస్తున్న ధర్నాలతో స్థానిక ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదో తెలుసుకున్నారా? అని ప్రశ్నించింది. రైతుల నిరసనలతో ప్రజల ఆస్తులు ధ్వంసమవుతున్నాయని పేర్కొంది. రైతులు ఇప్పటికే సాగు చట్టాలను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, అలాంటప్పుడు మళ్లీ నిరసనలెందుకు? అని ప్రశ్నించింది. కోర్టులపై రైతులు నమ్మకం ఉంచాలని హితవు పలికింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హైకోర్టుని ఆశ్రయించిన రైతులు , దాని సత్వర విచారణకు మళ్లీ కోర్టుకి వెళ్లొచ్చని, ఇలా సత్యాగ్రహాలు చేయడం వల్ల ఒరిగేదేమిటని పేర్కొంది. శాంతియుతంగానే రైతులు నిరసన చేస్తారని రైతు సంఘాల తరఫున హాజరైన లాయర్ ప్రశ్నించగా ఆయనపై విరుచుకుపడింది. ‘శాంతియుతంగా నిరసనలంటే ఏమిటి? మీరు జాతీయ రహదారులను దిగ్బంధిస్తారు. రైళ్లను అడ్డుకుంటారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ శాంతియుత నిరసనలంటే ఎలా?’అని బెంచ్ ప్రశ్నించింది. -
8 నెలలు పూర్తి.. నేడు ‘మహిళా కిసాన్ సంసద్’
-
8 నెలలు పూర్తి.. నేడు ‘మహిళా కిసాన్ సంసద్’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు దేశ రాజధానిలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 26న ప్రారంభమైన రైతుల ఆందోళనలకు నేటితో 8 నెలలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుల దీక్షకు మద్దతుగా మహిళా రైతులు సోమవారం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపనున్నారు. కిసాన్ సంసద్ పేరిట మహిళా రైతులు ఆందోళన చేపట్టనున్నారు. ఈ క్రమంలో కిసాన్ సంయుక్త మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా రైతులకు చెందిన పలు కాన్వాయ్‌లు సోమవారం ఢిల్లీ సరిహద్దులకు చేరుకుని.. మహిళా కిసాన్ సంసద్ పేరిట నిరసన తెలుపుతారు అని పేర్కొంది. భారతీయ వ్యవసాయ రంగంలో మహిళా రైతు పాత్రను ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలియజేస్తాం అని ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా రైతులు జంతర్ మంతర్ వద్ది కిసాన్ పార్లమెంటు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు 200 మంది రైతుల పార్లమెంటు వెలుపల కూర్చుని నిరనస తెలుపుతారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిద్ధూ రైతుల ఉద్యమం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కిసాన్ పార్లమెంటు: ముళ్ల కంచె, మేకులు ఏర్పాటు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపడానికి రైతులకు అనుమతి లభించింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడు నెలలకు పైగా ఉద్యమిస్తున్న రైతులు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సమీపంలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలకు అనుమతి కోరగా... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింఘు బార్డర్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. టిక్రి బార్డర్ వద్ద కూడా సెక్యూరిటీ పెంచారు. రోడ్డు మీద మేకులు పర్చడమే కాక ముళ్ల కంచె కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిసాన్ ఏక్తా మోర్చా సభ్యులు మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నుంచి కిసాన్ పార్లమెంట్ ప్రారంభం అవుతుంది. వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు ప్రతి రోజు 200 మంది రైతులు పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేస్తారు. మా అంతిమ లక్ష్యం నూతన రైతు చట్టాలను రద్దు చేయడమే’’ అని తెలిపారు. మూడో రోజు పార్లమెంట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. నేడు ప్రధానంగా ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదన్న కేంద్రం సమాధానంపై ప్రతిపక్షాల నోటీసులు ఇచ్చాయి. పెగాసెస్ వ్యవహారం పార్లమెంట్‌ను మరోసారి కుదిపేయనుంది. -
జంతర్‌మంతర్ వద్ద రైతుల ధర్నాకు అనుమతి
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపడానికి రైతులకు అనుమతి లభించింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడుల నెలలకు పైగా ఉద్యమిస్తున్న రైతులు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సమీపంలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలకు అనుమతి కోరగా... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. ఢిల్లీ శివార్లలోని సింఘు నుంచి గరిష్టంగా 200 మంది రైతులు బస్సుల్లో పోలీసు ఎస్కార్ట్‌తో జంతర్‌మంతర్‌కు వెళ్లాలని, ప్రతిరోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు అక్కడ నిరసన తెలుపొచ్చని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే ఆగస్టు 13 దాకా సంయుక్త కిసాన్ మోర్చా (రైతు సంఘాల ఉమ్మడి వేదిక) అనుమతి కోరగా.. జులై 22(గురువారం) నుంచి ఆగస్టు 9 వరకు ఎల్జీ అనుమతి మంజూరు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తామని, శాంతియుతంగా ధర్నా చేస్తామని కిసాన్ మోర్చా నుంచి రాతపూర్వక హామీని పోలీసులు కోరారు. ఈ ఏడాది జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీలో హింస చోటుచేసుకున్న తర్వాత ఢిల్లీలో రైతుల నిరసనలకు అనుమతివ్వడం ఇదే తొలిసారి. -
నిందితులను వెంటనే ఉరితీయండి
ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటనలో దోషులను వీలైనంత త్వరగా ఉరితీయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ఈ విషయంలో యూపీ ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు. వారికి విధించే శిక్షతో అలాంటి నేరం చేయాలన్న ఆలోచన కూడా రాకూడదు. ఆ బిడ్డ ఆత్మకు శాంతి లభించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ సీఎం పేర్కొన్నారు. హత్రాస్ నిర్భయ ఘటనపై యూపీ ప్రభుత్వతీరుకు నిరసనగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ,భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరనస ర్యాలీలో పాల్గొన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా వందలాది మంది ప్రజలు నిరసన గళం వినిపించారు. ఇంత దారుణమైన నేరం జరిగినా అక్కడి ప్రభుత్వం స్పందించక పోవడం వారి నేర చరిత్రకు అద్దం పడుతుందని సిపిఐ (ఎం) నాయకుడు సీతారాం ఏచూరీ అన్నారు. యెగి ఆదిత్యనాథ్‌కు అధికారంలో కొనసాగడానికి హక్కు లేదంటూ విమర్శించారు. (యూపీ నిర్భయ పట్ల అమానవీయం) కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెకు తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. (యూపీ సర్కార్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు) -
ఆయనను అరెస్టు చేశారా? ఎక్కడా?
సాక్షి, బెంగళూరు/ న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గుమిగూడారు. సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విధించిన 144 సెక్షన్‌ను ధిక్కరించి మరీ ఎర్రకోట వద్ద ఆందోళనకారులు గుమిగూడారు. ఇక్కడ ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఇక్కడ పెద్దసంఖ్యలో ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రకోట వద్ద స్వరాజ్ అభియాన్ పార్టీ చీఫ్ యోగేంద్ర యాదవ్‌తోసహా పలువుర్ని గురువారం ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని యోగేంద్ర ట్విటర్లో తెలిపారు. వామపక్ష నేతలు డీ రాజా, సీతారాం ఏచూరి, నిలోత్పల్ బసు, బృందా కరత్‌లను కూడా పోలీసులను అరెస్టు చేశారు. ఇటు బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహాను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను పోలీసులు అరెస్టు చేయడంపై గుహా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. అయితే, నిషేధాజ్ఞలను ఉల్లంఘించడంతోనే గుహాతోపాటు నిరసనకారుల్ని అరెస్టు చేశామని బెంగుళూరు సిటీ పోలీసులు తెలిపారు. మరోవైపు గుహా అరెస్టుపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడ్డియూరప్ప ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుహా అరెస్టు గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘ఎక్కడా? కారణం లేకుండా పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. నేను పోలీసులకు వెంటనే ఆదేశాలు ఇస్తాను?’ అని యెడ్డియూరప్ప పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై, గూండాలపై చర్యలు తీసుకోవాలి కానీ, సామాన్య ప్రజలపై చర్యలు తీసుకోకూడదని, అలాంటిది ఏదైనా జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. -
డప్పు దరువులతో.. ‘విప్లవం వర్థిలాలి’
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జామియా మిలియా ముస్లిం యూనివర్సిటీ మహిళా విద్యార్థులు గురువారం నిరసనలతో కదం తొక్కారు. ‘జామియా మహిళల విప్లవం వర్థిల్లాలి’ అంటూ నినాదాలు, పాటలతో హోరెత్తించారు. కాగా, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జామియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై గత ఆదివారం పోలీసులు లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు, పోలీసులు గాయాలపాలయ్యారు. అయితే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని విద్యార్థులు ఆరోపించారు. మహిళా విద్యార్థుల గదుల్లోకి వెళ్లి మరీ బయటకు తరిమికొట్టారని వాపోయారు. కాగా, జామియా విద్యార్థులకు దేశవ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. -
కేంద్రంలో ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని ప్రభుత్వాలు 15 ఏళ్లుగా ఉద్యోగుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయ ని అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మం డిపడింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ధర్నాలో తెలంగాణ, ఏపీ ఎన్జీవో సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు, ఆదాయపన్ను పరిమితి పెంపు, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రధాన డిమాండ్‌గా సాగిన ఈ ధర్నాలో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగుల వ్యతిరేక విధానాలను నేతలు ఎండగట్టారు. తెలంగాణ నుంచి ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఈ ధర్నాలో పాల్గొన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని ఆయన తెలిపారు. కేంద్రంలోని ప్రభుత్వాలు తీసుకుంటున్న వ్యతిరేక విధానాల వల్ల 1.23 లక్షల మంది ఉద్యోగులు నష్టపోతున్నారన్నారు. ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలే ఉండటం వల్ల ఏడాదిలో 3 నెలల జీతాన్ని పన్ను కింద ఉద్యోగులు చెల్లించాల్సి వస్తోం దని పేర్కొన్నారు. అందువల్ల ఉద్యోగులకు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లోపు ఉద్యోగుల పక్షాన నిలిచే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ ధర్నాలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాజేందర్, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ నుంచి ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రవర్ణ రిజర్వేషన్ రాజ్యాంగ స్వభావానికి విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వత్యిరేకిస్తూ బీసీ సంఘాలు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కేంద్రం తీరుపై మండిపడ్డారు. అగ్రకుల పేదల పేరుతో అగ్రకుల ధనికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, చాతుర్వర్ణ వ్యవస్థను శాశ్వతంగా ఉంచేందుకే ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. రాజ్యాంగ మూల స్వభావానికి విరుద్ధంగా ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని అన్నారు. సమానత్వానికి విరుద్ధంగా అగ్రకుల రిజర్వేషన్ల బిల్లు తెచ్చారని విమర్శించారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ నియామకాల్లో 13 పాయింట్ల రిజర్వేషన్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కులాలవారీగా జనగణన శాస్త్రీయంగా జరగాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. అణగారిన వర్గాలను బానిసలుగా అణగదొక్కేందుకే 10 శాతం ఈబీసీ రిజర్వేషన్‌ను తీసుకొచ్చారని మండిపడ్డారు. -
బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్ కృష్ణయ్య
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భం గా సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీసీలకు చట్టసభల్లో 14%, ఉద్యోగాల్లో 9%, వాణిజ్య రంగాల్లో ఒక్క శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉందని వివరించారు. అగ్రకులాల్లో 10% ఉన్న పేదలకు 10 % రిజర్వేషన్లు కల్పించినట్టే బీసీలకు అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. -
రేపు జంతర్‌మంతర్ వద్ద వైఎస్ఆర్సీపీ ధర్నా
-
హోదా కోసం ముందడుగు
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మొదటి నుంచీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడా ఉద్యమం తీవ్రతరమైంది. మొన్న కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. సోమవారం ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుకు జిల్లాలో వివిధ వర్గాలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్.. వామపక్షాలు కూడా దీనిపై గళం విప్పుతున్నాయి. సాక్షి, తిరుపతి : ప్రత్యేక హోదా ఉద్యమంలో మలిపోరుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిలింది. జాతీయస్థాయికి ఏపీ ప్రజల ఆకాంక్షను, సమర నినాదాన్ని వినిపించేందుకు పార్టీ శ్రేణులు ఢిల్లీ బాటపట్టాయి. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకుని సమరోత్సాహంతో ముందుకు అడుగేశాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నారాయణస్వామి, దేశాయ్‌తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సునీల్‌కుమార్, నియోజకవర్గ సమన్వయకర్తలు జంగాలపల్లి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చంద్రమౌళి, ఆదిమూలం, బీరేంద్రవర్మ తదితరులు ఢిల్లీకి పయనమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి 25 నుంచి 30 మంది చొప్పున ఢిల్లీకి వెళ్లారు. వీరిలో కొందరు శుక్రవారం విజయవాడ నుంచి రైల్లో వెళితే... ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కొందరు శనివారం విజయవాడ నుంచి విమానంలో పయనమయ్యారు. మదనపల్లె్ల ఎమ్మెల్యే దేశాయ్‌తిప్పారెడ్డి, పలమనేరు నుంచి రాకేష్‌రెడ్డి బెంగళూరు నుంచి విమానంలో వెళ్లారు. జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు ప్రకాశం జిల్లా నుంచి, ఇంకొందరు తిరుపతి, చిత్తూరు నుంచి రైలు మార్గాన 250 మంది వరకు పయనమయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరెడ్డి ఆదివారం రేణిగుంట నుంచి విమానంలో ఢిళ్లీకి వెళ్లనున్నారు. -
ప్రత్యేక హోదా కోసం మార్చి5న ఢిల్లీలో ధర్నా
-
నిరసనల బహిష్కారం!
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నిరసనలకూ, ధర్నాలకూ, ధిక్కారానికీ, తిరుగు బాటు స్వరాలకూ చిరునామాగా ఉంటున్న న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ సోమవారం నుంచి మూగబోయింది. ఇకపై అక్కడ సభలూ, సమావేశాలూ ఉండవు. ప్రసంగాలు, నినాదాలు, పాటలు వినబడవు. అక్కడ గుమిగూడి గొంతెత్తే జనం వల్ల ఆ ప్రాంతం కాలుష్యమయమైందని... వారి కార్యకలాపాలు పర్యావరణ చట్టా లను ఉల్లంఘిస్తున్నాయని... అందుమూలంగా పౌరహక్కులు నాశనమవుతున్నా యని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)వారు ఈ నెల మొదట్లో అభిప్రాయ పడ్డారు. అయిదువారాల్లో దీన్నంతటినీ చక్కదిద్దాలని ఆదేశించారు. పర్యవసానంగా ఢిల్లీ పోలీసులు ఆందోళనకారులందరినీ వెళ్లగొట్టి అక్కడున్న శిబిరాలనూ, తాత్కాలిక నిర్మాణాలనూ తొలగించి ఇప్పుడంతా ప్రశాంతంగా ఉన్నదని ఎన్జీటీకి నివేదిక సమర్పించారు. జంతర్‌మంతర్‌కు కూతవేటు దూరంలో అధికార ప్రతీక లైన పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ తదితరాలుంటాయి. కానీ దేశంలోని మారు మూల ప్రాంతాల్లో ఏం జరుగుతున్నదో, ఎవరికెలాంటి సమస్యలున్నాయో తెలు సుకోదల్చుకున్నవారికి మాత్రం జంతర్‌మంతరే దర్శనీయ స్థలం. వారు పదిమంది కావొచ్చు... వేయిమంది కావొచ్చు ఆందోళనకారులు తమ తమ భాషల్లో గోడు వెళ్లబోసుకోవడం అక్కడ పరిపాటి. అధికార పీఠానికి దగ్గర్లో గొంతెత్తితే, తమ సమస్యపై అందరి దృష్టీ పడుతుందని, పరిష్కారం సులభమవుతుందని సాధారణ జనం విశ్వసిస్తారు. అందువల్లే మారుమూల ఆదివాసీ గూడేల నుంచి వచ్చే చింకిపాతరాయుళ్లు మొదలుకొని... దేశం కోసం సర్వస్వం ఒడ్డి యుద్ధ రంగంలో పోరాడి రిటైరైన మాజీ సైనికుల వరకూ అందరికందరూ జంతర్‌మంతర్‌ను ఆశ్రయిస్తారు. దళితులు, వెనకబడిన కులాలవారు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, చేతివృత్తుల వారు, కాంట్రాక్టు కార్మికులు– ఇలా అన్ని రకాలవారూ దాన్ని వెదుక్కుంటూ వస్తారు. జంతర్‌మంతర్ అందరూ అనుకునే సంప్రదాయ పద్ధతిలో నిరసనలు జరిగే చోటు కాదు. ఏకకాలంలో బహుళ నిరసనలకు అది చోటిచ్చేది. ఒకచోట పది పదిహేనుమందికి మించరు. మరోచోట వందమంది గుమిగూడ తారు. ఇంకొకచోట అయిదారు వందలమంది చేరి గొంతెత్తుతారు. గత అయి దేళ్లుగా ఒక యువకుడు ‘నేను బతికే ఉన్నానహో...’ అంటూ మెడలో ప్లకార్డు పెట్టు కుని ఒంటరిగా నిరసనకు దిగుతున్నాడు. ఒక దళిత యువతిని పెళ్లాడిన నేరానికి తన కుటుంబమంతా ఏకమై రికార్డుల్లో చనిపోయానని రాయించారని, పర్యవ సానంగా తాను జీవన్మృతుణ్ణి అయ్యానని అంటున్నాడు. ప్రజాస్వామ్యం అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో మాత్రమే ఉండదు. అది నిర సన వ్యక్తం చేయడానికి, నిలదీయడానికి సామాన్యులకు గల హక్కులో ఉంటుంది. దేనిపైన అయినా నిర్భీతిగా వ్యక్తం చేసే అభిప్రాయంలో ఉంటుంది. అధికార పీఠాలపై ఉన్నవారిని మీరు చేస్తున్నది తప్పని చెప్పగల సాహసంలో ఉంటుంది. తెలివైన పాలకులు అసమ్మతికి చోటిస్తారు. తమ పాలన ఎలా ఉన్నదో తెలుసు కోవడానికి నిరసనలు ఉపకరిస్తాయి. కానీ రాను రాను వాటిపై పాలకులు మండి పడుతున్నారు. చిన్నపాటి అసమ్మతిపై కూడా అసహనం ప్రదర్శిస్తున్నారు. వాటి గొంతు నొక్కాలని చూస్తున్నారు. దురదృష్టమేమంటే ఇటీవలికాలంలో న్యాయ స్థానాలు సైతం ఆందోళన చేస్తున్నవారికి ఆసరాగా నిలబడటంలేదు. ఇప్పుడు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు విస్మయం కలిగిస్తాయి. ఎడతెగని నిరసనల కారణంగా అపరిశుభ్రత రాజ్యమేలుతున్నదని, వాతావరణ కాలుష్యం పెరిగిందని, తమకు రాత్రుళ్లు నిద్ర కరువవుతున్నదని, ఆ రహదారివైపు పోవా లంటే నరకంగా మారిందని జంతర్‌మంతర్ వాసులు కొందరు పిటిషన్ దాఖలు చేశారు. నిరసనల ‘కాలుష్యం’ ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకుందుకు ఎన్జీటీ చేసిన ప్రయత్నమేమిటో తెలియదు. దాని ఆదేశాలు చూస్తే పిటిషనర్ల వాదనను యథాతథంగా ఆమోదించినట్టు కనబడుతుంది. ఆందోళన చేయడా నికొచ్చిన వారు కాలకృత్యాలు తీర్చుకోవడం, రోడ్డుపైనే స్నానాలు చేయడం, బట్టలు ఉతు క్కోవడం వంటి పనులతో అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తున్నా రని ఎన్జీటీ బెంచ్ అభిప్రాయపడింది. ఈ అంశాల్లో నగర పాలక సంస్థ చేయదగినవేమిటో, పోలీసు యంత్రాంగం విధించగల పరిమితులేమిటో ఆలోచించాల్సింది. ఎన్జీటీ ఏర్పడిననాడు అది ఇలాంటి ఆదేశాలివ్వగలదని ఎవరూ ఊహించి ఉండరు. ఆ ట్రిబ్యునల్ వచ్చాకే వాయు కాలుష్యం, నదీ కాలుష్యం, ట్రాఫిక్ సమస్య వంటి అంశాలు ప్రముఖంగా చర్చకొస్తున్నాయి. అయితే ఎన్జీటీ వాటిని ఏమేరకు చక్కదిద్దగలిగిందో చెప్పడం మాత్రం కష్టం. తమకు నచ్చని ఆదేశాలను ప్రభుత్వాలు బాహాటంగానే పక్కనబెడుతున్నాయి. చెప్పాలంటే జంతర్‌మంతర్ విషయంలో అది ఇచ్చిన ఆదేశాలను మాత్రమే ఈమధ్యకాలంలో అధికార యంత్రాంగం తు చ తప్పకుండా పాటించింది. స్వాతంత్రోద్యమకాలంలో ఢిల్లీలో ఆజద్ పార్క్, ఫిరోజ్ షా కోట్ల, జమా మసీదు, యమునా తీరం వంటì ఎన్నో నిరసన స్థలాలుండేవి. స్వాతంత్య్రానంతరం పార్లమెంటు సమీపంలోని పటేల్ చౌక్, సంసద్ మార్గ్ ఆందోళనలకు నిలయంగా ఉండేవి. 1966లో గోవధ వ్యతిరేక ఆందోళన హింసాత్మకంగా మారాక పార్లమెం టుకు దగ్గర్లో నిరసన తెలపడాన్ని నిషేధించారు. చివరకది జంతర్‌మంతర్‌లో స్థిరపడింది. ఒక్క జంతర్‌మంతర్ అనే కాదు...హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ప్రాంతంలో కూడా నిరసనలు వినబడకూడదని ఆమధ్య తెలంగాణ సర్కారు నిషే ధించింది. పదిమందికీ తమ గోడు వెళ్లబోసుకుంటే, ప్రభుత్వాలపై అన్నివైపుల నుంచీ ఒత్తిడి వస్తుందని, తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పౌరులు విశ్వ సిస్తారు. అయితే నిరసనలెప్పుడూ సొగసుగా ఉండవు. అవి ‘ఆదర్శవంతం’గా ఉండాలని కోరుకోవడం వృథా. ‘సరైన’ పాలన అందించినప్పుడు వాటంతటవే మాయమవుతాయి. ఈలోగా ఆ నిరసనలను తరిమేయాలనుకోవడం ధర్మం కాదు. -
జంతర్‌మంతర్ వద్ద నిరసనల బహిష్కారం!
