న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జామియా మిలియా ముస్లిం యూనివర్సిటీ మహిళా విద్యార్థులు గురువారం నిరసనలతో కదం తొక్కారు. ‘జామియా మహిళల విప్లవం వర్థిల్లాలి’ అంటూ నినాదాలు, పాటలతో హోరెత్తించారు. కాగా, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జామియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై గత ఆదివారం పోలీసులు లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు, పోలీసులు గాయాలపాలయ్యారు. అయితే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని విద్యార్థులు ఆరోపించారు. మహిళా విద్యార్థుల గదుల్లోకి వెళ్లి మరీ బయటకు తరిమికొట్టారని వాపోయారు. కాగా, జామియా విద్యార్థులకు దేశవ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment