సమన్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ విజయమ్మ ధర్నా చేపట్టారు.
రాష్ట్ర విభజనపై సమన్యాయం చేయాలనే డిమాండ్తోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో పార్టీ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. విజయమ్మ ముందుగా ధర్నా ప్రాంగణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధర్నాలో కూర్చున్నారు.