రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా ఇవ్వడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా మరోసారి తన నిరసన గళాన్ని వినిపించబోతోంది. రాష్ట్రాన్ని విభజించే సమయంలో పార్లమెంట్ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై దాదాపు 15 నెలలవుతున్నా ఒక్క అడుగూ ముందుకు పడకపోగా ఈ విషయంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు రెండూ దోబూచులాడుతున్నాయి.