రాష్ట్ర విభజనను నిరసిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాలో పాల్గొనేందుకు ఉద్యోగులు గురువారం ఉదయం హస్తిన చేరుకున్నారు.
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాలో పాల్గొనేందుకు ఉద్యోగులు గురువారం ఉదయం హస్తిన చేరుకున్నారు. గత రెండు రోజులుగా బస్సుల్లో, రైళ్లలలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే.
రెండు రోజులపాటు జంతర్ మంతర్ వద్ద జరగనున్న నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొంటారు. గురువారం క్రొవ్వొత్తుల ప్రదర్శన, శుక్రవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నాను చేపట్టనున్నట్లు ఫోరం ఛైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. ఇక సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొంటారు.