దేశ రాజధానిలో పోస్టర్ల రగడ!
దేశ రాజధానిలో న్యూఢిల్లీలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోస్టర్ల రగడ కొత్త రూపం దాల్చింది.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో న్యూఢిల్లీలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోస్టర్ల రగడ కొత్త రూపం దాల్చింది. ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని ఆగస్టు 3 తేదిన జంతర్ మంతర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టింది.
జంతర్ మంతర్ లో నిర్వహించే ధర్నాకు హాజరు కావాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ రూపొందించిన పోస్టర్లను అతికిస్తుండగా నలుగురు ఆప్ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆప్ నిరసన వ్యక్తం చేసింది.
బీజేపీ పోలీసులను రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని ఆప్ ఆరోపింది. ఢిల్లీలో నగరమంతటా బీజేపీ హోర్డింగ్స్ ఉన్నాయని, ఆమ్ ఆద్మి పార్టీ పోస్టర్లనే ఎందుకు టార్గెట్ చేస్తోందని పలువురు నేతలు ఆరోపించారు. ఎన్నికలకు భయపడి బీజేపీ పారిపోతోందని ఆప్ ఎద్దేవా చేసింది.