-
జంతర్ మంతర్ ఇక ఛూ... మంతర్
సాక్షి, న్యూఢిల్లీ : అనేక ప్రజా పోరాటాలకు, ప్రదర్శనలకు, ధర్నాలకు వేదికగా నిలిచిన ఢిల్లీలోని జంతర్ మంతర్ మైదానం మూగబోతోంది. ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు కూత వేటు దూరంలో ఉండి ప్రజా గళాన్ని ప్రతిధ్వనించిన జంతర్ మంతర్ మసకబారుతోంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు, వ్యక్తులకు పోరాట స్ఫూర్తినిచ్చిన ఈ వేదిక తన పోరాట పంథాను మార్చుకోబోతోంది. ఈ వేదికను మూసివేయాలని, ప్రజా నిరసనలకు ఇక్కడ ఇక ఏ మాత్రం అనుమతులు ఇవ్వరాదని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడమే అందుకు కారణం. వారం రోజుల్లోగా ఈ వేదికను ఖాళీ చేయించాల్సిందిగా నగర పోలీసులకు కూడా ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ఆందోళనలకు రామ్‌లీలా మైదాన్‌ను అనుమతించండని కూడా పేర్కొంది. ఢిల్లీ నగరంలో ప్రజా పోరాటాలు లేదా ఆందోళనలు నిర్వహించేందుకు ప్రధానంగా మూడు వేదికలు ఉన్నాయి. వాటిలో పార్లమెంట్, పాలక భవనాలున్న రైసినా హిల్స్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో జంతర్ మంతర్ మైదానం ఉంది. ఎక్కువ మంది కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఈ మార్గం గుండానే వెళతారు. ఐదువేల మందికి లోపల వచ్చే ప్రజాందోళనలకు ఇక్కడ అనుమతిస్తారు. ఐదు వేల మందికి మించితే రైసినా హిల్స్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్‌లీలా మైదాన్‌లో అనుమతిస్తారు. (సాక్షి)యాభైవేలకు పైగా జనం తరలి వచ్చేదుంటే నగరంలో బురారీ గ్రౌండ్‌ను అనుమతిస్తారు. 1988లో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ భారీ ర్యాలీ తర్వాత నుంచి జంతర్ మంతర్ శాంతియుత ప్రజా పోరాటాలకు వేదికగా గుర్తింపు పొందింది. నాడు భారతీయ కిసాన్ సంఘ్ నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ నాయకత్వాన భారీ రైతులు ర్యాలీ జరిగింది. అప్పుడు లక్షలాదిగా తరలి వచ్చిన రైతులతో బోట్‌క్లబ్, ఇండియా గేట్ మైదానాలు, రాజ్‌పథ్ రోడ్లు కిక్కిర్సి పోయాయి. అంతటి మహార్యాలీకి స్పందించిన అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రైతుల డిమాండ్లన్నింటిని నెరవేర్చింది. అప్పట్లో పార్లమెంట్ వీధిలోకి ప్రజా ప్రదర్శనలు(సాక్షి) అనుమతించే వారు. మంత్రులు లేదా పార్లమెంట్ సభ్యులు ప్రజా ప్రదర్శనల వద్దకు వచ్చి వారి విజ్ఞప్తులు స్వీకరించే వారు. వారి సమస్యల పరిష్కారానికి హామీలిచ్చే వారు. 2003లో తీసుకొచ్చిన పోలీసుల స్టాండింగ్ ఉత్తర్వులతో పరిస్థితి మారిపోయింది. నిత్యం 144 సెక్షన్ అమలు అప్పటి నుంచి పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ప్రధాని కార్యాలయం తదితర ప్రాంతాల్లో 144వ సెక్షన్ కింద నలుగురికి మించి గుమికూడరాదంటూ నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. రెండు నెలలకు మించి ఈ ఉత్తర్వులను పొడిగించరాదు. రాజకీయ వ్యవస్థకు లోబడి చట్టం స్ఫూర్తిని పట్టించుకోని పోలీసు విభాగం ప్రతి రెండు నెలలకోసారి ఈ నిషేధ ఉత్తర్వులను పొడిగిస్తూనే వస్తోంది. గుడ్డిగా ఈ 144వ సెక్షన్ కింద నిషేధ ఉత్తర్వులను అమలు చేయడం తగదని, పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇతర చట్టాలను ఉపయోగించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో(సాక్షి) మాత్రమే ఈ సెక్షన్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని ఆచార్య జగదీశారానాంద అవధూత కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. కోర్టు ఉత్తర్వులను పోలీసులు ఉల్లంఘిస్తున్నారని ప్రజా సంఘాలు కూడా ఈ నిషేధ ఉత్తర్వులను సవాల్ చేయడం లేదు. 2003 నుంచే ముందస్తు అనుమతి 2003 సంవత్సరం నుంచి ప్రజాందోళనలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్టాండింగ్ ఉత్తర్వులు తెలియజేస్తుండడంతో అప్పటి నుంచి ప్రజాందోళనలకు జంతర్ మంతర్ ప్ర«ధాన వేదికైంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ పురుడు పోసుకుంది ఈ వేదికపైనే. ఈ వేదికలో రోజుకు ఎనిమిది నుంచి పది ఆందోళనలు జరుగుతుంటాయి. వాటిలో సమూహాలు ఉంటాయి. వ్యక్తుల ఒంటరి పోరాటాలు ఉంటాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలోనే ఈ మైదానంలో 2,283 ప్రజాందోళనలు కొనసాగాయి. గతేడాది ఇంతకన్నా తక్కువ అంటే, 1,921 ఆందోళనలు కొనసాగాయి. అప్పటి నుంచి ఎవరూ కూడా పార్లమెంట్ వైపు దూసుకుపోయి ఆందోళన చేయాలనుకోవడం లేదు. అలాంటి ప్రయత్నాలు జరిగినా పోలసులు మధ్యలోనే అడ్డుకుంటున్నారు. 2012, డిసెంబర్ 22వ తేదీన మాత్రం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వీధి, ఇండియా గేట్ వరకు ప్రజాందోళన పెల్లుబికింది. నిర్భయను దారుణంగా రేప్ చేసి చంపేసినందుకు అంతటి ఆందోళన చెలరేగింది. ముంబై నగరంలోకూడా... ఢిల్లీ తరహాలోనే ప్రజాందోళనలకు ముంబై నగరంలో కూడా ఆజాద్ మైదాన్ ఉంది. రాష్ట్ర సచివాలయం (మంత్రాలయ)కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. 1992–93లో ముంబైలో పెద్ద ఎత్తున హిందూ, ముస్లిం మధ్యన అల్లర్లు జరగడంతో ముంబై సెంట్రల్ బిజినెస్ జిల్లాలో కూడా నిరంతరంగా 144వ సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాందోళనలను క్రమబద్దీరించాలని, వాటికొక ఓ వేదిక కల్పించాలని ముంబై హైకోర్టు ఆదేశించడంతో ఆజాద్ మైదాన్ అందుకు వేదికయింది. అప్పటి నుంచి ఈ మైదాన్‌లో ఎన్నో ర్యాలీలు జరిగాయి. మరాఠీ క్రాంతి మోర్చా ఈ మైదాన్‌లో నిర్వహించిన ర్యాలీకి ఆరు నుంచి ఎనిమిది లక్షల వరకు ప్రజలు హాజరయ్యారు. ఆందోళన చేయడం హక్కేనా? ఆందోళన చేయడం ప్రజల హక్కు కింద అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం గుర్తించడం లేదు. అయితే పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలోని 21వ అధికరణం ప్రజల శాంతియుత ఆందోళనను ఓ హక్కుగా అనుమతిస్తోంది. అయితే ఈ హక్కు వల్ల ఇతరుల స్వేచ్ఛ, భద్రత, ఆరోగ్యానికి భంగం కలగరాదు. ఈ అంతర్జాతీయ అధికరణం గురించి తెలుసో, తెలియదోగానీ జంతర్ మంతర్ చుట్టుపక్కల(సాక్షి) నివసిస్తున్న ప్రజలు తమకు ధ్వనికాలుష్యం వల్ల, మైదానం చుట్టూ ఆందోళనకారులు చెత్తా చెదారం పడేయం వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయని గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. ఆ ప్రాంతంలో ఉన్నవారంతా ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులే అవడం వల్ల వారి మాటను దృష్టిలో పెట్టుకొని ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. -
మోదీ నన్ను పెళ్లి చేసుకోండి
-
తమిళనాడు రైతుల దీక్ష.. దారుణం
-
తమిళనాడు రైతుల దీక్ష.. దారుణం
సాక్షి, న్యూఢిల్లీ: 40 రోజుల పైగా నిరసనలు చేశారు.. అయినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లైనా అనిపించలేదు. అలసిపోయి కాస్త విరామం తీసుకుని మళ్లీ పోరాటానికి దిగారు. ప్చ్.. లాభం లేకుండా పోయింది. అంతే రోజుకో రూపం దాల్చుతున్న ఆందోళన ఒక్కసారిగా దారుణంగా మారింది. అన్నం పండించే అన్నదాత చివరకు తన మలం తానే తిని ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేశాడు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఇలా నిరసన తెలియజేశారు. దక్షిణ భారత నదుల అనుసంధాన రైతుల జాతీయ సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో పది మంది రైతులు 58 రోజులుగా జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు. ఆదివారం ఉదయం తమ మలాన్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో సేకరించిన రైతులు.. నినాదాలు చేస్తూ తినేశారు. సోమవారం మనిషి మాంసం తింటామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ‘గతంలో 41 రోజులపాటు ఇక్కడ దీక్షలు చేశాం. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మళ్లీ వచ్చాం. మేం అసలు వారి(ప్రభుత్వాలు) కంటికి కనిపించటం లేదా?.’ అని అయ్యాకన్ను ప్రశ్నిస్తున్నారు. నిరసనలు చేపట్టి మంగళవారానికి సరిగ్గా 59 రోజులు పూర్తవుతుంది. అంటే మా నిరసనలకు వంద రోజులు అయినట్లే లెక్క. ఆ రోజు పూర్తి నగ్నంగా ప్రధాని కార్యాలయంకు మార్చి నిర్వహిస్తాం అని ఆయన తెలిపారు. రుణమాఫీ, రూ.4,000 కోట్ల కరువు సాయం, కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు తదితర డిమాండ్లతో మార్చి 14 నుంచి 41 రోజులపాటు జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఆందోళన చేశారు. ఆ తర్వాత తిరిగి నెలన్నర క్రితం మళ్లీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తుండటంతో అర్ద నగ్న, నగ్న ప్రదర్శన, విధవలుగా అవతారం, చనిపోయిన రైతుల పుర్రెలను మెడలో వేసుకొని, అర్థనగ్న ప్రదర్శనలు, ఎలుకలు-పాములు నోట్లో పెట్టుకోవటం.. ఇలా రోజుకో కొత్త రూపంలో నిరసన తెలియజేస్తున్నారు. 140 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గతేడాది అత్యల్ఫ వర్షాపాతం నమోదుకావటంతో భారత వాతావరణ శాఖ తమిళనాడును కరువు రాష్ట్రంగా ప్రకటించింది. దీంతో మద్రాస్ హైకోర్టు రైతులందరికీ రుణ మాఫీ చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే చిన్న, మధ్య తరహా రైతులకు మాత్రమే రుణ మాఫీకి అర్హులను చేయాలంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు స్టే విధించటంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ఇలా చేస్తున్నారు. -
'పుర్రెలు, ఎముకలతో జంతర్‌మంతర్‌కు..'
న్యూఢిల్లీ: తమిళనాడులు రైతులు పుర్రెలు, ఎముకలతో ఢిల్లీ బాటపట్టారు.. రుణమాఫీ కోసం, కరువు భృతికోసం ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 41 రోజులపాటు ఢిల్లీ నడిబొడ్డున సుదీర్ఘ ఆందోళనలు నిర్వహించి వెళ్లిన వారు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరినే ప్రదర్శించడంతో చేసేదేం లేక మరోసారి జంతర్‌మంతర్‌కు చేరారు. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మాత్రం ఎండా వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా తమ సమస్య తీవ్రతను సమాజానికి తెలియజేస్తామని స్పష్టం చేస్తూ పుర్రెలు, ఎముకలతో దీక్షా స్థలికి చేరుకున్నారు. 'వానలు రానీ, ఎండలు కొట్టని మా ఉద్యమం మాత్రం ఈసారి ఆగదు' అని అని నేషనల్ సౌత్ ఇండియన్ రివర్స్ లింకింగ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ అక్కక్కాను చెప్పారు. కనీసం ఈసారి వందమంది రైతులు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి వంద రోజులపాటు ఆందోళన నిర్వహించనున్నారు. తొలుత ఈ వారం ప్రారంభంలో వచ్చిన రైతులు ప్రధాని నివాసం ముందు ఆందోళనకు దిగే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు ఇక జంతర్‌మంతర్ వద్ద ఉద్యమం కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. -
మరో పోరు
దేశ రాజధాని నగరం ఢిల్లీ వేదికగా మరోపోరుకు తమిళ అన్నదాతలు శ్రీకారం చుట్టారు. గోచీతో పీఎంవో వైపుగా అన్నదాతలు పరుగులు తీయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వీరిని పోలీసులు అరెస్టు చేసి, కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. సాక్షి, చెన్నై: కరువుతో తల్లడిల్లు్లతున్న తమిళ రైతులకు అన్ని రకాల రుణాల మాఫీ, కావేరి అభివృద్ధిమండలి, పర్యవేక్షణకమిటీ, నదుల అనుసంధానం, తదితర డి మాండ్లతో మూడు నెలల క్రితం తమిళ రైతులు ఢిల్లీ వేదికగా ఆందోళనలు సాగించిన విషయం తెలిసిందే. 41 రోజుల పాటు రోజుకో రీతిలో వినూత్న నిరసనల్ని సాగించారు. జంతర్‌మంతర్ వేదికగా సాగిన ఈ నిరసనలు దేశంలోని రైతు సంఘాలకు కనువిప్పుగా, ఆదర్శంగా మారింది. తమిళ రైతుల పోరు, దేశవ్యాప్త పోరుకు ఎక్కడ దారి తీస్తుందోనన్న ఆందోళనతో ఆ సమయంలో కంటితుడుపు చర్యగా హామీలు, బుజ్జగింపులకు స్వయంగా సీఎం పళనిస్వామి , కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ రంగంలోకి దిగి సఫలీకృతులయ్యారు. అయితే, తమకు ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించడంతో అన్నదాతలు జీర్ణించుకోలేక పోయాడు. మరోపోరు నినాదంతో మళ్లీ ఢిల్లీ వేదికగా ఆందోళనకు ఆదివారం శ్రీకారం చుట్టారు. ఆందోళన తిరుచ్చి నుంచి చెన్నై మీదుగా శుక్రవారం ఢిల్లీకి రైలులో వంద మంది రైతులు కదిలారు. దక్షిణ భారత నదుల అనుసంధానం సంఘం నేత అయ్యాకన్ను నేతృత్వంలో ఆదివారం ఉదయాన్నే ఢిల్లీలో అన్నదాతలు అడుగు పెట్టారు. దిగీ దిగగానే నేరుగా జంతర్ మంతర్ వద్దకు వెళ్లకుండా పీఎంవో వైపు కదిలారు. మార్గమధ్యలోని ఓ ప్రాంతంలో తమ పంచె, చొక్కాలను విప్పేశారు. గోచీలను ధరించి, ఎముకలు నోట కరుచుకుని పరుగులు తీశారు. వంద మంది రైతులు తమ డిమాండ్లతో నినదిస్తూ పీఎంవో వైపుగా దూసుకొస్తున్న సమాచారంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మార్గమధ్యలో నిరసన కారుల్ని అడ్డుకున్నారు. దీంతో రోడ్డు మీద బైఠాయించి ఆందోళనకు అన్నదాతలు దిగారు. ఆందోళన కారుల్ని బుజ్జగించేందుకు ఢిల్లీ పోలీసులు తీవ్రంగానే ప్రయత్నించారు. ఏమాత్రం రైతన్నలు తగ్గని దృష్ట్యా, ఢిల్లీ పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈక్రమంలో పోలీసులు, అన్నదాతల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. ఉదయాన్నే అల్పాహారం కూడా తీసుకోకుండా నిరసన బాట పట్టడంతో ఈరోడ్‌కు చెందిన జయరామన్, పొల్లాచ్చికి చెందిన బాలసుబ్రమణ్యం అనే రైతులు స్పృహ తప్పారు. అయితే, వీరికి ఎలాంటి చికిత్స అందించకుండా, పార్లమెంట్ రోడ్డు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి అయ్యాకన్ను తమిళ మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కుతగ్గేది లేదని తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు అనుమతి ఇస్తామని, ఇతర ప్రాంతాల్లోకి వస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని, లేని పక్షంలో ఢిల్లీ వదలి వెళ్లి పోవాలని పోలీసులు అన్నదాతల్ని హెచ్చరిస్తున్నారు. అయినా పోలీసుస్టేషన్ ఆవరణలో బైఠాయించి అన్నదాతలు ఆందోళనకొనసాగిస్తున్నారు. -
మూకదాడులపై దేశవ్యాప్త నిరసన
ముంబై/న్యూఢిల్లీ: ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మూకదాడులపై బుధవారం దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వెల్లువెత్తింది. దాడులకు పాల్పడేవారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ వేలాది సాధారణ ప్రజలతోపాటు పలురంగాల ప్రముఖులు రోడ్లెక్కారు. ముంబైలో జరిగిన నిరసనలో సినీతారలు షబానా ఆజ్మీ, కొంకణాసేన్ గుప్తా, రజత్ కపూర్ తదితరులు వర్షాన్ని లెక్కచేయకుండా పాల్గొన్నారు. ‘నా పేరుతో కాకుండా నా తిండి పేరుతో చంపుతున్నారు’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంలో.. రైల్లో హత్యకు గురైన జునైద్ సోదరుడు అసరుద్దీన్, కాంగ్రెస్, లెఫ్ట్ నేతలు పాల్గొన్నారు. మూకదాడులు ఉండని స్వర్గంలో ఉన్నానంటూ జునైద్ తన తల్లికి రాసినట్లు ఓ మిత్రుడు రాసిన లేఖను అసరుద్దీన్ చదివి వినిపించారు. దీంతో అక్కడివారు కన్నీటిపర్యంతమయ్యారు. బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పట్నా, తిరువనంతపురం తదితర నగరాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ ప్రేమ్‌సింగ్ ఈ నెల 25 నుంచి వారం రోజుల నిరాహార దీక్ష ప్రారంభించారు. మరోపక్క.. జునైద్ హత్య కేసులో 50 ఏళ్ల ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి సహా నలుగురిని అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని హరియాణా పోలీసులు తెలిపారు. -
మరో దళిత ఉద్యమం భీం ఆర్మీ
న్యూఢిల్లీ: దిల్లీలో ప్రజాందోళలనకు వేదిక జంతర్ మంతర్ ఆదివారం పది వేల మంది దళితులతో నిండిపోయింది. దళితులు ప్రధానంగా చర్మకారులైన జాటవ్‌ల కొత్త రాజకీయ ఉద్యమం భీం ఆర్మీ నాయకత్వాన ఎవరూ ఊహించని రీతిలో ఇంతటి జన ప్రదర్శన జరగడం ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేవలం రెండేళ్ల క్రితం సహారన్పూర్ జిల్లాలో పుట్టిన దళితుల సమరశీల యువ సైన్యం భీం ఆర్మీ ఇప్పుడు జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తర్‌ప్రదేశ్ షబ్బీర్‌పూర్‌లో మే 9న జరిగిన హింసాకాండకు బాధ్యులనే కారణంతో తమను వెంటాడుతున్న యూపీ పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి పోయిన భీం ఆర్మీ నేతలు ‘అడ్వకేట్’ చంద్రశేఖర్ ఆజాద్(రావణ్), వినయ్‌రతన్‌సింగ్‌లు ఈ జంతర్‌మంతర్ ర్యాలీలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. జేఎన్‌యూ విద్యార్థిసంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యా కుమార్ కూడా చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటు ప్రదర్శనలో కనిపించారు. 350 స్కూళ్లు నడుపుతున్న భీం ఆర్మీ కాలేజీ చదువులు పూర్తి చేసుకుని చంద్రశేఖర్, వినయ్‌రతన్ 2015 జులై 21న భీం ఆర్మీ ప్రారంభ సమావేశం ఏర్పాటుచేశారు. దళితుల పిల్లల కోసం పాఠశాలలు ఆరంభించాలని నిర్ణయించారు. సర్కారీ బడుల్లో అంతంత మాత్రం బోధనతో నష్టపోతున్న దళిత బాలల కోసం సహారన్పూర్ జిల్లా ఫతేపూర్ భాదో గ్రామంలో మొదటి పాఠశాల స్థాపించారు. ఇక్కడ పిల్లలకు తరగతి పాఠాలతోపాటు, అంబేడ్కర్ బోధనలు కూడా వివరిస్తారు. భీం ఆర్మీ స్కూళ్ల సంఖ్య కొద్దికాలంలోనే 350కి చేరుకుంది. అయితే, దళితులపై జరిగే అత్యాచారాలపై పోరాడుతూ, భూస్వామ్య శక్తులను ప్రతిఘటించే క్రమంలో యూపీ పోలీసులు భీం ఆర్మీకి నక్సలైట్లతో సంబంధాలున్నాయని ఆరోపించడమేగాక దాని నేతలపై జాతీయభద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. న్యాయం, తగిన నష్ట పరిహారం షబ్బీర్‌పూర్ దళితవాడపై ఠాకూర్లు జరిపిన దాడి, దహనకాండలో నష్టపోయిన దళితులకు న్యాయం జరిగేలా చూడాలని, ఆస్తి నష్టపోయిన వారికి సవరించిన ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధకచట్టం ప్రకారం తగినంత నష్టపరిహారం చెల్లించాలని మాత్రమే జంతర్‌మంతర్ ర్యాలీకి వచ్చిన దళితులు కోరారు. అంబేడ్కర్ బతికున్న కాలంలోనే అనేక రంగాల్లో పైకొచ్చిన పశ్చిమ యూపీ జిల్లాల నుంచే కొత్త దళిత చైతన్య ఉద్యమం పుట్టుకురావడం సహజమే. అందుకే వేలాదిగా తరలివచ్చిన భీం ఆర్మీ సేనలను పోలీసులు దిల్లీకి రాకుండా అడ్డుకోలేకపోయారు. -
మళ్లీ ఢిల్లీ బాట
► అన్నదాత సిద్ధం ► 18న పయనం ► ఈసారి గోచితో బైటాయింపు ► సీఎంతో అయ్యాకన్ను టీం భేటీ సాక్షి, చెన్నై: అన్నదాతలకు మద్దతుగా రైతు నాయకుడు అయ్యాకన్ను నేతృత్వంలో మళ్లీ ఢిల్లీ వేదికగా పోరుబాట సాగనుంది. ఈనెల 18వ తేదీ రైతులు ఢిల్లీకి బయలు దేరనున్నారు. ఇందులో భాగంగా బుధవారం సీఎంతో అయ్యాకన్ను నేతృత్వంలో ప్రతినిధులు భేటీ అయ్యారు. కరువు కోరల్లో చిక్కి తల్లడిళ్లుతున్న తమిళ రైతును ఆదుకోవాలని నినదిస్తూ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతు సంఘం నేత అయ్యాకన్ను ఢిల్లీ వేదికగా 41 రోజుల పాటుగా సాగించిన పోరుబాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఓ తమిళుడి నేతృత్వంలో వివిధ రూపాల్లో సాగిన ఈ నిరసన చర్చకు దారి తీసింది. ఎట్టకేలకు సీఎం పళనిస్వామి, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా పోరు బాటను గత నెలాఖరులో విరమించారు. ఆ సమయంలో కేంద్రానికి నెల రోజుల పాటుగా గడువు ఇచ్చారు. అంతలోపు తమ డిమాండ్లను నెరవేర్చాలని, తమిళ రైతును ఆదుకునే ప్రకటన చేయాలని విన్నవించారు. అయితే, ఇప్పటి వరకు ఆ దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మళ్లీ పోరుబాటకు అయ్యాకన్ను బృందం సిద్ధమైంది. మళ్లీ ఢిల్లీకి : మళ్లీ ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధపడ్డ అయ్యాకన్ను బృందం ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లేందుకు నిర్ణయించింది. ఆ మేరకు ఉదయం గ్రీన్ వేస్‌రోడ్డులోని ఇంట్లో సీఎంతో భేటీ అయ్యారు. తమ డిమాండ్లను సీఎం ముందు ఉంచారు. మళ్లీ పోరుబాట సాగించనున్నామని స్పష్టం చేసి బయటకు వచ్చారు. ఈసందర్భంగా మీడియాతో అయ్యాకన్ను మాట్లాడుతూ రైతు సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బ్యాంకులు జప్తు నోటీసులు జారీ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ బ్యాంకులు జారీ చేసిన నోటీసులను పరిగణలోకి తీసుకోవాలని, రైతుల్ని ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. చెరకు రైతులకు బకాయిల చెల్లింపునకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఇక, కేంద్రం మీద ఒత్తిడి పెంచే విధంగా మళ్లీ ఢిల్లీ బాటకు సిద్ధమయ్యామని తెలిపారు. ఈనెల 18వ తేదీ చెన్నై నుంచి గోచితో ఢిల్లీకి బయలు దేరనున్నామని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఉన్న మూడు వందలకు పైగా రైతు సంఘాలతో ఇప్పటి నుంచి సంప్రదింపులు జరుపుతున్నామని, వారి మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డట్టు వివరించారు. ఢిల్లీ చేరగానే, అన్ని సంఘాలతో సమావేశం అనంతరం 21వ తేదీ పార్లమెంట్ లేదా, పీఎంవో ముట్టడికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే, జంతర్ మంతర్ వద్ద గోచితో బైఠాయించి నిరసనల మరింత ఉధృతం చేస్తామన్నారు. -
యూరిన్ బాటిల్స్‌తో రైతుల ఆందోళన
న్యూఢిల్లీ: దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల ఆందోళన కొనసాగుతోంది. రుణమాఫీ, కరువు సాయం చేయాలంటూ రోజుకో రూపంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్న రైతులు శనివారం మరోసారి వినూత్నంగా నిరసన తెలిపారు. సమస్యను ఎంత తీవ్రంగా తెలుపుతూ, ఇప్పటికైనా తమను ఆదుకోవాలని.. ‘తమ మూత్రం తామే తాగుతామంటూ’ యూరిన్ బాటిల్ ముందు పెట్టుకుని తమ ఆందోళన ఉధృతం చేశారు. కరువు నిధులను విడుదల చేయాలని, కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో తమిళనాడుకు చెందిన రైతుల బృందం మార్చి 14 నుంచి ఢిల్లీలో నిరసన ప్రదర్శనలను చేస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని రైతులు కరవు కోరల్లో చిక్కుకున్నారని, సాగునీరు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తమని ఆదుకోండి మహాప్రభో అని దీనంగా వేడుకుంటున్నారు. గతంలో రైతులు నగ్నంగా ఆందోళనలు, కపాలాల మాలలు మెడలో ధరించినా, ఎలుకలు, చనిపోయిన పాములను నోట కరిచినా, చీరలు కట్టుకుని నిరసన తెలిపినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. కాగా రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సాయం తమకు సరిపోదంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
చీరలు కట్టుకుని తమిళ రైతుల నిరసన
-
చీరలు కట్టుకుని తమిళ రైతుల నిరసన
న్యూఢిల్లీ: కరవు సాయం కోరుతూ నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న తమిళ రైతులు శుక్రవారం వినూత్నంగా ఆందోళనకు దిగారు. చీలు కట్టుకుని రహదారులపై నడుస్తూ కరవు సాయం మంజూరు చేయండి అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తీవ్ర కరవు పరిస్థితుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలు ఇవేనంటూ వాటిని పట్టుకుని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తామంతా కావేరి నదీమాత బిడ్డలమని, అందుకే చీరలు కట్టుకున్నామని తెలిపారు. -
రైతుల కపాల దీక్షకు కనిమొళి మద్దతు
-
ప్రధాని కరువు సాయం సంపన్నులకే
-
ప్రధాని కరువు సాయం సంపన్నులకే: రాహుల్
న్యూఢిల్లీ: కరువు సాయం కోసం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులను శుక్రవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కలిశారు. రాహుల్ ఇవాళ మధ్యాహ్నం ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకుని తన మద్దతు తెలిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... దేశంలోని సంపన్నులకు మాత్రమే ప్రధానమంత్రి కరువు సాయం అందిస్తున్నారని విమర్శించారు. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతులను విస్మరించడం బాధాకరమన్నారు. రైతులను అన్నివిధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారు. కాగా కరువు ఉపశమన ప్యాకేజీ, రుణ మాఫీ డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత 18 రోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
చచ్చిన పాములను నోట్లో పెట్టుకుని..
న్యూఢిల్లీ: కరువు ఉపశమన ప్యాకేజీ, రుణ మాఫీ డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత 16 రోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. బుధవారం అన్నదాతలు వినూత్నంగా ఆందోళకు దిగారు. కొంత మంది రైతులు చచ్చిపోయిన పాములను నోట్లో పెట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు. ఇంతకుముందు ఎలుకలను నోట్లో పెట్టుకుని నిరసన తెలిపారు. కపాలాలు మెడలో వేసుకుని కూడా ఆందోళన చేశారు. తాము ఎన్నిరకాలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి స్పందన రాకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆందోళన చేస్తున్న రైతులకు తమిళనాడు చెందిన నాయకులు పార్టీలకు అతీతంగా మద్దతు తెల్పుతున్నారు. లోక్‌సభ డీప్యూటీ స్పీకర్ తంబిదురై(ఏఐఏడీఎంకే) మంగళవారం ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకుని సమస్యను వీలైనంత తొందరగా ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సంబంధిత మంత్రులను కలుసుకున్నామని, ఈ విషయాన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తామని ఆయన చెప్పారు. ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదని మొత్తం దేశానిదని అన్నారు. నిరసనలను ఉపసంహరించుకోవాలని కూడా ఆయన రైతులను కోరారు. తంబిదురై వెంట వచ్చిన తమిళనాడు వ్యవసాయ మంత్రి ఆర్.దొరైక్కన్ను... రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వారికి వివరించారు. డీఎంకే రాజ్యసభ సభ్యులు టీకేఎస్ ఎలంగోవన్, ఆర్ఎస్ భారతి, పుదుచ్చేరి సీఎం వి.నారాయణ స్వామి కూడా రైతులకు కలుసుకుని మద్దతు ప్రకటించారు. రైతులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో త్వరలోనే సమావేశం ఏర్పాటుచేస్తామని తమిళ మనీలా కాంగ్రెస్ చీఫ్ జీకే వాసన్ అన్నారు. -
గోడు పట్టదా!
పది రోజులకు పైగా దేశ రాజధాని వేదికగా నిరసనలు సాగిస్తున్నా, పాలకులు తమ గోడును పట్టించుకోక పోవడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జంతర్ మంతర్ వద్ద శనివారం చెట్టుపైకి ఎక్కి దూకేస్తామంటూ ఆత్మహత్యా బెదిరింపులు ఇవ్వడం ఉత్కంఠకు దారి తీసింది. సినీ నటుడు విశాల్ బుజ్జగించడంతో అన్నదాతలు శాంతించారు. ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో విశాల్ భేటీ అయ్యారు. సాక్షి, చెన్నై: నదుల అనుసంధానం, కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ, రుణాల మాఫీ, కరువు సాయం పెంపు, నష్టపరిహారం పెంపు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్ని ఆదుకోవాలన్న పలు డిమాండ్లతో పద కొండు రోజులుగా డెల్టాలోని అన్నదాతలు వంద మంది ఢిల్లీ వేదికగా నిరసనలు సాగిస్తూ వస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నా, ఢిల్లీ పెద్దల్లో ఏ మాత్రం చలనం రాలేదు. అన్నదాతల ఆందోళనల సమాచారంతో సీనీ నటులు విశాల్, ప్రకాష్ రాజ్, రమణ, దర్శకుడు పాండియరాజన్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం రైతులకు మద్దతుగా నిరసనలో పాల్గొనడమే కాకుండా కేంద్రం దృష్టికి డిమాండ్లను తీసుకెళ్లే యత్నం చేశారు. అయినా, పాలకులు తమ గోడును పట్టించుకోక పోవడంతో అన్నదాతల్లో ఆందో ళన బయలు దేరింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆత్మహత్యా బెదిరింపు: పన్నెండో రోజు నిరసనలో జంతర్ మంతర్ వద్ద ఉన్న అతి పెద్ద చెట్టు మీదకు శనివారం ఉదయం ముగ్గురు రైతులు ఎక్కారు. ఇక, ఓపిక నశించిందని, దూకి ఆత్మహత్య చేసుకోనున్నట్టు ప్రకటించారు. దీంతో అక్కడున్న ఇతర రైతుల్లో ఆందోళన బయలు దేరింది. వారిని బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు అక్కడికి చేరుకుని కిందకు దిగాలని హెచ్చరించినా ఫలితం శూన్యం. గంటన్నరకు పైగా అక్కడ ఉత్కంఠ బయలు దేరింది. రైతులు చెట్టు మీదకు ఎక్కి ఆత్మహత్యా బెదిరింపు ఇస్తున్న సమాచారంతో నటుడు విశాల్, ప్రకాష్‌రాజ్ అక్కడికి పరుగులు తీశారు. వారిని బుజ్జగించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు రెండు గంటల అనంతరం ఓ రైతు కిందకు దిగి వచ్చాడు. మరి కాసేపటికి మిగిలిన ఇద్దరు కిందకు వచ్చారు. ఇంత రాద్దాంత జరిగినా, ఢిల్లీ పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. అయితే, ఇక్కడున్న నిరసన కారుల్ని బలవంతంగా తమిళనాడుకు పంపించేందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. అరుణ్ జైట్లీతో భేటీ : ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌లతో విశాల్, ప్రకాష్‌రాజ్‌లతో కూడిన బృందం భేటీ అయ్యాయి. మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. తమిళనాడులోని పరిస్థితులు, అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అన్ని వివరాలతో వినతి పత్రాన్ని సమర్పించారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఢిల్లీలో రోడ్డెక్కిన నటులు
విపరీతమైన కరువుతో బాధపడుతున్న తమిళనాడు రైతులకు మద్దతుగా తమిళ నటులు కూడా రోడ్డెక్కారు. హీరో విశాల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ ఇద్దరూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. అప్పటికే అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న రైతులతో కలిసి జంతర్ మంతర్ వదద్ రోడ్డు మీద కూర్చున్నారు. నల్లటి దుస్తులు వేసుకున్న విశాల్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ కలిసి రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు. రైతులు కూడా మెడలో కపాలాలు ధరించి.. కరువు తీవ్రతను ప్రతిబింబించేలా నిరసన వ్యక్తం చేశారు. రైతుల రోదనలను ఎవరూ వినిపించుకోవడం లేదని, అందుకే ఇక్కడ తీవ్రస్థాయిలో ధర్నా చేస్తున్నామని ప్రకాష్ రాజ్ అన్నారు. తమ నిరసనలతోనైనా సంబంధిత మంత్రులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన చెప్పారు. -
‘మార్చ్ టు పార్లమెంట్’ లో టీఎస్‌యూటీఎఫ్ సభ్యులు
మెదక్ మున్సిపాలిటీ: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ‘‘మార్చ్ టు పార్లమెంట్’’ కార్యక్రమంలో తెలంగాణ యూటీఎఫ్ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ఎస్టీఎఫ్ఐ అనుబంధ సంఘాల ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నట్లు యూటీఎఫ్ మెదక్ కోశాధికారి ఎన్.సుధాకర్ తెలిపారు. సీపీఎస్ రద్దుపై తమ నినాదాలన్ని గట్టిగా వినిపించినట్లు పేర్కొన్నారు. కాగా తెలంగాణ వెరుు్య మంది, ఏపీ నుండి 3వేల మంది పాల్గొన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవి, మెదక్ జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి పద్మారావు, అజయ్, రాందాస్, మల్లేశం, సుధాకర్, ఫయాజ్, రవీందర్‌రెడ్డి, బీమ్లా, హరిబాబు, తిరుపతి, కృష్ణ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. -
గ్రెవాల్ అంత్యక్రియలకు నేతల క్యూ
భివానీ/న్యూఢిల్లీ: ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్’ అంశంలో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న మాజీ జవాను రామ్‌కిషన్ గ్రెవాల్ అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం హరియాణా భివానీలోని బమ్లాలో జరిగాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితర రాజకీయ ప్రముఖులు గ్రెవాల్ అంత్యక్రియలకు క్యూ కట్టారు. మాజీ జవాను కుటుంబ సభ్యులను కలిసిన రాహుల్... తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్ హుడాతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు సెల్జా, కుల్దీప్ బిషోని, కమల్‌నాథ్, రణదీప్ సుర్జేవాలా కార్యక్రమానికి హాజరయ్యారు. రాహుల్ అరెస్టు.. విడుదల: మాజీ జవాను ఆత్మహత్యకు నిరసనగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన రాహుల్‌గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఇండియా గేట్ వైపు వెళుతున్న ర్యాలీని నియంత్రించి రాహుల్‌ను అరెస్టు చేశారు. వ్యానులో ఫిరోజ్ షా రోడ్డు వరకు తీసుకువెళ్లి వదిలిపెట్టారు. గ్రెవాల్ కుటుంబానికి కేజ్రీవాల్ రూ. కోటి నష్టపరిహారాన్ని ప్రకటించారు. -
జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత.. మళ్లీ రాహుల్!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ మాజీ జవాను ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు జంతర్‌మంతర్ వద్ద ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీనిని ప్రతిఘటించడంతో రాహుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ మాజీ జవాను రాంకిషన్ గ్రేవాల్ ఆత్మహత్య గురించి తెలియడంతో బుధవారం ఆయన నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలోనూ రాహుల్‌ని రెండుసార్లు పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ శ్రేణులతోపాటు రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేసి పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి పోలీసు జీపులో తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాహుల్ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
జంతర్ వద్ద చెట్టెక్కి మహిళ హల్చల్
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద ఓ 50 ఏళ్ల మహిళ హల్ చల్ చేసింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ అక్కడ చెట్టు ఎక్కి కూర్చుంది. తన కుమారుడిని చంపిన హంతకులను వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. బిహార్‌కు చెందిన బచ్చా దేవీ (50) అనే మహిళ ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంటోంది. 2015 అక్టోబర్ లో బిహార్ లో తన కుమారుడిని కొందరు వ్యక్తులు హత్య చేశారని, ఆ నేరస్తులపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని గుర్తుచేస్తూ వారిపై చర్యలు డిమాండ్ తో ఆమె ఓ చెట్టు ఎక్కింది. ఢిల్లీకి వచ్చి నాయకులను కలవడం ద్వారా తనకు న్యాయం జరుగుతుందని భావించినట్లు తెలిపింది. తొలుత చుట్టుపక్కల వారు ఎంత బ్రతిమాలినా చెట్టుదిగని ఆమె అనంతరం పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాత కిందికొచ్చింది. -
వర్గీకరణకు నా వంతు కృషి చేశా: మీరా కుమార్
యూపీఏ హయంలో ఎస్సీ వర్గీకరణకు తన వంతు కృషి చేశానని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు అప్పుడు వర్గీకరణ సాధ్యం కాలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన 17వ రోజు ఆందోళనలో మీరా కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని, వెనుకబాటు తనాన్ని గమనించి ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించానని ఆమె పేర్కొన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలని, అలా అందని పక్షంలో రిజర్వేషన్ల పంపిణీ ద్వారా అందరికీ న్యాయం జరిగేలా చూడాలని భావించానన్నారు. వర్గీకరణను సమర్థించే విధంగా జాతీయ స్థాయిలో నియమించిన ఉషామెహ్ర కమిషన్ నివేదిక ఉందని పేర్కొన్నారు. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని మీరా కుమార్ డిమాండ్ చేశారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే ప్రతిపక్షాల నుంచి.. జీఎస్టీకి మించిన మద్దతు లభిస్తుందని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆందోళనలో సఫాయి కర్మచారులు తదితరులు పాల్గొన్నారు. వర్గీకర ణపై మీరా కుమార్‌ది ద్వంద్వ వైఖరి ఎస్సీ వర్గీకరణ విషయంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మాల మహానాడు మండిపడింది. బీహార్‌లో ఎస్సీ వర్గీకరణను అడ్డుకున్న మీరా కుమారీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్గీకరణకు మద్దతు ఇవ్వడమే అందుకు నిదర్శనమని సంఘం జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య విమర్శించారు. మీరా కుమారి సొంత రాష్ట్రంలో మాత్రం దళితులు కలసి ఉండాలి.. కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం విడిపోవాలా అన్ని ఆయన ప్రశ్నించారు. ఆధిపత్య కుల నేతలు దళితులను రాజకీయ చదరంగంలో కేవలం పావులుగా వాడుకుంటున్నారని మండిడ్డారు. అలాంటి వారి రాజకీయాలను చైతన్యంతో ఎదరుర్కొవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద మాలమహానాడు చేపట్టిన ఆందోళన గురువారం 15వ రోజుకు చేరుకుంది. -
పార్లమెంటులో వర్గీకరణపై ప్రశ్నిస్తాం
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సాక్షి, న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. వర్గీకరణకు తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. వర్గీకరణ కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఆందోళన ఆదివారం 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. అణగారిన వ ర్గాల అభ్యున్నతి కోసమే అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లను ఒక కులమే దోచుకోవడం అన్యాయమని, వర్గీకరించుకొని రిజర్వేషన్లను పంచుకోవాలని అన్నారు. విభజన సమయంలో ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీల అమలుకు సీపీఎం పోరాటం చేస్తుందన్నారు. అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన వెంకయ్య నాయుడు ఆ హామీని అమలు చేయాలన్నారు. స్వార్థపరులే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని.. అంబేడ్కర్ వాదులు వర్గీకరణకు సహకరిస్తారని మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు కె.కె.ప్రసాద్ మాట్లాడుతూ వర్గీకరణతోనే భవిష్యత్తు తరాలకు వెలుగు లభిస్తుందన్నారు. -
'వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు లబ్ధి'
-
'వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు లబ్ధి'
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసేవరకూ జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ను సవరించడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు. వర్గీకరణతోనే మాదిగ ఉప కులాలకు లబ్ధి చేకూరుతుందని మందకృష్ణ తెలిపారు. వర్గీకరణకు మాలలు అడ్డుపడొద్దని ఆయన కోరారు. కాగా ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ తల పెట్టిన ఆందోళన కార్యక్రమాలు ఎనిమిదో రోజు కూడా కొనసాగుతోంది. -
హస్తినలో తెలంగాణ న్యాయవాదుల ఆందోళన
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో తెలంగాణ న్యాయవాదులు సోమవారం మహాధర్నా నిర్వహిస్తున్నారు. హైకోర్టు విభజన చేయాలంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆందోళన చేపట్టింది. హైకోర్టు విభజన అంశంపై నిర్వహిస్తున్న ఈ ధర్నాలో పది జిల్లాలకు చెందిన న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైకోర్టు విభజన, తెలంగాణలో ఆంధ్రా న్యాయమూర్తుల నియామకాలు రద్దు చేయాలని, న్యాయాధికారులపై సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాదుల ఆందోళనకు పలువురు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు. న్యాయాధికారుల విభజనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలన్నారు. హైకోర్టు విభజన జరిగేవరకూ తెలంగాణ న్యాయవాదులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
స్వార్థ రాజకీయాల కోసమే దళితుల విభజన
-
స్వార్థ రాజకీయాల కోసమే దళితుల విభజన
- ఢిల్లీలో మాల మహానాడు నిరసనలు ప్రారంభం సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను విభజించే కుట్రలు పన్నుతున్నార ని మాల మహానాడు మండిపడింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాల మహానాడు చేపట్టిన నిరసన కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల తీర్పులకు విరుద్ధమన్నారు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలను ఆదుకోవడానికి గతంలో సుప్రీం కోర్టు చేసిన సూచలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణపై సానుకూల నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమ సత్తా చూపుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాలు ఆగస్ట్ 12 వరకు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి శ్రీనివాస్, తెలంగాణ అధ్యక్షడు రమేష్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ ఆందోళన
25 రోజులపాటు నిరసన: మందకృష్ణ మాదిగ సాక్షి, న్యూఢిల్లీ : మంగళవారం నుంచి ఆగస్టు 12 వరకు 25 రోజులపాటు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన నిర్వహించనున్నట్టు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జూలై 19 నుంచి ఆగస్టు 12 వరకు జంతర్‌మంతర్ వద్ద మహా ప్రదర్శన, ధర్నాలు, దీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. జూలై 19న మాదిగ కళామండలి వేల డ ప్పులు-వేల గొంతుల మహా ప్రదర్శన, అనంతరం విభాగాల వారీగా జాతీయ, రాష్ట్ర, జిల్లా మండలి కమిటీల నాయకులు, వారి కుటుంబసభ్యులతో మహాధర్నా, నిరసన చేపట్టనున్నట్లు ప్రకటనలో వివరించారు. -
ఎస్సీల వర్గీకరణ చేసిందే... టీడీపీ
దీక్షకు మంద కృష్ణ మద్దతు కోరారు: రేవంత్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: గతంలో ఎస్సీల వర్గీకరణను చేసింది తెలుగు దేశం పార్టీనే అని, సుప్రీం కోర్టు తీర్పుతో దానిని పక్కన పెట్టాల్సి వచ్చిందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈనెల 19 నుంచి వచ్చే నెల 12 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేయనున్న దీక్షకు ఆయన మద్దతు కోరినట్లు రేవంత్ చెప్పారు. ఎన్టీఆర్ భవన్లో గురువారం మంద కృష్ణ టీటీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. అనంతరం రేవంత్, మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో, పొలిట్‌బ్యూరోలో చర్చించి మాదిగలకు న్యాయం చేస్తామన్నారు. ఢిల్లీలో తలపెట్టిన దీక్షకు అఖిలపక్షంతో కలసి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు రావాలని మంద కృష్ణ కోరారు. -
ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా
-
మాజీ జవాన్లపై పోలీసు జులుం
