
ఊవెంటనే ఒక ర్యాంకు, ఒక పెన్షన్: హజారే
ఎన్డీయే నేతృత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సైనిక సిబ్బందికి సంబంధించి ఒక ర్యాంకు, ఒక పెన్షన్ పథకంతో...
న్యూఢిల్లీ: ఎన్డీయే నేతృత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సైనిక సిబ్బందికి సంబంధించి ఒక ర్యాంకు, ఒక పెన్షన్ పథకంతో సహా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ధ్వజమెత్తారు. సైనికులకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు పోరాడుతానని తెలిపారు. ఒక ర్యాంకు, ఒక పెన్షన్ పథకం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగిన మాజీ సైనిక ఉద్యోగులకు హజారే మద్దతు తెలిపారు.
ఈ పథకం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా పర్యటించాలనుకుంటున్నట్లు చెప్పారు. పర్యటన ముగిసిన అనంతరం అక్టోబర్ 2న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం హజారేతో భేటీ అయ్యారు.