- ఢిల్లీలో ధర్నాచేస్తున్న వారిపై ఖాకీల బలప్రయోగం - ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ కోసం 62 రోజులుగా నిరసన - టెంట్లు తీసేసి, బలవంతంగా ఖాళీ చేయించిన పోలీసులు - ఖండించిన రాహుల్, మాజీ సైనికులకు సంఘీభావం - ‘ఓఆర్ఓపీ’అమలు తేదీ చెప్పాలని ప్రధానికి డిమాండ్ న్యూఢిల్లీ: రక్షణ శాఖలో ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ)’ అమలు చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 62 రోజులుగా ధర్నా చేస్తున్న మాజీ సైనికులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దేశం కోసం ప్రాణాలను అడ్డుపెట్టినవారిని భద్రతకు ముప్పంటూ బలవంతంగా ఖాళీ చేయించా రు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి మేరకు స్వాతంత్య్ర దిన భద్రతా ఏర్పాట్లలో భాగంగా మాజీ సైనికులను జంతర్ మంతర్ వద్ద నుంచి ఢిల్లీ పోలీసులు శుక్రవారం బలవంతంగా తరలించారు. ధర్నా వేదిక వద్ద టెంట్లను తొలగించారు. భద్రత పేరుతో పోలీసులు ఇలా మాజీ సైనికులపై బలప్రయోగం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం తర్వాత వెనక్కి తగ్గింది. ఘటనపై విచారం తెలిపింది. జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు ధర్నా కొనసాగించేందుకు అనుమతించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ సైనికులకు తెలిపారు. కేంద్రం అనుమతించినందున తొలగించిన టెంట్లను మళ్లీ ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీకి మాజీ సైనికులు విజ్ఞప్తిచేశారు. కాగా, ఓఆర్ఓపీ విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మాజీ సైనికులపై పోలీసులు బలప్రయోగాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ధర్నా స్థలికి చేరుకుని మాజీ జవాన్లకు సంఘీభావం ప్రకటించారు. ప్రధాని సులభంగా హామీలిస్తారని, కానీ వాటిని నెరవేర్చడంలో విఫలమవుతుంటారన్నారు. ‘యువతకు ఉద్యోగాల హామీనిచ్చారు. మేక్ ఇన్ ఇండియా విఫలమైంది. స్వచ్ఛ భారత్ ఫలప్రదం కాలేదు. తన కార్పొరేట్ మిత్రులకు భూ బిల్లును తెస్తానని హామీనిచ్చినా, సాధ్యం కాలేదు. ఓఆర్ఓపీనీ నెరవేర్చలేదు’ అని విమర్శించారు. అయితే, రాహుల్‌కు మాజీ సైనికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లుగా రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నించారు. జంతర్‌మంతర్ వద్దకు రావడం కంటే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రస్తావిస్తే బాగుండేదన్నారు. దీన్నిప్పుడు రాజకీయం చేయొద్దన్నారు. ఢిల్లీ సీఎంకేజ్రీవాల్ కూడా మాజీ సైనికులకు సంఘీభావం ప్రకటించారు. ఓఆర్ఓపీ అమలు గురించి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ప్రకటించాలని కోరారు. హామీని నెరవేరుస్తాం.. ఓఆర్ఓపీపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ డెహ్రాడూన్‌లో మాట్లాడుతూ.. ఈ విధానం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, అయినా హామీని నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వ పదవీకాలంలోపు ఈ హామీని నెరవేరుస్తామన్నామని, వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. ఓఆర్ఓపీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అరుణ్ జైట్లీ కూడా తెలిపారు. ఈ విధానం అమలుకు కసరత్తు జరుగుతోందన్నారు. రక్షణశాఖలో ఒకే ర్యాంకు, ఒకే సర్వీస్‌తో రిటైర్ అయ్యే సిబ్బందికి ఓఆర్ఓపీ విధానం అమలుచేయాలని మాజీ సైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం అమలైతే తక్షణం 22 లక్షల మంది మాజీ సైనికులు, 6 లక్షలకు పైగా అమరసైనికుల భార్యలు లబ్ధి పొందనున్నారు. అయితే, ఓఆర్ఓపీ త్వరలోనే అమలు కానుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జైపూర్‌లో విలేకరులకు తెలిపారు. మేం దేశ భద్రతకు ముప్పా? దేశం కోసం ఒకప్పుడు ప్రాణాలను అడ్డుపెట్టిన తాము ఇప్పుడు దేశ భద్రతకు ముప్పుగా కనిపిస్తున్నామా? అంటూ పోలీసుల తీరుపై మాజీ సైనికులు మండిపడ్డారు. ‘మమ్మల్ని ఎలా అనుమానిస్తారు? దేశాన్ని రక్షించిన మేం ఇప్పుడు ముప్పుగా మారామా?’ అని ఒకరన్నారు. ‘భద్రతా కారణాల రీత్యా మమ్మల్ని ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. కానీ నన్ను తోసేశారు. చొక్కా చిరిగింది’ అంటూ 82 ఏళ్ల మాజీ సైనికుడు తప్పుట్టారు. పంద్రా గస్టుకు ఒక రోజు ముందు తమ స్వాతంత్య్రాన్ని హరించడం ఆటవికమన్నారు. -
ప్రత్యేక హోదా కోసం.. ఢిల్లీలో జగన్నినాదం
-
హస్తినకు చేరుకున్న అభిమానులు
-
‘హోదా’ కోసం సమరభేరి
-
‘హోదా’ కోసం సమరభేరి
నేడు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా ఇవ్వడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా మరోసారి తన నిరసన గళాన్ని వినిపించబోతోంది. రాష్ట్రాన్ని విభజించే సమయంలో పార్లమెంట్ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై దాదాపు 15 నెలలవుతున్నా ఒక్క అడుగూ ముందుకు పడకపోగా ఈ విషయంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు రెండూ దోబూచులాడుతున్నాయి. దీని ఫలితంగా రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందన్న ఆందోళనతో ఈ అంశంపై తొలినుంచీ వివిధ మార్గాల్లో పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఇదే అంశంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రత్యేక హోదా అంశంపై ఒత్తిడి పెంచడం లక్ష్యంగా ఢిల్లీ గడ్డపై సోమవారం ధర్నా చేపడుతున్నారు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న జంతర్‌మంతర్(పార్లమెంటు వీధి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో) వద్ద చేపడుతున్న ఈ ధర్నాలో ఆయనతోపాటు వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, క్రియాశీల కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఈ ధర్నాకోసం వైఎస్సార్సీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జోరువాన కురుస్తున్న నేపథ్యంలో ధర్నా వేదిక నిర్మాణ పనులను సాయంత్రం నుంచి చేపట్టి రాత్రికల్లా పూర్తి చేశారు. పార్లమెంటు వీధి మొత్తం భారీ హోర్డింగులు, పార్టీ జెండాలతో నిండిపోయింది. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని హోర్డింగ్‌ల్లో రాశారు. వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాటును పార్టీ నేతలు ధర్నాస్థలి వద్ద ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ చేరిన జగన్ ఇదిలా ఉండగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదివారం రాత్రికి ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు పలువురు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సైతం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు పార్టీనేతలు, కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిన రెండు ప్రత్యేక రైళ్లు ఆదివారం రాత్రికి దేశ రాజధాని నగరానికి చేరాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభమవుతుంది. సాయంత్రం 3 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ధర్నాస్థలి నుంచి పార్లమెంట్‌కు మార్చ్ఫాస్ట్ నిర్వహించనున్నారు.‘హోదా’పై ఏరాష్ట్ర విషయంలోనైనా చట్టం చేశారా? వైఎస్సార్సీపీ ఆగ్రహం సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా అంశంపై చట్టం చేయాల్సిన అవసరం లేదని, దీనికి సంబంధించి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని వైఎస్సార్ సీపీ మండిపడింది. ఆదివారం రాత్రి ధర్నా స్థలిని పరిశీలించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ముఖ్య నేతలు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంక టేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, తదితరులు జంతర్‌మంతర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేదన్న వెంకయ్య వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ‘వెంకయ్యనాయుడు పచ్చిగా మాట్లాడారు. గతంలో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదాను పార్లమెంటులో చట్టం చేసి ఇచ్చారా? వెంకయ్యనాయుడు అలా మాట్లాడడం సరికాదు. అలాంటప్పుడు ఆనాడు సభలో పదేళ్లు కావాలని ఎలా అడిగారు? ఈ దేశ చరిత్రలో కేబినెట్ నిర్ణయమే తుది నిర్ణయం..’ అని పేర్కొన్నారు. -
స్పెషల్ స్టేటస్ ఏపీ రైట్
హైదరాబాద్: స్పెషల్ స్టేటస్ ఏపీ రైట్ నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం న్యూఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద రేపు నిర్వహించనున్న ధర్నాకు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరుకానున్నారు. వైఎస్ జగన్ ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నా అనంతరం వైఎస్ జగన్ నేతృత్వంలో వారంతా ఏపీ ప్రత్యేక హోదా కోసం మార్చ్ టు పార్లమెంట్ చేయనున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో న్యూఢిల్లీ బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు మాటలే చెప్పాం.... ఇకపై చేతల్లో చూపిస్తామని వైఎస్ఆర్ సీపీ నేతలు స్పష్టం చేశారు. రాజకీయ స్వార్థం కోసం అధికార టీడీపీ... ఏపీకి ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కిందని వారు ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఢిల్లీ ధర్నా ద్వారా పత్ర్యేక హోదా కోసం కేంద్రంపై పోరుబాటకు వైఎస్ఆర్ సీపీ శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత కేంద్ర, రాష్ట్రాలపైనే ఉందని వైఎస్ఆర్ సీపీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. రేపు వైఎస్ జగన్ ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు ఎన్ఆర్ఐ వైఎస్ఆర్ సీపీ తన మద్దతు ప్రకటించింది. -
డిల్లీలో రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగుల ధర్నా!